twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎవరిది మోసం?: పూరి జగన్నాథ్ వైఫ్ కేసు వివరాలు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: భూ వివాదం విషయంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పూరి జగన్నాథ్, అతని వైఫ్ లావణ్యపై గురువారం ఫిర్యాదు నమోదైన విషయం తెలిసిందే. భూవిు కొనుగోలు విషయంలో తమను మోసం చేసారని కొందరు పిర్యాదు చేసారు. అయితే పూరి జగన్నాథ్ మాత్రం తామే బిల్డర్ల వల్ల మోసపోయామని చెబుతున్నారు. ఈ భూ వివాదం వెనక అసలు విషయం ఏమిటనేది పూరి జగన్నాథ్ మాటల్లోనే.

    జూబ్లీహిల్స్‌ హౌసింగ్ సొసైటీలో నా భార్య లావణ్య పేరుపై 1000 గజాల స్థలాన్ని ఐదేళ్ల క్రితమే రామరాజు, సుబ్బరాజు అనే బిల్డర్లకు విక్రయించామని, అయితే అప్పటికే ఆ భూమిపై రూ. 5 కోట్ల రుణం ఉంది. వాయిదాల రూపంలో కొంత చెల్లించాం. మిగిలిన
    వాయిదాలు చెల్లిస్తామని బిల్డర్లు ఒప్పుకున్నారు. మాసబ్ ట్యాంక్ ఎస్‌బీ‌ఐ మేనేజర్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. అందుకు సంబంధించిన పూర్తి సాక్ష్యాలు నా వద్ద ఉన్నాయి. కానీ బిల్డర్లు రుణం చెల్లించకుండా ఆ భూమిలో ఫ్లాట్స్ కట్టి మరొకరికి అమ్మారు అని పూరి జగన్నాథ్ తెలిపారు.

    Case filed against Puri Jagannath couple

    కేసు ఇలా వెలుగులోకి...
    ఆ భూమిపై రుణంలో 2.5 కోట్ల రూపాయలు మాత్రమే పూరీ జగన్నాథ్‌ బ్యాంక్‌కు చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని చెల్లించడం లేదు. ఈ ఫ్లాట్లపై అప్పు ఉందంటూ సంబంధిత బ్యాంకు వాటి యజమానులకు నోటీసులు జారీ చేసింది. యజమానులంతా బిల్డర్‌ సుబ్బరాజును ప్రశ్నించగా తనకేమీ తెలియదని చేతులెత్తారు. పూరీ జగన్నాథ్‌ సైతం ఇదే తీరుతో వ్యవహరించడంతో ఫ్లాట్ల యజమానులు సీసీఎస్‌లో భూ యజమాని అయిన పూరి జగన్నాథ్ భార్య లావణ్య, బిల్డర్ సుబ్బరాజుపై గురువారం ఫిర్యాదు చేశారు. విషయం తన మీదకు రావడంతో బిల్డర్‌ సుబ్బరాజు తనను మోసం చేశాడని ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు జూరి జగన్నాథ్. ఈ వ్యవహారంలో పూర్తి విచారణ అనంతరం కేసులు నమోదు చేస్తామని పోలీసులు స్పస్టం చేసారు.

    English summary
    Ace filmmaker Puri Jagannath has been in news for all the wrong reasons. A case has been filed against him and his wife Lavanya over a land dispute.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X