twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రహ్మీ రెచ్చిపోయి డాన్స్ (వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్ :అంజలి కీలక పాత్రలో నటిస్తున్న సినిమా 'గీతాంజలి'. కోన వెంకట్ సమర్పిస్తున్నారు. ఎమ్.వి.వి.సినిమా పతాకంపై ఎమ్.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి, రావు రమేష్, బ్రహ్మానందం కీలక పాత్రధారులు. రాజకిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ వీడియో సాంగ్ ని విడుదల చేసారు. ఈ సాంగ్ లో బ్రహ్మానందం రెచ్చిపోయి డాన్స్ చేయటం గమనించవచ్చు. ఈ సాంగ్ తో ఈ చిన్న సినిమా అందరి దృష్టిలో పడుతోంది. ఆ వీడియో మీరూ చూడండి

    <center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/RIvmuZTUBVQ" frameborder="0" allowfullscreen></iframe></center>

    కోన వెంకట్ మాట్లాడుతూ " గీతాంజలి సినిమాను పీవీపీ నిర్మించాల్సింది కానీ ఎందుకో ఆయన తప్పుకున్నారు. అందువల్ల ఎం.వి.వి.సత్యనారాయణగారితో కలిసి ఈ సినిమా చేశాను. అంజలి చక్కగా సరిపోయింది. హారర్ కామెడీ ఇది. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో సినిమాను విడుదల చేస్తున్నాం'' అని తెలిపారు.

    Brahmanandam Saitan Raj Full Video Song

    నిర్మాత మాట్లాడుతూ "కోన వెంకట్‌తో కలిసి ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. దర్శకుడు బాగా తెరకెక్కిస్తున్నారు. భయంతో నవ్వించే సినిమా ఇది'' అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ "నా తొలి సినిమాకి కోనగారితో పనిచేసే అవకాశం దక్కింది. అంజలి నటన బావుంది. నిర్మాత చక్కగా సహకరిస్తున్నారు'' అని తెలిపారు. "నాకు మంచి గుర్తింపు తెచ్చే సినిమా ఇది. దర్శకుడికి తొలి చిత్రమైనా బాగా తెరకెక్కిస్తున్నారు'' అని దర్శకుడు అన్నారు.

    "నేను ఇప్పటిదాకా 987 సినిమాల్లో నటించాను. నా సినిమాలు చూసి కోట్ల మంది నవ్వుకుంటున్నారు. ఆ నవ్వులే నాకు దీవెనలు. చివరి శ్వాస వరకు ప్రేక్షకుల్ని నవ్విస్తూనే ఉంటాను'' అని బ్రహ్మానందం చెప్పారు

    English summary
    Here comes SAITAN RAJ to roll u on the floor. Brahmanandam Garu at his peaks in our movie Geethanjali. Kona Venkat has written the script and is presenting a film with actress Anjali in the lead. The film will be a horror comedy and it is titled as 'Geethanjali'. Raj Kiran is making his debut as the director and the film is in shoot now.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X