twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి ఆలోచన.... సందేశాత్మకం కాదా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమా గురించి గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి తన స్థాయికి తగిన విధంగా 150వ సందేశాత్మకంగా ఉంటుందని అంతా భావించారు. అయితే చిరంజీవి ఆలోచన మాత్రం అందుకు విరుద్దంగా ఉందట.

    తన 150వ సినిమా సందేశాత్మకంగా ఉండటం కన్నా.....ప్రేక్షకులను, అభిమానులను ఎంటర్టెన్ చేసే విధంగా ఉండాలని కోరుకుంటున్నారట. అలాంటి కథలకే ఆయన ప్రిపరెన్స్ ఇస్తున్నారని సమాచారం. ప్రస్తుతం సందేశాత్మక చిత్రాలను బాక్సాఫీసు వద్ద ఆదరించే పరిస్థితి లేక పోవడం కూడా మరో కారణమని తెలుస్తోంది. వినోదాత్మకంగా సాగే కామెడీ అండ్ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం చేయడానికి చిరంజీవి ఆసక్తి చూపుతున్నారట.

    Chiranjeevi is not interested in doing message oriented films

    రాజకీయల్లో ఉన్నంత మాత్రాన పొలిటికల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేయాలనే రూల్ ఏమీ లేదని, అభిమానులకు, ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో వినోదం పంచడమే ప్రధానమని చిరంజీవి చెబుతున్నట్లు సమాచారం. మరి చిరంజీవి 150వ సినిమా ఎలా ఉండబోతోంది, దర్శకుడు ఎవరు? అనే వివరాలు చిరంజీవి పుట్టినరోజు అయిన రేపు(ఆగస్టు 22) తెలిసే అవకాశం ఉంది.

    కాగా...చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని అభిమానులు రేపు భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, రక్తదానం లాంటివి చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హైదరాబాద్ లో జరిగే చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో రామ్ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు.

    English summary
    Film Nagar source said that, Chiranjeevi is not interested in doing message oriented films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X