twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్చ్...బ్రహ్మానందం సీన్స్ తీసేసారు

    By Srikanya
    |

    హైదరాబాద్ : బ్రహ్మానందం సినిమాలో ఉంటే హైలెట్ గా ఉంటుందని అవసరమనుకుంటే రిలీజ్ అయ్యాక ఎడిటింగ్ లో తీసేసిన సీన్స్ కలుపుతూంటారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ గా మారింది. బ్రహ్మానందం సీన్స్ తొలిగించే పరిస్ధితి వచ్చింది. సూర్య హీరోగా లింగు స్వామి దర్శకత్వంలో రూపొందిన అంజాన్...(సికిందర్) చిత్రం నుంచి బ్ర్హహ్మానందం సీన్స్ ని తొలించనున్నట్లు సమాచారం. ఈ మేరుకు తమిళ నిర్మాత ధనుంజయన్ గోవింద్ మీడియాతో మాట్లాడుతూ తెలియచేసారు.

    ధనుంజయన్ మాట్లాడుతూ... "సినిమా చూసిన ప్రేక్షకుడు సెకండాఫ్ చాలా లెంగ్త్ పెరిగిందని ఫీలవుతున్నారు. అందుకే మేము ఆరు నిముషాలు పాటు కట్ చేయాలని నిర్ణయించాం. ఆ తొలిగించే పనని దర్శకుడు లింగుస్వామికి అప్పచెప్పాం. ఆయన ఈ చిత్రంలో బ్రహ్మానందం సీన్స్ ని తొలిగించాలని నిర్ణయించారు. అవి తొలిగించిన కథ ఏమీ డిస్ట్రబ్ కానివి అవి. అందుకే తొలిగిస్తున్నాం. ఇక తెలుగు వెర్షన్ లో అవి అలాగే ఉంటాయి ." అన్నారు.

    Brahmanandam scenes deleted from Anjaan

    ఇక కలెక్షన్స్ పరిస్దితికి వస్తే... ట్రేడ్ సర్కిల్స్ లో వినపడేదాన్ని బట్టి సికిందర్ చిత్రం నిర్మాత లగడపాటి శ్రీధర్...ఈ సికిందర్ చిత్రం డబ్బింగ్ రైట్స్ మీద 14 కోట్లు వరకూ పెట్టినట్లు సమాచారం. అయితే ఇప్పుడు అవి రికవరీ అవటం చాలా కష్టమని అంటున్నారు.

    ముఖ్యంగా స్టార్ హీరో,స్టార్ డైరక్టర్ కలిసినప్పుడు ఏర్పడిన అంచనాలను ఈ చిత్రం కొంచెం కూడా అందుకోలేకపోయింది. బలహీన కథ,కథనంతో మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ ని మూట కట్టుకుంది. ఫస్టాఫ్ ఓకే అనిపించుకున్నా సెకండాఫ్ కు వచ్చే సరికి పూర్తి స్ధాయి బోర్ గా మారింది.

    రాజూ భాయ్‌ (సూర్య) అనే డాన్‌ కథ ఇది. చీకటి ప్రపంచాన్ని చిటికె వేసి నడిపించే తెలవితేటలు, దమ్ము ఉన్నవాడు. స్నేహానికి ప్రాణమిస్తాడు. అలాంటి రాజూ భాయ్‌ని స్నేహం పేరుతో మోసగిస్తే ఎలా స్పందించాడు? తన పగను ఎలా, ఏ రూపంలో తీర్చుకొన్నాడు అనే ఈ రొటీన్ కథని అంతకన్నా పరమ రొటీన్ స్క్రీన్ ప్లేతో నడిపించి ప్రేక్షకుడు సహనంతో ఆడుకున్నారు దర్శకుడు లింగు స్వామి. ఇక ప్లస్ అవుతుంది అనుకున్న సమంత గ్లామర్ సైతం సినిమాకు కలిసిరాలేదు.

    English summary
    
 
 ‘Sikander’ (‘Anjaan’) producer Dhananjayan Govind said “The audience felt that the second half of the film was long, and so, we decided to trim six minutes of it to make it racier. Lingusamy, director of the film, felt that a scene did not get with the story and asked for it to be removed. Comedian Brahmanandham’s scenes have been removed from the Tamil version of the film, but have been retained in the Telugu version.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X