twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    థియేటర్‌ ఓనర్ కి రూ.12లక్షల జరిమానా

    By Srikanya
    |

    బెంగళూరు : థియేటర్‌లో సీట్ల సంఖ్యను తక్కువగా చూపారనే ఆరోపణపై అర్కావతి థియేటర్‌ యజమాని రంగనాథ్‌కు రూ.12 లక్షల జరిమానా విధిస్తూ కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి తీర్పుచెప్పింది.

    వివరాల్లోకి వెళితే... గత శుక్రవారం 'అధ్యక్ష' సినిమా విడుదలైన విషయం తెలిసిందే. అర్కావతి థియేటర్‌లో కూడా దీన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే థియేటర్‌లో 78సీట్లను తక్కువగా చూపారు. ఇందువల్ల తనకు రెండ్రోజుల్లో రూ.10వేల నష్టం వాటిల్లినట్లు పంపిణీదారుడు ప్రసాద్‌ ఆరోపించారు.

    Bangalore Arkavathi theater owner rig the market

    థియేటర్‌ యజమాని రంగనాథ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై ప్రసాద్‌, రంగనాథ్‌ నడుమ కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆరోపణల్ని పరిశీలించిన వాణిజ్య మండలి థియేటర్‌ యజమాని రంగనాథ్‌కు రూ.12 లక్షల జరిమానా విధించింది. జరిమానా మొత్తాన్ని పది రోజుల్లోగా చెల్లించాలని షరతు విధించారు.

    English summary
    Adyaksha distributor Samartha Prasad alleges that, Arkavathi theater owner Ranganath shows wrong collections while the movie successfully running houseful.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X