twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నవ్వుల గని ( 'జంప్‌ జిలాని' ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్: అల్లరి నరేష్ సినిమాలకు వాళ్లు వీళ్లు అని తేడాలేకుండా అంతా వెళ్లి కాస్సేపు నవ్వుకుని వద్దామనుకుంటారు. అయితే అతను ఈ మధ్యన వైవిధ్యం పేరుతో చేస్తున్న లడ్డు బాబు లాంటి సినిమాలు వర్కవుట్ కావటం లేదు. కామెడీకోసం ఆశించి వెళ్లిన వారికి నిరాశే మిగులుస్తున్నాయి. ఈ నేఫద్యంలో ఇది ప్రయోగం కాదని, రెగ్యులర్ అల్లరి నరేష్ సినిమా అంటూ దర్శక,నిర్మాతలు చెప్తూ వస్తున్న చిత్రం ఇది. దానికి తోడు ఇది తమిళంలో విజయవంతమైన 'కలగలపు' కి రీమేక్ కావటం కూడా సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. తొలిసారిగా అల్లరి నరేష్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

    తాత సంపాదించిన హోటల్‌ ని అబివౄఎద్ధి చేయాలనే లక్ష్యంతో మనవళ్లు ఏం చేసారనే కథతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇది ఇద్దరు అన్నదమ్ములు కథ. వారసత్వంగా వచ్చిన ఆస్తిని కాపాడుకోవటానికి హీరోలు ఇద్దరూ ఎన్ని పాట్లు పడ్డారన్నది ఈ చిత్రం కథాశం.

    అల్లరి నరేష్ మాట్లాడుతూ.... ''సీమశాస్త్రిలోని సుబ్రహ్మణ్యశాస్త్రి పాత్ర 'గమ్యం'లో గాలిశీను కలిపితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో నా పాత్ర అలా ఉంటుంది''అన్నారు‌. తమిళంలో 'కలగలప్పు' చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశామన్నారు. హీరోగా ద్విపాత్రాభినయం చేయడం సంతోషంగా ఉందని, నాన్నగారి (ఈవీవీ) 'హలోబ్రదర్' తరహాలో ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించబోతున్నామని నరేష్ అన్నారు.

     Allari Naresh's Jump Jilani preview

    ఇషా చావ్లా మాట్లాడుతూ- తన పాత్ర ఈ సినిమాలో ఓ ప్రత్యేకంగా అందరినీ డామినేట్ చేసేలా ఉంటుందని తెలిపారు. ఆరోగ్యానికి సంబంధించిన అధికారిగా, రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే తన పాత్ర గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందని, తొలుత పూర్తి స్థాయి కామెడీ చిత్రమనగానే నటించడానికి భయపడ్డానని, ఎందుకంటే యాక్షన్ కంటే రియాక్షన్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకోవాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. ఓ రకంగా హీరో అల్లరి నరేష్, దర్శకుడు సత్తిబాబుల సహకారంతోనే ఈ చిత్రంలో తాను నటించానని, సినిమా పరిశ్రమలో కూడా అందరూ జంప్ జిలానిలే ఉంటారన్న సంగతి తెలిసిందేనని ఆమె అన్నారు.

    దర్శకుడు ఇ.సత్తిబాబు మాట్లాడుతూ... ''తమిళంలో విజయవంతమైన 'కలగలపు' చిత్రానికి రీమేక్‌ ఇది. కానీ మేం మాతృకలో చాలా మార్పులు చేసి ఈ సినిమాని తీశాం. అక్కడ ఇద్దరు హీరోలు నటిస్తే... ఇక్కడ ఆ రెండు పాత్రల్ని అల్లరి నరేషే చేశారు. తను ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమాలో నటించారు. ఇదివరకు ద్విపాత్రాభినయంతో కూడిన సినిమాలు చాలానే వచ్చాయి. వాటికి పూర్తి భిన్నమైన చిత్రమిది. ఇద్దరు నరేష్‌లు ఎప్పుడూ తెరపై కనిపిస్తూనే ఉంటారు. రెండు పాత్రల నేపథ్యంలోనే ఇందులో మూడు పాటలు సాగుతాయి. ఇషాచావ్లా, స్వాతి దీక్షిత్‌ చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు''అని తెలిపారు సత్తిబాబు.

    అంబికా కృష్ణ మాట్లాడుతూ... తమిళంలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమవుతున్న "కలగలుపు'' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని ఈ సినిమా రీమేక్ హక్కులు కొన్నాము. ఇదే చిత్రాన్ని యూటీవి మలయాళంలో, హిందీ లో రీమేక్ చేస్తోంది. తమిళంలో అంజలి పోషించిన పాత్రకు ఇషా చావ్లాని ఎంపిక చేశాము. తెలుగు లో కూడా ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది అన్నారు.

    నిర్మాత మాట్లాడుతూ... ''తమిళంలో విజయంవంతమైన 'కలగలుపు' చిత్రానికిది రీమేక్‌. సత్తిబాబు, నరేష్‌ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన సినిమాలన్నీ విజయం సాధించాయి. మా హీరో నటించిన "సుడిగాడు'' చిత్రం తరువాత మళ్ళీ ఈ సినిమాలో రెండు పాత్రలు పోషించారు. దర్శకుడు సత్తిబాబు, నరేష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ విజయం సాధించాయి. అనుభవమున్న ఆర్టస్టులతో, టాలెంటెడ్ టెక్నీషియన్స్ తో మేం నిర్మిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందిస్తామని ఖచ్చితంగా ఎప్పగలం. ఈ చిత్రం కూడా అదేస్థాయిలో ప్రేక్షకుల్ని అలరిస్తుందని ఆశిస్తున్నాం'' అన్నారు.

    పతాకం: రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్
    నటీనటులు: అల్లరి నరేష్, ఇషాచావ్లా, స్వాతి దీక్షిత్‌ ,కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళి, ఎమ్మెస్‌ నారాయణ, చలపతిరావు తదితరులు
    కథ: సుందర్‌ సి,
    మాటలు: క్రాంతిరెడ్డి సకినాల,
    రచనా సాయం: సతీష్‌ వేగేశ్న,
    పాటలు: రామజోగయ్య శాస్ర్తి,
    సంగీతం: విజయ్‌ ఎబెంజర్‌,
    ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర,
    కళ: కిరణ్‌కుమార్‌,
    కూర్పు: గౌతంరాజు.
    నిర్మాణం: వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ
    సమర్పణ: అంబికా కృష్ణ
    స్క్రీన్ ప్లే,దర్శకత్వం: ఇ.సత్తిబాబు
    నిర్మాత : అంబికా రాజా
    విడుదల తేదీ: 12, జూన్ 2014

    English summary
    Allari Naresh's 'Jump Jilani' is getting ready to hit the screens today. Jump Jilani has Allari Naresh in a dual role. This has been directed by E Satti Babu. Jump Jilani is the official remake of the Tamil film ‘Kalakalappu’. Vijay Ebenzer is scoring the music and Isha Chawla is the female lead.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X