twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తప్పుడు ప్రచారం అంటూ అల్లు అర్జున్ ఆవేదన

    By Srikanya
    |

    హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పోలీసులకు అల్లు అర్జున్ దొరకాడంటూ ఓ వీడియో ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి ఈ వీడియో సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో, వెబ్ సైట్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ విషయం గమనించిన అల్లు అర్జున్ వెంటనే స్పందించారు. వాస్తవం ఏమిటో వివరించే ప్రయత్నం చేసారు. తనను తప్పుగా చిత్రీకరించే విధంగా ప్రచారం చేయటాన్ని ఖండించారు.

    Allu Arjun quashes all rumors
    అల్లు అర్జున్ ఫేస్ బుక్ లో సమాధానమిస్తూ... 'పోలీసులు నా కారును ఆపినట్లు వస్తున్న వీడియో పై క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. పోలీసులు నన్ను తాగానా లేదా అని చెక్ చెయ్యడం కోసం బ్రీతలైజర్ ని ఊదమన్నారు. కానీ అక్కడ చాలా మంది మీడియా వారు ఉండడంతో నేను కాస్త ఇబ్బందికి గురయ్యాను. ఆ తర్వాత వాళ్ళే నన్ను పక్కకి తీసుకెళ్ళి టెస్ట్ చేసి అంతా బాగుందని పంపించేసారు.

    నాకు తెలిసి హైదరబాద్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఎవరన్నా పట్టుబడితే ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా వదలరు. ఈ విషయం లేకుండా ఓ వీడియో నెట్ లో తిరుగుతోంది. ఇలాంటి నెగటివ్ పబ్లిసిటీ చెయ్యడం మానేయండి. ఒక వేల నును డ్రింక్ చేసినా ఎప్పుడూ వాక్ చేసుకుంటూ వెళతా లేకపోతే ఎవరినన్నా డ్రాప్ చేయమని అడిగి వెళ్తాను. ఇలాంటి వీడియో ని రిలీజ్ చేసి నెగటివ్ గా ప్రచారం చేయడం అనేది అస్సలు బాగోలేదని' అల్లు అర్జున్ అన్నాడు.

    English summary
    
 Quashing all allegations,Allu Arjun himself took to his face book page and condemned these reports.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X