twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాప్‌-3లో మెగా హీరోస్...అల్లు శీరీష్ కూడా!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాలంటే క్రేజ్ ఏ రేంజిలో ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా ఎలా ఉన్నా ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోతాయ్. ఇక హిట్ టాక్ వస్తే నిర్మాతలకు లాభాల పంట ఖాయం. మెగాస్టార్ చిరంజీవితో మొదలైన ఈ వెండితెర హవాను ఇప్పటికీ కొనసాగించడంలో మెగా హీరోలు సక్సెస్ అయ్యారు.

    మెగా ఫ్యామిలీ హీరోల హవా కేవలం వెండి తెరకు మాత్రమే పరిమితం కాలేదు. బుల్లితెరపై కూడా తమకు సాటి మరెవరూ లేరని నిరూపిస్తున్నారు. ఈ 2014 సంవత్సరం బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ సాధించిన మొగటి మూడు సినిమాలు మెగా ఫ్యామిలీకి చెందినవే కావడం విశేషం.

    పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం టీఆర్పీ రేటింగుల్లో అత్యకంగా 19 పాయింట్లు సాధించింది. ఇక ఆ తర్వాతి స్థానంలో రామ్ చరణ్ నటించిన 'ఎవడు' చిత్రం ఉంది. ఎవడు చిత్రం 10.14 పాయింట్లు సాధించింది. ఇక నిన్నగాక మొన్న వచ్చిన అల్లు శిరీష్ టాప్ 3లో చోటు దక్కించుకోవడం గమనార్హం. అల్లు శిరీష్ నటించిన 'కొత్త జంట' చిత్రం 9.4 పాయింట్లు సాధించి టాప్ 3 పొజిషన్ సొంతం చేసుకుంది.

    పవన్, చరణ్, శిరీష్

    పవన్, చరణ్, శిరీష్

    పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ్, అల్లు శిరీష్ టాప్ పొజిషన్లు దక్కించుకోవడంతో మెగా అభిమానులు హ్యాపీగా ఉన్నారు.

    అత్తారింటికి దారేది

    అత్తారింటికి దారేది


    పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది' చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. సమంత, ప్రణీత హీరోయిన్లు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత.

    ఎవడు

    ఎవడు


    రామ్ చరణ్ ‘ఎవడు' చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. శృతి హాసన్ హీరోయిన్. దిల్ రాజు నిర్మాత.

    కొత్త జంట

    కొత్త జంట


    అల్లు శిరీష్ కొత్త జంట చిత్రానికి మారుతి దర్శకుడు. రెజీనా హీరోయిన్.

    English summary
    Attarintiki Daredhi, Yevadu and Kotta Janta became huge hits at the box office, and when aired on TV also garnered huge TRP’s.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X