twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డాన్స్‌పై విమర్శ: చిరంజీవిలో మార్పు తెచ్చింది

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన డాన్స్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న రోజుల్లో ఆయన్ను మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. చిరంజీవి తెలుగు పరిశ్రమ నెం.1 మెగాస్టార్ గా ఎదగడానికి ఆయన డాన్స్ టాలెంట్ కూడా ఎంతగానో ఉపయోగపడింది.

     Chiranjeevi about Venkanna Babu

    అయితే చిరంజీవి పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఇతర హీరోల మాదిరిగానే సాదా సీతా డాన్సులు చేసే వారు. అయితే ఓ వ్యక్తి చేసిన విమర్శ ఆయనలో మార్పు తెచ్చిందట. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ...'నేను సినిమాల్లో హీరోగా చేస్తున్న కొత్తలో వెంకన్న బాబు అనే ఓ మేనేజర్ ఉండే వారు. ఆ తర్వాత ఆయన నిర్మాతా దొంగ మొగుడు అనే సినిమా కూడా చేసారు. ఓ సినిమాలోని షాట్ లో డాన్స్ చేసి బయటకు రాగానే అందరూ క్లాప్స్ కొట్టారు. అక్కడే నన్ను చూస్తూ ఉన్న వెంకన్న బాబు దగ్గరకు వెళ్లి ఎలా ఉంది అని అడిగాను. కానీ ఆయన అందరిలా బాగుంది అనకుండా విమర్శనాత్మకంగా మాట్లాడారు. వెనక డాన్సర్లు ఏం చేసారో..నువ్వు అదే చేసావు...నీ ప్రత్యేకత ఏమీ కనిపించలేదు అన్నారు. ఆయన మాట నా ఆలోచన విధానాన్ని మార్చేసింది. డాన్స్ మాస్టర్లు చెప్పిన దానికి అదనంగా ఇంకేదో చేయాలని ఆక్షణమే అనిపించింది. అప్పటి నుండి పాటను ఆస్వాదిస్తూ డాన్స్ చేయడం అలవాటు చేసుకున్నాను' అన్నారు.

    English summary
    "I have to thank my manager SP Venkanna Babu, who also produced Donga Mogudu film. I was dancing for a song for a film in my early days of career. I thought that I danced excellently. I asked Venkanna Babu for feedback. I changed my attitude and worked harder on dances to be different from others" Chiranjeevi said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X