twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాళ్ల మాదిరి కాదు, నో పాలిటిక్స్ అని తేల్చేసాడు (ఫోటోలు)

    By Bojja Kumar
    |

    చెన్నై: స్టార్ హీరోలంతా వరుస పెట్టి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి తమ మద్దతు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో కూడా సినిమా తారలు ఎక్కువ మంది మోడీ వైపే మొగ్గు చూపుతున్నారు. తమిళ నెం.1 స్టార్ హీరో రజనీకాంత్‌, మరో స్టార్ హీరో విజయ్ ఈ లిస్టులో ఉన్నారు.

    ఈ నేపథ్యంలో మరో తమిళ స్టార్ హీరో అజిత్ కూడా మోడీకి మద్దతు ప్రకటిస్తారని అంతా ఊహించారు. అయితే తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని, ఎవరికీ మద్దతు ప్రకటించాలనే ఉద్దేశ్యం కూడా లేదని తేల్చి చెప్పేసారు. రాజకీయాల్లో తల దూరిస్తే అనవసర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందనే అజిత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    హీరో విజయ్ విషయానికొస్తే....తన గత సినిమాల విడుదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కొన్ని రాజకీయ పార్టీల వ్యవహారమే ఇందుకు కారణం. తనపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న సదరు రాజకీయ పార్టీలకు చెక్ పెట్టేందుకే విజయ్ బీజేపీకి తన మద్దతు ప్రకటించినట్లు స్పష్టమవుతోంది.

    అజిత్ రావాలని కోరుకుంటున్నారు

    అజిత్ రావాలని కోరుకుంటున్నారు


    అజిత్ లాంటి హీరోల మద్దతు కోసం పలు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఆయన మద్దతు ఉంటే తమ ఓటు బ్యాంకు పెరుగుతుందని పలు పార్టీలు భావిస్తున్నాయి.

    భారీగా అభిమాన బలం

    భారీగా అభిమాన బలం


    హీరో అజిత్‌కు భారీగా అభిమాన బలం ఉంది. తమిళనాడు వ్యాప్తంగా ఆయన అభిమాన సంఘాలు ఉన్నాయి.

    నో ఎండార్స్‌మెంట్

    నో ఎండార్స్‌మెంట్


    ప్రస్తుతం రాజకీయాలు చాలా చెత్తగా మారిన నేపథ్యంలో ఇందులో అడుగు పెడితే తనకు ఆ బురద అంటుకుంటుందని, అందుకే రాజకీయాలపై తనకు ఇంట్రస్టు లేదని అజిత్ తన సన్నిహితులతో అంటున్నారట.

    సినిమాలే సర్వస్వం...

    సినిమాలే సర్వస్వం...


    హీరో అజిత్‌కు సినిమాలే సర్వస్వమని అంటున్నారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని, సినిమా రంగంలోనే తాను కొనసాగుతానని అజిత్ తేల్చి చెప్పారు.

    అభిమానులు కాస్త నిరాశ పడ్డారు

    అభిమానులు కాస్త నిరాశ పడ్డారు

    అయితే ఇతర హీరోలు రాజకీయాలతో సంబంధం పెట్టుకోవడం వల్ల వాళ్ల అభిమానులు కూడా రాజకీయంగా ఎదుగుతున్నారు. అయితే అజిత్ రాజకీయాలకు దూరంగా ఉండటంపై రాజకీయాలపై ఆసక్తిగా ఉన్న కొందరు అభిమానులు కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    
 Vijay's meeting with Narendra Modi has become a talk of the town. The Tamil actor's decision to meet the BJP Prime Minstertial candidate has come as a surprise to many, as his earlier political connections had backfired him. After the Velayudham actor, now, all eyes are on Ajith Kumar, who has stayed away from politics all these years.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X