twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవికి రాజశేఖర్ విలన్ అంటూ ప్రచారం చేస్తున్నారు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవికి....సినీ కపుల్ జీవిత, రాజశేఖర్‌ మధ్య విబేధాలు ఉన్నాయనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనేక సందర్భాల్లో ఇరు వర్గాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు సైతం చేసుకున్నారు. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వీరి మధ్య గొడవలు మరీ ఎక్కువయ్యాయి.

    ఒకప్పుడు చిరంజీవి, రాజశేఖర్ మంచి స్నేహితులే. కొన్ని పరిస్థితులు ఇద్దరి మధ్య గొడవలకు కారణం అయ్యాయి. కొంతకాలంగా ఇరు వర్గాలు శాంతంగానే ఉంటున్నాయి. తాజాగా పలు ఆసక్తికర వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. చిరంజీవి 150వ సినినిమాలో విలన్ పాత్ర చేయడానికి రాజశేఖర్ ఆసక్తి చూపుతున్నారట.

    నిజంగానే రాజశేఖర్ చిరంజీవి 150వ సినిమాలో విలన్ పాత్ర చేస్తారో? లేదో? తెలియదు కానీ......చిరంజీవికి రాజశేఖర్ విలన్ (సినిమాలోనే!) అనే ప్రచారం మాత్రం 150వ సినిమాకు మంచి పబ్లిసిటీ తెచ్చి పెడుతోంది.

    150వ సినిమా

    150వ సినిమా

    చిరంజీవి 150వ సినిమాకు దర్శకుడు ఎవరనే చర్చ గత కొంతకాలంగా జోరుగా సాగుతున్నసంగతి తెలిసిందే. 150వ సినిమా కావడం, రాజకీయాల తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా కావడంతో ఈచిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

    దర్శకుడు ఎవరు?

    దర్శకుడు ఎవరు?

    చిరంజీవి సినిమా అంటే ఆశామాషీ విషయం కాదు. సత్తా ఉన్న దర్శకుడు కావాలి. అందుకే దర్శకుల విషయంలోనూ మల్లగుల్లాలు పడ్డారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి 150వ సినిమాకు దర్శకుడిగా వివి వినాయక్ లేదా బోయపాటి శ్రీను పైనల్ అయ్యే అవకాశం ఉంది.

    చిరంజీవి ఉబలాటం

    చిరంజీవి ఉబలాటం

    కాంగ్రెస్ పార్టీ ఓటమితో ప్రస్తుతానికి పొలిటికల్ టెన్షన్స్ ఏమీ లేకుండా ఖాళీగా ఉన్నచిరంజీవి తన 150వ సినిమాపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. వీలైనంత త్వరగా 150వ సినిమా ప్రారంభించి రాజకీయాల ద్వారా పోయిన పాపులారిటీని మళ్లీ సినిమాల ద్వారా తెచ్చుకోవడానికి చిరంజీవి ఉబలాటపడుతున్నారు.

    రామ్ చరణ్

    రామ్ చరణ్

    చిరంజీవి కెరీర్లో అంత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు కావడతో ఈచిత్రం నిర్మాణ బాధ్యతలను రామ్ చరణ్ దగ్గరుండి చూసుకోబోతున్నారు. చిరంజీవి భార్య సురేఖ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

    పుట్టినరోజు కానుక?

    పుట్టినరోజు కానుక?

    చిరంజీవి 150వ సినిమాలో అన్ని అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమా మంచి కథాంశం, సందేశం, కమర్షియల్ ఎలిమెంట్స్ ఇలా అన్ని విషయాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సారి మెగా అభిమానులకు చిరంజీవి బర్త్ డే ఆగస్టు 22న 150 సినిమా గురించి అఫీషియల్ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Rajasekhar and Chiranjeevi were good friends. But, with time, their friendship melted like ice. Now again, Rajasekhar is showing interest to work with Chiranjeevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X