twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచు లక్ష్మి సిగరెట్ తాగే విషయాన్ని హైలెట్ చేస్తూ...!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మంచు లక్ష్మి, సీనియర్ నరేష్, ఆమణి, కృష్ణుడు, నాగ శౌర్య, అభిజిత్, షామిలి, అమితారావు, రిచా పనయ్, చైతన్య కృష్ణ, పృథ్వి, వెన్నెల కిషోర్, కొండవలస, దువ్వాసి మోహన్ తదితరులు నటిస్తున్న చిత్రం 'చందమా కథలు'. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనిల్ సుంకర సమర్పణలో ఈ చిత్రం విడుదలవుతోంది

    ఈ నేపథ్యంలో రిలీజ్ డేట్‌తో కూడిన పోస్టర్లు విడుదల చేసారు. ఈ పోస్టర్లపై మంచు లక్ష్మి సిగరెట్ తాగుతున్న ఫోటోను ముద్రించారు. ఇలాంటి పోస్టర్ల వల్ల అందరి దృష్టిని త్వరగా ఆకట్టుకోవచ్చనే ఉద్దేశ్యంతోనే సిగరెట్ తాగే విషయాన్ని హైలెట్ చేస్తూ పోస్టర్లు విడుదల చేసినట్లు స్పష్టమవుతోంది.

    Anil Sunkara to release 'Chandamama Kathalu' on April 25

    ఇటీవల విడుదలైన ట్రైలర్లో కూడా మంచు లక్ష్మి సిగరెట్ తాగుతూ, మందుకొడుతూ కనిపించారు. దీన్ని బట్టి సినిమాలో ఆమె పాత్ర విభిన్నంగా ఉంటుందని స్పష్టమవుతోంది. 'ఎల్బీడబ్ల్యూ' చిత్రంతో దర్శకుడిగా పరిచయమై 'రొటీన్‌ లవ్‌స్టోరీ' చిత్రంతో కమర్షియల్‌ సక్సెస్‌ను అందుకున్న ప్రవీణ్‌ సత్తారు తాజాగా తెరకెక్కిస్తున్న మూడవ చిత్రం 'చందమామ కథలు'.

    దర్శకుడు మాట్లాడుతూ... ప్రతి మనిషి నిత్య జీవితంలో ఎన్నో చోట్ల తనకి తారసపడే వ్యక్తుల ద్వారా, ఎదురయ్యే సంఘటనల ద్వారా సమాజంలో మంచి చెడుల్ని చూస్తుంటాడు. వాటి మధ్య వ్యత్యాసాలను తెలుసుకొని మరి కొన్నింటిని నేర్చుకుంటుంటాడు. అలాగే కొన్ని అనుభవాలను కూడా సంపాదిస్తుంటాడు. అటువంటి కొన్ని పాత్రల అనుభవాలు, పర్యావసనాలు, ఫలితాల సమాహారమే 'చందమామ కథలు'. సినిమా కథాంశం' అన్నారు. ఎ వర్కింగ్‌ డ్రీమ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై చాణక్య బూనేటి నిర్మిస్తున్నారు. మంచు లక్ష్మిప్రసన్న, చైతన్య కృష్ణ, సీనియర్‌ నటుడు నరేష్‌, ఆమని, కృష్ణుడు, కిశోర్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:మిక్కీ జె మేయర్‌, ఎడిటింగ్‌:ధర్మేంద్ర కాకర్ల.

    English summary
    Popular producer Anil Sunkara, known for Telugu films such as "Dookudu" and "Legend", will release forthcoming Telugu anthology film "Chandamama Kathalu" under his home banner April 25 worldwide. Featuring an ensemble cast of Naresh, Aamani, Lakshmi Manchu, Krishnudu, Chaitanya Krishna and Richa Panai, "Chandamama Kathalu" is a title inspired by the children's book of the same name.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X