twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోడికి సపోర్టు ఇస్తావా అంటూ మండిపడుతున్నారు

    By Srikanya
    |

    అలీగఢ్‌: భాజపా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని ప్రశంసలతో ముంచెత్తిన బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌, ఆయన తండ్రి సలీం ఖాన్‌ల తీరుపై ముస్లిం మేధావుల వేదిక ఒకటి మండిపడింది. కేవలం తమ వ్యాపార ప్రయోజనాల కోసమే సల్మాన్‌, సలీంలు మోడీని ప్రస్తుతించారంటూ 'ఫోరం ఫర్‌ ముస్లిం స్టడీస్‌ అండ్‌ అనాలిసిస్‌' (ఎఫ్‌ఎంఎస్‌ఏ) అసంతృప్తి వ్యక్తం చేసింది.

    అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయానికి చెందిన 'ఎఫ్‌ఎంఎస్‌ఏ' ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. నరేంద్ర మోడీకి సంబంధించిన ఉర్దూ వెబ్‌సైట్‌ను సలీంఖాన్‌ ప్రారంభించడాన్ని తీవ్రంగా ఖండించింది. ఇది కేవలం రాజకీయ అవకాశవాదాన్ని సూచిస్తుందని పేర్కొంది. కేవలం వ్యాపార ప్రయోజనాల కోసమే ఈ పనికి పాల్పడ్డారంది.

    Aligarh Muslim body slams Salim Khan, Salman for praising Modi

    ఇటీవల యూపీ సర్కారు నిర్వహించిన సైఫై మహోత్సవంలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ పాల్గొనడాన్ని ఖండించింది. ఓ వైపు శిబిరాల్లో తలదాచుకున్న ముజఫర్‌నగర్‌ అల్లర్ల బాధితులు...ముఖ్యంగా చిన్నారులు ఎముకలు కొరికే చలితో బాధపడుతుంటే...మరోవైపు అక్కడ ఉత్సవాల్లో పాల్గొనడం ఏమిటని సల్మాన్‌ను ప్రశ్నించింది. ఇప్పుడేమో గుజరాత్‌లో నరమేధానికి కారణమన మోడీతో చేతులు కలపడం ఏమిటని ప్రశ్నించింది.

    English summary
    The Forum for Muslim Studies and Analysis has slammed Bollywood actor Salman Khan and his father and film writer Salim Khan for praising Narendra Modi for "pure commercial gains". FMSA, a body of Aligarh Muslim University, mostly comprising Muslim intellectuals, passed a resolution her yesterday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X