twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాబూ...ఎక్కడ నుంచి ఎత్తినా కాపీనే అంటారు

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'తేరే నాల్ లవ్ హో గయా', 'చెన్నయ్ ఎక్స్‌ప్రెస్' చిత్రాల తరహాలో 'రా రా కృష్ణయ్య' ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారనీ, కానీ, తాను మాత్రం కొన్నేళ్ల క్రితం 'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేం డానీ బోయిలే దర్శకత్వం వహించిన 'ఏ లైఫ్‌లెస్ ఆర్డినరీ' చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమా చేశానని దర్శకుడు మహేశ్ చెప్తున్నారు. అయితే హిందీ చిత్రం నుంచి ఎత్తినా, ఇంగ్రీష్ చిత్రం నుంచి ఎత్తినా దాన్ని కాపీనే అంటారు అంటున్నారు ఇది విన్న ఫిల్మ్ నగర్ జనం.

    మహేష్ మాట్లాడుతూ... కొందరు అనుకుంటున్నట్టు ఇది ఏ చిత్రానికీ కాపీ కాదు. మేం తీసుకున్న పాయింట్‌తో కొన్ని సినిమాలు వచ్చిన మాట వాస్తవమే. కానీ హాలీవుడ్‌ దర్శకుడు డానీ బోయెల్‌ కెరీర్‌ కొత్తలో ఇలాంటి కాన్సెప్టుతోనే 'లైఫ్‌ లెస్‌ ఆర్డినరీ' అనే సినిమా తీశాడు. మనం ఏదైతే చేయకూడదని గట్టిగా అనుకుంటామో తరువాత కాలంలో అదే తప్పకుండా చేయాల్సి వస్తుంది. ఆ స్ఫూర్తితో చేసిందే 'రారా కృష్ణయ్య' అంటున్నారు దర్శకుడు పి.మహేష్ బాబు. సందీప్‌కిషన్‌, రెజీనా హీరోహీరోయిన్లుగా, జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రారా కృష్ణయ్య'. ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని చిత్ర దర్శకుడు పి.మహేశ్‌బాబు చెప్పారు.

    Director about Ra Ra Krishnayya

    అలాగే ''మేం ఊహించినట్టుగానే 'రారా కృష్ణయ్య' చిత్రానికి అన్ని చోట్ల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. సినిమాలో కొత్తదనం కోసం దక్షిణ భారతదేశం సంస్కృతులన్నీ చూపించాలనుకున్నాం. అందుకే చెన్నై, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, బెంగళూరు... ఇలా అన్ని ప్రాంతాలలోని కల్చర్‌ను కవర్‌ చేశాం. సినిమాలోనే కాదు క్యారెక్టరైజేషన్‌లో కూడా ఫ్రెష్‌నెస్‌ తీసుకురావడానికి అలాంటి బ్యాక్‌డ్రాప్‌ ఎంచుకోవడం జరిగింది. రొటీన్‌కు భిన్నంగా వెళ్లడానికి ప్రయత్నం చేశాను. 'మొగుడు' సినిమాకు కృష్ణవంశీ దగ్గర నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశాను. ఆ తరువాత 'బావ', 'సోలో' చిత్రాలకూ పనిచేశాను. 'వెంకటాద్రి ఎక్స్‌ ప్రెస్‌' సినిమా మొదలైన కొత్తలోనే ప్రొడ్యూసర్‌ ద్వారా సందీప్‌కు ఈ కథ చెప్పాను. ఆయన ఓకే అన్నాడు అన్నారు.

    ఇక నేను అనుకున్న సినిమా తీయగలిగాను. ఫొటోగ్రఫీ బాగా కుదిరింది సినిమాలో అన్నదమ్ముల అనుబంధం బాగా పండుతోంది. సెకండాఫ్‌కు పెద్ద ఎస్సెట్‌ అయ్యింది. ఈ సంస్థలో వచ్చిన 'సోలో', 'నువ్వా?నేనా?' సినిమాల్లాగే ఈ సినిమా కూడా ఫ్యామిలీ అంతా చూసేలా ఉండాలని ప్రొడ్యూసర్‌ ముందుగానే చెప్పారు. సినిమా అంతా అలాగే ఉంటుంది. సినిమాకు ఫొటోగ్రఫీ బాగా కుదిరిందని అంటున్నారు. కెమెరామేన్‌కు, నాకు బాగా సింక్‌ అయ్యింది. ఇద్దరం కలిసి నెల రోజుల పాటు కేరళ, తమిళనాడు మొత్తం తిరిగాం, అక్కడి కల్చర్‌ తెలుసుకోవడానికి అన్నారరు.

    జగపతిబాబు గారిని డైరెక్ట్‌ చేయడం అద్భుతమైన ఫీలింగ్‌. సందీప్‌, నేను, రెజీనా ఫ్రెండ్స్‌లా పనిచేసుకుంటూపోయాం. కానీ, జగపతిబాబు గారు వచ్చిన తరువాతే నేను డైరెక్ట్‌ చేస్తున్నాననే ఫీలింగ్‌ వచ్చింది. ఆయన దర్శకుడిగా నాకెంతో గౌరవం ఇచ్చారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాలు చేస్తే దర్శకులకు పేరు రాదు. నటీనటులకు వస్తుంది. అదే మెసేజ్‌ ఓరియెంటెడ్‌ చేస్తే దర్శకులకు పేరు వస్తుంది. 'రారా కృష్ణయ్య' సినిమాతో నామీద నాకు ఓ నమ్మకం ఏర్పడింది అని చెప్పుకుంటూ వచ్చారు.

    English summary
    Sundeep Kishan's romantic entertainer Ra Ra Krishnayya relesed last friday with negitive talk. Sundeep Kishan and Regina are pairing up for the second time after a decent hit Routine Love Story while Ra Ra Krishnayya also casts Jagapathi Babu in a prominent role. P. Mahesh Babu is the director of the film and Krishna Srinivas is the producer. Achu composed the music.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X