twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాహుబలి' : దర్బార్ సెట్ (ఫొటో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'బాహుబలి'. ప్రభాస్‌ హీరో. అనుష్క, తమన్నా హీరోయిన్. రానా కీలక పాత్ర పోషిస్తున్నారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలు. 'బాహుబలి' కోసం ఫిల్మ్‌సిటీలోనే రాజదర్బార్‌ సెట్‌ని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. అక్కడ మరోదఫా కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. 2015 ప్రధమార్థంలో 'బాహుబలి'ని విడుదల చేయడానికి చిత్రబృందం ప్రణాళికలు రచిస్తోంది.

    మరో వైపు ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రభాస్‌, తమన్నాలపై ఓ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. శంకర్‌ మాస్టర్‌ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. ఇక ఈ సెట్ కోసం రెండున్నర కోట్ల ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. జాతీయ అవార్డు విజేత ఆర్ట్ డైరక్టర్ సిబు సిరిల్ ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. ఛాయాగ్రహణం: కె.కె.సెంథిల్‌ కుమార్‌, సమర్పణ: కె.రాఘవేంద్రరావు.

    ఇక ఈ చిత్రం కథ సైతం అన్నదమ్ముల మధ్య జరిగే అధికారం కోసం జరిగే పోరుగా తీర్చి దిద్దుతున్నారని తెలుస్తోంది. తమిళంలో దీనిని 'మహాబలి'గా ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ట్రైలర్‌ - మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. తొలి రోజు నుంచే విశేష స్పందన లభించింది. ఈ చిత్రం కోసం అక్కడ వారు సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ కూడా రికార్డ్ స్ధాయిలో వ్యూస్ వచ్చాయి. బిజినెస్ పరంగా కూడా తమిళనాట ఓ రేంజిలో క్రేజ్ వస్తుందని అక్కడ ట్రేడ్ లో అంచనాలు మొదలయ్యాయి.

    Baahubali: Palace Darbar set at Ramoji Film City!

    ప్రస్తుతం 'బాహుబలి' కోసం రామోజీ ఫిల్మ్‌సిటీ ఉడ్‌లాండ్‌ ప్రాంతంలో ఓ భారీ యుద్ధ సన్నివేశాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు రాజమౌళి. ఇందులో చిత్ర ప్రధాన తారాగణమంతా ఉండబోతోంది. ఇప్పటికే నటీనటులకు పూర్తి శిక్షణ ఇచ్చిన రాజమౌళి యుద్ధానికి అందరినీ సన్నద్ధుల్ని చేస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా రెండు రోజులు సెలవులు తీసుకున్న యూనిట్ మళ్లీ చిత్రీకరణలో పాల్గొంటోంది. ప్రభాస్‌, రానా, అనుష్క ప్రధాన పాత్రధారులైన ఈ సినిమాకి ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు.

    రెండు టీజర్లు ఇప్పటికే ఈ సినిమా 'రుచి' ఏమిటో చూచాయిగా చూపించాయి. తెర వెనుక ఎంత కష్టపడుతున్నారో వాటిని చూస్తుంటే అర్థమవుతూనే ఉంది. అందరి కష్టం ఒక ఎత్తయితే, ప్రభాస్‌ కష్టం మరో ఎత్తు. ఈ సినిమా కోసం బరువు పెరిగాడు. 'బాహుబలి' టైటిల్‌కి నూటికి నూరుశాతం న్యాయం చేయడానికి కఠోరశ్రమ చేశాడు. కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీలూ నేర్చుకొన్నాడు. రెండేళ్లపాటు కొత్తకథలేం వినకూడదని నిర్ణయించుకొన్నాడు. బహు కష్టజీవి అనిపించుకొన్నాడు.

    English summary
    Rajamouli is leaving no stone unturned for his magnum opus 'Bahubali' and only dreams of making it a celluloid wonder. Under the supervision of National award winning art director Sabu Cyril, a huge palace set has been built in Ramoji Film City for the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X