twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ శ్వేతబసు

    By Srikanya
    |

    హైదరాబాద్‌: వ్యభిచారం కేసులో పట్టుబడుతున్న వాళ్లు రోజు రోజుకీ పెరుగుతున్నారు. తాజాగా వ్యభిచారం కేసులో పోలీసులు శ్వేతబసు(కొత్త బంగారు లోకం) అదుపులోకి తీసుకొన్నట్లు తెలిసింది. కోల్‌కతాకు చెందిన శ్వేత బసు పలు తెలుగు సినిమాల్లో నటించారు.

    ఆదివారం రాత్రి నగరం లోని ఓ ప్రముఖ హోటల్‌లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. హోటల్‌పై జరిపిన దాడిలో సినీనటి, ఆమెతో పాటు ఉన్న పేరుమోసిన పారిశ్రామిక వేత్త పట్టుబడ్డారు. అయిత, ఆ పారిశ్రామికవేత్త ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొనిరావటంతో పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంచారు. అదుపులోకి తీసుకున్న ఆ సినీనటిని పునరావాస కేంద్రానికి తరలించారు.

    swetha basu arrested for prostitution

    బ్రోకర్‌ బాలును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇతను రూ.లక్ష కమీషన్‌ తీసుకున్నట్లు సమాచారం. సోమవారం బాలును కోర్టులో హాజరుపరచనున్నారు.

    కొత్త బంగారు లోకం, రైడ్‌ తదితర హిట్‌ సినిమాల్లో నటించి ఓ వెలుగు వెలిగిన నటి శ్వేతాబసు ఆదివారం వ్యభిచారం చేస్తూ పోలీసులకు చిక్కినట్లు గతంలోనూ అంతటా వార్తలు వచ్చాయి. అయితే అదంతా కేవలం మీడియా పుట్టించిన రూమర్ అని ఆమె గతంలో కొట్టిపరేశారు.

    English summary
    young heroine Swetha Basu was caught involving in prostitution by Hyderabad West Zone police who have raided a popular 2-star hotel in Banjara Hills on late Sunday evening. A pimp named Balu was arrested at the spot, while the actress was taken into custody.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X