Englishবাংলাગુજરાતીहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்
 
Share This Story

నాగార్జున ‘భాయ్’ ఆడియో రిలీజ్ డేట్ ఖరారు

Posted by:
Published: Tuesday, September 24, 2013, 16:32 [IST]

హైదరాబాద్ : అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘భాయ్' మూవీ ఆడియో అక్టోబర్ 1న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే సినిమా విడుదల తేదీ ఖరారు చేసే అవకాశం ఉంది. అక్టోబర్ 2వ వారంలో రిలీజ్ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు నిర్మాతలు.

డమరుకం తర్వత నాగార్జున నటించిన సినిమాలేవీ రాక పోవడంతో ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. పూలరంగడు, అహనా పెళ్లంట ఫేమ్ వీరభద్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. రీచాగోపాధ్యాయ్ హీరోయిన్. యాక్షన్ మరియు ఎంటర్టెన్మెంట్ జోడించి ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాస్ ఆడియన్స్‌ను, ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే విధంగా సినిమాను రూపొందిస్తున్నారు.

ఈ చిత్రంలో హంసా నందిని, కామ్న జెఠ్మలానీ, నథాలియా కౌర్‌, సోనూసూద్, ఆశిష్‌ విద్యార్థి, అజయ్‌, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ తదితరులు నటిస్తున్నారు. నథాలియా ‘భాయ్' చిత్రంలో ఐటం సాంగులో అందాల విందు చేయనుంది. ఈ పాటను మాంచి మాస్ మసాలా దట్టించి యమ సెక్సీగా రూపొందించారు. ఈ పాటలో నాగార్జున గెటప్ కూడా వెరైటీగా ఉండనుంది. ఆమె అందాలను జుర్రుకునే మొనగాడిలా, అరబ్ షేక్ గెటప్ లో నాగార్జున కనిపించనున్నారు.

హైదరాబాద్‌లో పాత బస్తీ వాతావరణాన్ని తలపించేలా ప్రత్యేకంగా తీర్చి దిద్దిన సెట్లో చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకు హైలెట్ కానున్నాయి. నాగార్జున బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా ఆయన పాత్ర ఉంటుందని దర్శకుడు వీరభద్రం చౌదరి అంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత: నాగార్జున, దర్శకత్వత్వం: వీరభద్రం చౌదరి.

English summary
Akkineni Nagarjuna’s ‘Bhai’ audio release date might take place on October 1st. As per our sources, this is the date being considered by the production team.
మీ వ్యాఖ్య రాయండి

Please read our comments policy before posting

Click here to type in Telugu
Subscribe Newsletter
Coupons
My Place My Voice