twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్స్ కాక ముందు అద్దె కట్టలేక, రోడ్డుపై (ఫొటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఓవర్ నైట్ లో స్టార్స్ అయిపోవటం, కోట్లు సంపాదించటం అనేది వారసులకే చెల్లుతుంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఎంట్రీ సంపాదించటమే కష్టం..అ తర్వాత ప్రేక్షకుల మెప్పు పొందాలి. వెనక ఏమన్నా ఆస్ధి పాస్దాలు,గాడ్ ఫాధర్స్ ఉంటే సరేసరి లేకుంటే వారి ఇబ్బందులు చెప్పతరం కాదు.

    ఆ కష్టనష్టాలన్నిటినీ అధిగమించి, ఓ స్ధాయికి ఎదిగాక ఆ రోజులు తలుచుకుంటూంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆ విజయ గాధలు తర్వాత తరాలు వారికి ప్రేరణగా ఉంటాయి. కృషి, పట్టుదల ఉంటే విజయం సొంతమవుతుంది. ప్రతి మనిషి విజయం వెనుక ఏదో ఒక విజయ రహస్యం ఉంటుంది.

    బాలీవుడ్‌ వెండితెరపై నిలదొక్కుకోవాలన్న సంకల్పంతో అనేక కష్టనష్టాలకోర్చి విజయాలను అందుకున్న తారల గాథల వెనుక వారు అనుభవించిన కష్టాలెన్నో. వీటన్నింటినీ అధిగమించి తమకంటూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న బాలీవుడ్‌ తారలపై ప్రత్యేక కథనం...

    దేవానంద్‌

    దేవానంద్‌

    బాలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా ఎదగక ముందు ఆయన ఒక అకౌంటెన్సీ కార్యాలయంలో క్లర్క్‌గా జీవితం ఆరంభించారు. అప్పట్లో ఆయన జీతం రూ.85.

    మనోజ్‌కుమార్

    మనోజ్‌కుమార్

    మనోజ్‌కుమార్‌ ఘోస్ట్‌ రైటర్‌గా జీవితం ప్రారంభించారు. ఒక్కొక్క సన్నివేశానికి ఆయనకు స్టూడియోల్లో రూ.11 చెల్లించేవారు.

    దిలీప్‌కుమార్

    దిలీప్‌కుమార్

    ఇంటి నుంచి స్టూడియోల్లోకి వెళ్లేందుకు డబ్బులు లేని పరిస్థితుల్లో ట్రామ్‌ టిక్కెట్ల కోసం వెంపర్లాడుతున్న సమయంలో మాజీ బీసీసీఐ అధ్యక్షులు పి.ఎం.రుంగ్తా సహాయం చేశారు.

    ఆశా భోంస్లే

    ఆశా భోంస్లే

    ఈమె మొదటి పాటకు రూ.100 చెల్లించారు. ముంబయి నగర వీధుల్లో భర్తతో కలిసి బటాటా వడ తింటూ కాలం వెళ్లదీశారు. 1950లో ఆమె బోరివలిలో నివసిస్తూ పని కోసం ఉదయమే లోకల్‌ రైల్లో ప్రయాణిస్తూ తోటివారితో ముచ్చటించేవారు.

    జీనత్‌అమన్

    జీనత్‌అమన్

    తొలినాళ్లలో ఆమె నటించిన చిత్రాలు అంతగా ఆదరణకు నోచుకోకపోవడంతో తల్లితో కలిసి జర్మనీ వెళ్లాలనుకుంది. ఆ సమయంలో 1972లో హరేరామ హరేకృష్ణ చిత్రంతో నిలదొక్కుకోగలిగింది. ఈ సినిమాలో జాహీద్‌ పాత్రను తిరస్కరించడంతో జీనత్‌కు అదృష్టం కలిసివచ్చింది.

