twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రూ.100 కోట్లు సాధించటం కొలమానం కాదు

    By Srikanya
    |

    Amol Palekar
    బెంగళూరు : ఇప్పుడు ప్రతీ నిర్మాత తన లక్ష్యం మినిమం వంద కోట్లు సాధించటమని చెప్తున్నారు. అయితే రూ.100 కోట్లు సాధించిన సినిమాల కంటే సమకాలీన, ప్రాంతీయ అంశాలపై తీసిన చిత్రాలే ప్రమాణాలకు కొలమానాలని బాలీవుడ్‌ నటులు, దర్శకులు అమోల్‌ పాలేకర్‌ అభిప్రాయపడ్డారు. సోమవారం బెంగళూరులో మీట్‌ ద ప్రెస్‌లో పాల్గొని మాట్లాడారు.

    మసాలా, ఫార్ములా చిత్రాలకు ఏ మాత్రం వ్యతిరేకిని కాను. కేవలం వంద కోట్ల రూపాయలు రాబట్టుకోవాలనే దృక్పథంతో చిత్రాలను నిర్మించటం తగదని భావిస్తా. రూ.100 కోట్ల బడ్జెట్‌తో చిత్రాలను నిర్మించి.. అంతేస్థాయిలో వసూళ్లు రాబట్టి చివరకు ఇరానీ, యూరోపియన్‌ చిత్రాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడటం తగదన్నారు. ఇరానీ చిత్రాలు రూ.కోటి బడ్జెట్‌తో నిర్మితమైనవేనని గుర్తించాలి.

    కళాత్మక చిత్రాలను తీయాలనే దృక్పథం ఉంటే చాలు. మనసు పెడితే సమకాలీన, ప్రాంతీయ, సంస్కృతి ప్రాధాన్యత కల్గిన చిత్రాలను తీయటం ఓ సమస్య కాబోదు. మొత్తం సినిమా కథను రాయటం.. చివరి రెండు లైన్లలో కళాకారుల నటనను వివరించటం.. అదే ఓ సమీక్ష, విమర్శ కాదు. కథల్లో సత్తా ఉన్నంత వరకూ ఎటువంటి సమీక్షలు, విమర్శలు సినిమా వ్యాపారాన్ని అడ్డుకోలేవు.

    గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీపై ఇటీవల ప్రముఖ నేపథ్య గాయని లతామంగేష్కర్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించబోను. నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాదు. 45 ఏళ్ల సినీజీవితంలో సాధించిన అనుభవాల్ని కొత్త తరానికి పంచుతా. చిత్రలేఖనం, క్రికెట్‌ అంటే ప్రాణం. బెంగళూరు నగరం ఎంతోగానో ఆకట్టుకొంది. కర్ణాటకలో చిత్రాలు తీయమని ఎవరైనా అడిగితే ఆనందంగా ఒప్పుకుంటానని అమోల్‌ పాలేకర్‌ అన్నారు.

    English summary
    
 At a media interaction organized by the Bangalore Press Club and Bangalore Reporters' Guild on Monday, Palekar spoke about his association with the city, its people and its cinema. He said commercialization had grown bigger, due to the change in the mindset of the people. He feels its best for regional filmmakers to make their mark in a unique way than compete with big budget commercial films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X