Englishবাংলাગુજરાતીहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

‘అత్తారింటికి దారేది’ పైరసీపై సెలబ్రిటీల యుద్ధం

Posted by:
Updated: Monday, September 23, 2013, 18:39 [IST]
 

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది' చిత్రం విడుదలకు ముందే పైరసీకి గురి కావడంతో టాలీవుడ్ సినీ పరిశ్రమ మొత్తం షాకైంది. వెంటనే పైరసీకి వ్యతిరేకంగా అంతా గళమెత్తారు. పైరసీని అరికట్టాలంటూ సినీ అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు పలువురు సెలబ్రిటీలు చేసిన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా పైరసీకి వ్యతిరేకంగా యుద్దం మొదలు పెట్టారు.

‘అత్తారింటికి దారేది' చిత్ర హీరోయిన్ సమంతతో పాటు, ప్రముఖ దర్శకుడు రాజమౌళి, హీరో సిద్ధార్థ్, హీరో రామ్, దర్శకుడు హరీష్ శంకర్, దేవా కట్ట, నిర్మాత బిఏ రాజు, కమెడియన్ వెన్నెల కిషోర్, రచయిత బివిఎస్ రవి, నిర్మాత అనిల్ సుంకర, హీరో సుమంత్, అల్లు శిరీష్ తదితరులు పైరసీకి వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టారు.

‘విడుదలకు ముందు అత్తారింటికి దారేది చిత్రం పైరసీకి గురి కావడం చాలా బాధాకరం. పైరసీని ఎవరూ ప్రొత్సహించొద్దు. అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. పైరసీ గురించిన సమాచారం 18004250111, 9490164545 నెంబర్లకు ఫోన్ చేసి చెప్పండి లేదా legal@apfilmchamber.comకి ఈ మెయిల్ చేయండి' అరి రాజమౌళి పేర్కొన్నారు.

ఇతర సెలబ్రిటీలు ఈ పైరసీపై ఏమన్నారు అనే వివరాలు స్లైడ్ షోలో తెలుసుకుందాం....

సిద్ధార్థ

సినిమా విడుదలకు ముందే లీక్ అవ్వడం క్షమింపరానిది. ఇది బాధాకరం. తెలుగు సినీ పరిశ్రమకు ఇదో షాక్. ఇలాంటి పవన్ కళ్యాన్ సినిమాను ఏమీ చేయలేవు. తప్పకుండా సినిమా పెద్ద హిట్టవుతుంది. అభిమానులు సినిమాకు మద్దుతుగా నిలవాల్సిన సమయం వచ్చింది. మీరు తెలుగు సినిమా అభిమానులైతే పైరసీ అరికట్టండి.

హరీష్ శంకర్

ఈ చర్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది తీవ్రమైన నేరం. దయచేసి ఎవరూ పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. పైరసీ చేస్తున్న వారికి అంతా కలిసి గుణపాఠం చెప్పాలి. దయచేసి ఎవరూ ఇంటర్నెట్ లింకులను సోషల్ నెట్వర్కింగులో షేర్ చేయవద్దు.

హీరో రామ్

అత్తారింటికి దారేది పైరసీ సీడీలను, లింకులను ఎవరూ చూడొద్దు, డౌన్ లోడ్ చేయొద్దు, షేర్ చేయవద్దు. అత్తారింటికి దారేది చిత్రానికి అందరూ మద్దతుగా నిలవండి. పైరసీని అరికట్టండి.

అల్లు శిరీష్

అత్తారింటికి దారేది పైరసీ విషయం విని చాలా దిగులు పడ్డాను. ఇదొక దురదృష్ణకరమైన సంఘట. తెలుగు సినిమా లవర్స్ ఎవరూ పైరసీ క్లిప్పులను ఎవరూ చూడొద్దు. పరిశ్రమకు, నిర్మాతలకు అంతా సహకరించాలి.

సమంత

సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసాం. చాలా డబ్బులు ఖర్చుపెట్టారు. పైరసీని ఎవరూ ప్రొత్సహించొద్దు. పైరసీని అరికట్టి ఒక మంచి సినిమాను గెలిపించండి. పైరసీ లింకులను ad@apfilmchamber.com మెయిల్ చేయండి

సుమంత్

అత్తారింటికి దారేది చిత్రం విడుదలకు ముందే లీకవ్వడం బాధాకరం. పైరసీ లింకులను legal@apfilmchamber.comకు మెయిల్ చేయండి. లేదా 09490164545 ఫోన్ చేసి చెప్పండి. అత్తారింటికి చిత్రానికి మద్దతుగా నిలవండి.

అనిల్ సుంకర

తెలుగు సినీ పరిశ్రమను కాపాడండి. పైరసీని అరికట్టండి. అత్తారింటికి చిత్రానికి మద్దతుగా నిలవండి. ఈ చిత్రాన్ని కేవలం థియేటర్లలోనే చూడండి. ఈచిత్రానికి పెద్ద విజయం అందించండి.

బివిఎస్ రవి

మీడియాకు, పోలీసులకు, అభిమానులకు, అందరు హీరోలకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నిర్మాతలకు అందరూ సహకరించండి. పైరసీని అరికట్టండి. సినిమాను థియేటర్లలో మాత్రమే చూసి విజయవంతం చేయండి.

వెన్నెల కిషోర్

వెబ్‌లో ఎక్కడైనా పైరసీ లింకులు కనిపిస్తే legal@apfilmchamber.comకి మెయిల్ చేయండి. పైరసీని అరికట్టండి. ఈ నెల 27న సినిమా వస్తోంది. థియేటర్లలోనే సినిమా చూడండి.

బిఏ రాజు

ఏమైనా పైరసీ లింకులు కనిపిస్తే...ad@apfilmchamber.com లేదా legal@apfilmchamber.comకి మెయిల్ చేయండి.

దేవా కట్ట

పైరసీని అరికట్టండి. థియేటర్లు ఇప్పటి నుంచే అడ్వాన్స్ బుకింగ్ మొదలు పెడితే మంచింది. అత్తారింటికి చిత్రానికి మద్దతుగా నిలవండి.

Story first published:  Monday, September 23, 2013, 17:35 [IST]
English summary
Power Star Pawan Kalyan has not only earned huge amount of fans, but has also got a large number of well-wishers in Tollywood, who are shocked by the news about the alleged leak of his upcoming movie Attharintiki Daaredhi prior its official release. Director SS Rajamouli, actor Siddharth and many others, who disappointed with this development, have raised their voice against the piracy. They are also requesting their fans to inform if they find any link with pirated video of the movie.
మీ వ్యాఖ్య రాయండి

Please read our comments policy before posting

Click here to type in Telugu
Subscribe Newsletter
Coupons
My Place My Voice