    ధర్మేంద్ర

    ధర్మేంద్ర

    ధర్మేంద్రను టాలెంట్‌ హంట్‌గా చెప్పుకున్నప్పటికీ బాండీవ్‌ సినిమా వచ్చేవరకు ఏడాది పాటు ఆయన ఎన్నో కష్టనష్టాలను అనుభవించారు. ఆయన కొద్దిరోజులపాటు 'తిండి' సరిగా తినలేని పరిస్థితులను ఎదుర్కొన్నారు. ధర్మేంద్ర వచ్చిన ట్యాక్సీ అద్దెను చెల్లించేందుకు ఒకసారి నిర్మాత తిరస్కరించటంతో ఎంతో బాధపడ్డారట. ఆ సమయంలో శశికపూర్‌ తన ఇంటికి తీసుకెళ్లి భోజనం చేయించారని సమాచారం.

    మిథున్‌ చక్రవర్తి

    మిథున్‌ చక్రవర్తి

    స్టేజీలపై నృత్య ప్రదర్శనలిచ్చినప్పుడు ఇది తన అవసరాలను తీరుస్తుందా? అని మిథున్‌ బాధపడేవాడట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

    అమ్జద్‌ఖాన్

    అమ్జద్‌ఖాన్

    పదేళ్లపాటు నిలదొక్కుకున్నా అమ్జద్‌ఖాన్‌ చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి. 1973లో 'షోలే' చిత్రంపై సంతకం చేసిన సమయంలో అతడికి సదాబ్‌ఖాన్‌ జన్మించాడు. అమ్జద్‌ నటనపై అంతగా ఆసక్తి లేకపోవడంతో ఆయన్ను తొలగించాలని సలీం-జావేద్‌లు చూశారట. ఆ చిత్రం ద్వారా అమ్జద్‌ తానేమిటో నిరూపించుకున్నారు.

    అక్షయ్‌కుమార్

    అక్షయ్‌కుమార్

    పరిశ్రమలోకి రావాలనుకున్న సమయంలో తన స్నేహితుడికి ఫొటో షూట్స్‌లో సహకారం అందించేవాడు. ఇందుకుగాను అక్షయ్‌కుమార్‌కు ఏమీ భత్యం చెల్లించేవారు కాదు. బ్యాంకాక్‌ నుంచి దుస్తులు, ఇతర ఉత్పత్తులు తీసుకొచ్చి విక్రయించేవాడు.

    శత్రుఘ్నసిన్హా

    శత్రుఘ్నసిన్హా

    సినీ రారాజు కాకముందు ముంబయిలోని మురికివాడలో శత్రుఘ్నసిన్హా ఐదుగురు, ఆరుగురుతో కలిసి జీవించేవారు. ప్రతినెలా ఖర్చులకు రూ.200 సంపాదించేందుకు ఎన్నో కష్టాలు అనుభవించారు.

    షారుఖ్‌ఖాన్

    షారుఖ్‌ఖాన్

    చిత్రరంగ ప్రవేశం కోసం ముంబయి వచ్చినపుడు భోజనం చేసేందుకు కూడా డబ్బులు లేవని ఇటీవలే షారుఖ్‌ వ్యాఖ్యానించారు. రోడ్లపై రాత్రులు బస చేసేవాడని, నిర్మాతల మెప్పు కోసం ఒబెరాయ్‌ హోటల్‌లో ఉంటున్నట్లు నటిస్తూ అక్కడి వాష్‌రూమ్‌ను ఉపయోగించుకున్నామని వెల్లడించారు.

    అమితాబ్‌ బచ్చన్‌

    అమితాబ్‌ బచ్చన్‌

    మెగాస్టార్‌ జీవితానికి ముందు అమితాబ్‌ కొన్ని రాత్రులు మెరీన్‌ డ్రైవ్‌ బెంచీలపై పడుకొనేవారు. పలుమార్లు రేడియో కంపెనీలు ఆయన్ని తిరస్కరించాయి. ఆయన ఆడిషన్‌ తీసుకునేందుకు సైతం నిరాకరించారు.

    English summary
    Sharuk Khan Said.... “At a certain juncture of my life, I was thrown out on the road because we could not pay rent. Poverty instills fear, stress and sometimes depression.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X