twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విమర్శకులపై దేవకట్టా ఘాటు సెటైర్

    By Srikanya
    |

    హైదరాబాద్ : తమ సినిమా ఫెయిల్యూర్ అయినప్పుడు ...అది బాగోలేదని రాసిన విమర్శకులపై దర్శక,నిర్మాతలు మండిపడటం సహజమే. అదే ఇఫ్పుడు దేవకట్టా చేస్తున్నారు. అయితే డైరక్ట్ గా ఆ పని చేయకుండా వ్యంగ్య బాణాలు విసురుతున్నారు. ట్విట్టర్ ద్వారా తన ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. దేవకట్టా తాజా చిత్రం ఆటో నగర్ సూర్య ఫలితం ఆయన్ను తీవ్రంగా నిరాశపరిచినట్లుంది. ఆయన సామాజిక వెబ్ సైట్స్ లో ఆయన చేసే ట్వీట్స్, పోస్ట్ లు చదివిన వారు ఆశ్చర్యపోతున్నారు.

    తాజాగా ఆయన అయాన్ రాండ్ పాపులర్ నవల అట్లాస్ షగ్డ్ (1957) తో దాదాపు తన సినిమాను పోల్చినట్లుగా అర్దం వచ్చేలా ట్వీట్స్ చేసారు. ఆ పుస్తకం విడుదలైనప్పుడు ఎంతో మంది విమర్శకుల చేత విమర్శలకు లోనైంది. అయినా సరే ఎందుకుని ఆ పుస్తకం ఇప్పటికీ ఎంతో మంది ఎనలైజ్ చేస్తున్నారు...అంటూ ప్రశ్నిస్తూ ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ తో పాటు ఆ రోజుల్లో పుస్తకం విడుదలైనప్పుడు వచ్చిన విమర్శనలను ప్రస్తావించారు. ఇది చదివిన వారు ఆయన తన తాజా చిత్రం ఆటోనగర్ సూర్య ...కూడా ఆ పుస్తకం అంత గొప్పదని, ఇప్పుడు విమర్శలు పాలైనా భవిష్యత్ లో తన చిత్రం చర్చకు వస్తుందనే భావనతో రాసాడంటున్నారు.

     Deva Katta's Late Night Satire On Critics?

    ఎప్పటినుంచో ఊరిస్తున్న 'ఆటోనగర్ సూర్య'ఎట్టకేలకు విడుదలైంది. దేవా కట్టాకు ఓ వర్గంలో ఉన్న క్రేజు,మాస్ లుక్ తో ఓపినింగ్స్ బాగానే వచ్చాయి. అయితే అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అరకొర మార్కులు వేయించుకొంది. దానికితోడు సినిమాను ట్రిమ్ చేయడంతో కొంత నెగెటివ్ మార్కులే పడ్డాయి. ఫైనల్ గా ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. అయితే దర్శకుడు దేవకట్టా మాత్రం ట్విట్టర్ లో ఓ చిత్రానికి ఓ రేంజిలో ప్రమోషన్ చేస్తూ హిట్ సినిమా అనిపించాలని తాపత్రయపడుతున్నారు. సినిమాకు యాక్చువల్ గా పెట్టిన బడ్జెట్ కన్నా ఎక్కువే డబ్బులు వస్తాయని ఆయన చెప్తున్నారు.

    దేవకట్టా ట్వీట్ చేస్తూ.... నా లెక్క ప్రకారం ఆటోనగర్ సూర్య చిత్రంపై పది నుంచి పదకొండు కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టారు. మిగతాది అంతా ఆ సంస్ధ నుంచి వచ్చిన వేరే వాటి బర్డన్స్. మీరు మొదట ఆరు వారాల చిత్రం షేర్ ,శాటిలైట్, డబ్బింగ్ కలిపితే...20-30% వరకూ పెట్టిన పెట్టుబడి కన్నా ఎక్కువ వచ్చింది..ఇది నిజం అంటున్నారు.

    ఇలా బడ్జెట్, వచ్చిన లాభాలు ఆయన ట్విట్టర్ లో రాస్తుంటే చదివిన వారు...అయ్యిండవచ్చు...అయితే నిజం తెలుసుకుని ఏం చేయాలి...అంటున్నారు. అయితే ఆయన టార్గెట్ ఇండస్ట్రీలో వ్యక్తులు కోసం అని, మరో చిత్రం నిర్మాత కోసమని మరికొందరు అంటున్నారు. చిత్రం డిజాస్టర్ అయ్యిందని, నిర్మాతలు నష్టపోయారని చెప్పుకుంటూంటే ఇలా ట్వీట్స్ ద్వారా ఆయన ఖండిస్తున్నారని చెప్తున్నారు.

    English summary
    Deva Katta who is stripped of commercial success, as per critics, has somewhat came heavily on movie reviewers last night.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X