twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజేంద్రప్రసాద్‌కు దాసరి స్వర్ణ కంకణ పురస్కారం

    By Bojja Kumar
    |

    Dasari Swarna Kankanam to Rajendra Prasad
    హైదరాబాద్: ప్రముఖ సంగీత, సాంస్కృతిక సంస్థ శృతిలయ ఆర్ట్ అకాడమీ వారు నెలకొల్పిన 'దాసరి నారాయణరావు-శృతి లయ స్వర్ణకంకణం' పురస్కారాన్ని ప్రముఖ సినీ నటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్‌ అందుకోబోతున్నారు. ఏప్రిల్ 29 తేదీన రవీంద్ర భారతి హైదరాబాద్‌లో ఆయనకు ఈ పురస్కారం అందజేయనున్నట్లు సంస్థ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.ఎస్ సింగ్, ఆమని తెలిపారు.

    సినీ దర్శకులు రేలంగి నరసింహారావు అధ్యక్షులుగా, ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడు కె.ధర్మారావు కన్వీనర్‌గా ఏర్పాటైన కమిటీ దాసరి నారాయణరావు పేరిట నెలకొల్పిన ఈ మొట్టమొదటి పురస్కారానికి 200 చిత్రాల నటించిన ప్రముఖ సినీ నటుడు డా.రాజేంద్రప్రసాద్‌ను ఎంపిక చేసారు.

    ఈ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి దర్శకరత్న డా.దాసరి నారాయణరావు ముఖ్య అతిథిగా విచ్చేసి స్వర్ణ కంకణాన్ని బహూకరిస్తారని తెలియజేసారు. సభాధ్యక్షులుగా రైట్ టు ఇన్ఫర్మేషన్ కమీషనర్ పి.విజయ్ బాబు, విశిష్ట అతిథులుగా తమ్మారెడ్డి భరద్వాజ, వీరశంకర్, ఎన్.శంకర్, శివనాగేశ్వరరావు, నీలకంఠ, అల్లాణి శ్రీధర్, జి.రాంప్రసాద్, వి. ఈశ్వరరెడ్డి, రేలంగి నరసింహారావు, శ్రీమతి బి.జయ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, ఈశ్వర్ రావు, శివకృష్ణ, గౌతం రాజు, గుండు హనుమంతరావు, కొండ వలస తదితరులు పాల్గొంటారు. ఇదే కార్యక్రమంలో 'గానభూషణ' ఆమని బృందం చే 'దాసరి సినీ సంగీత విభావరి' నిర్వహించనున్నట్లు తెలియజేసారు.

    English summary
    
 Director Dasari Narayana Rao, who has started the famous music and cultural academy "Shruti Laya Art Academy", will be soon presenting "Swarna Kankanam" to versatile actor Rajendra Prasad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X