twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అత్తారింటికి దారేది'కి మరో పురస్కారం

    By Srikanya
    |

    హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం'అత్తారింటికి దారేది'. ప్రేక్షకుల అభిమానం, విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'అత్తారింటికి దారేది'కి మరో పురస్కారం వచ్చింది. ఉత్తమ చిత్రాలకు ఏటా ఇచ్చే బి.నాగిరెడ్డి పురస్కారాన్ని 2013కి గాను 'అత్తారింటికి దారేది' చిత్రానికి అందించనున్నారు. ఈ విషయాన్ని విజయ మెడికల్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ బాధ్యులు బి.వెంకట్రామిరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

    బి.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ... ''అత్తారింటికి దారేది' కుటుంబ విలువలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ చిత్ర నిర్మాత భోగవల్లి ప్రసాద్‌కి బి.నాగిరెడ్డి పురస్కారాన్ని అందజేయాలని నిర్ణయించాము''అన్నారు బి.వెంకట్రామిరెడ్డి. ఈ నెల 20న హైదరాబాద్‌లో పురస్కార కార్యక్రమం జరుగుతుంది.

    మరో ప్రక్క రిలీజైన రోజు నుంచి కలెక్షన్స్ దుమ్ము రేపిన ఈ చిత్రం వల్ల గవర్నమెంట్ కు ప్రత్యక్ష్యంగా అంటే పన్నుల రూపంగా ఈ సంవత్సరం ఎక్కువ లాభం వచ్చిందని చెప్తున్నారు. ఈ చిత్రం భారీగా ప్రభుత్వానికి వినోదపు పన్ను కట్టింది. దాదాపు నాలుగు నుంచి ఏడు కోట్లు వరకూ టాక్స్ ఉండి ఉంటారని అంచనాలు వేస్తున్నారు. కేవలం ఆంధ్రాలోనే కాదు ఉత్తరాదిని కూడా ఈ చిత్రం బాగానే వర్కవుట్ అవటంతో బాగానే టాక్స్ పేచేసి ఖజనాకు లాభం చేకూర్చింది.

     B. Nagireddy award for Atharintiki Daredhi producer

    చిత్రం నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ మాట్లాడుతూ... ''ఈ సినిమా విడుదలకు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో అందరికీ తెలిసిందే. క్లిష్టసమయంలో పవన్‌, త్రివిక్రమ్‌లు అండగా నిలబడ్డారు. పైరసీకి గురైనా.. రికార్డు వసూళ్లు దక్కించుకోవడం ఆనందంగా ఉంది. తెలుగు సినీ చరిత్రలో 'మగధీర' ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకొంది. ఆ చిత్ర నిర్మాణంలో నేను భాగస్వామిని. ఇప్పుడు 'అత్తారింటికి దారేది' కూడా వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాకీ నేనే నిర్మాతను. ఇలా రెండు మేటి చిత్రాల్లో భాగం పంచుకొన్నందుకు ఆనందంగా ఉంది'' అన్నారు.

    సమంత మాట్లాడుతూ '' ఇంత మంచి సినిమాలో అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది. నేను పవన్‌ కల్యాణ్‌ అభిమానిని. ఆయనతో పనిచేయడం ఆనందంగా అనిపించింది. ఇటీవల కృతజ్ఞతల సభలో పవన్‌ నన్ను మెచ్చుకొన్నారు. అదే పెద్ద అవార్డుగా భావిస్తున్నా. పవన్‌, త్రివిక్రమ్‌, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌.. ఈ ముగ్గురూ పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది'' అని చెప్పింది.

    పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

    English summary
    Every year, the B.Nagireddy award is being given out to Telugu film producers for their contribution to the Industry. For the year 2013, ‘Atharintiki Daaredhi’ producer BVSN Prasad has been selected as the winner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X