twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బోయపాటి శ్రీను ఇంటర్వూ(పుట్టిన రోజు ఫొటోలతో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ లాంటి స్టార్ హీరోని రెండోసారి దర్శకత్వం చేసే అవకాశం.. అందులోనూ 'సింహా' లాంటి ఓ విజయవంతమైన సినిమా చేసిన తర్వాత.. ఎలా ఉంటుంది ఆ దర్శకుడి పరిస్థితి. కత్తి మీద సామే కదా. అచ్చం ఇలాంటి పరిస్థితుల్లోనే విజయం సాధించారు బోయపాటి శ్రీను. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'లెజెండ్‌'. సూపర్ హిట్ ఇచ్చి ఉత్సాహంగా బోయపాటి ఈ రోజు పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మీడియాతో మాట్లాడారు.

    సినిమా ప్రారంభించిన రోజునే 'గుండెలపై చెయ్యి వేసుకొని ధీమాగా చూడండ'న్నాను. సినిమా చూసిన అభిమానులంతా సంతోషంగా ఉన్నారు. సినిమా కోసం 122 రోజులపాటు మేం పడ్డ కష్టాన్ని ప్రేక్షకుల స్పందన చూసి మరచిపోతున్నాం. ఈ సినిమాలో బాలకృష్ణని కొత్తగా చూపించాను అంటూ అందరూ అంటుంటే చాలా ఆనందమేస్తోంది అన్నారు.

    ''సింహా'లాంటి విజయవంతమైన చిత్రం తర్వాత బాలకృష్ణగారు, నేను కలిసి సినిమా చేస్తున్నాం అనేసరికి అభిమానుల్లోనూ, పరిశ్రమలోనూ ఈ చిత్రం 'సింహా' స్థాయిలో ఉండబోతోందని అనుకొంటారని నాకూ తెలుసు. మేం మాత్రం 'సింహా'ని మించిన సినిమా తీయాలన్న కసితోనే ఈ సినిమా చేశాం. అనుకున్నది సాధించాం'' అంటున్న బోయపాటి శ్రీను చెప్పిన మరిన్ని విశేషాలివి...

    స్లైడ్ షోలో ఇంటర్వూ లో చెప్పిన విశేషాలు

    బాలయ్య వందో చిత్రం

    బాలయ్య వందో చిత్రం

    బాలయ్య నటించే వందో చిత్రాన్ని నేనే దర్శకత్వం వహించబోతున్నానని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఆ సినిమాకు కథ ఇంకా సిద్ధం కాలేదు. ఆయనకు తగిన కథ ఇప్పుడు నా దగ్గర లేదు. మళ్లీ బాలయ్యతో సినిమా అంటే ప్రత్యేకంగా ఉండాలి. అలాంటి కథ దొరకగానే సినిమా మొదలుపెడతా. అది బాలయ్య వందో సినిమానా? ఇంకొకటా అనేది నాకు తెలీదు. ఆయన కూడా ఎప్పుడూ అంకెల గురించి మాట్లాడరు. 'మంచి కథ ఉంటే వచ్చేయ్‌' అని చెబుతుంటారు.

    ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకోవాలి

    ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకోవాలి

    స్టార్ హీరోలతో సినిమాలు తీయాలంటే వారి ఇమేజ్‌ను దష్టిలో పెట్టుకొని కథలు తయారుచేసుకోవాలి. అభిమానులు వారిపై పెట్టుకున్న అంచనాలి సంతప్తిపరిచేలా స్క్రిప్ట్ వుండాలి. చిన్న పాయింట్ చుట్టూ కథ అల్లుకొని స్టార్స్‌తో సినిమా తీయడం కుదరదు. స్టార్స్ సినిమాలకు కొన్ని వాణిజ్య హంగులు తప్పనిసరిగా వుండాలి. నేడు స్టార్ హీరోల చిత్రాలకు మొదటి మూడురోజుల్లోనే 20కోట్ల కలెక్షన్స్ లభిస్తున్నాయంటే వారికున్న ఇమేజే కారణం. తమిళ ప్రేక్షకుల అభిరుచి వేరు. అక్కడ అగ్రతారలు ప్రయోగాలు చేసినా ఆదరిస్తారు. తెలుగు సినీరంగంలో కొన్ని లెక్కలు వేసుకొనే సినిమాలు తీయాలి అన్నారు.

    అది హింస కాదు

    అది హింస కాదు

    లెజండ్ చిత్రంలో హింసాత్మక సన్నివేశాల మోతాదు పెరిగిందనే విషయం సరికాదు. తనకు, తనవాళ్లకు తగిలిన దెబ్బకి బదులుగా హీరో కొడితే.. ఆ బాధ, కోపం కనిపించాలి. అందుకే పోరాట సన్ని వేశాల్లో హీరో భావోద్వేగాల్ని అలా చూపించాను. అది చర్యకు ప్రతిచర్యగా వస్తుంది అంతే అన్నారు. నా సినిమాల్లో కథానాయకుడు కత్తి పట్టాడంటే దానికి బలమైన కారణం ఉంటుంది. అది భావోద్వేగాలు పండించడంలో భాగమే. నా సినిమాలో మోతాదుకి తగ్గట్టుగా యాక్షన్‌ ఉంటుందే తప్ప హింస కాదు.

    అందుకే బ్రహ్మానందం ని తగ్గించాం

    అందుకే బ్రహ్మానందం ని తగ్గించాం

    లెజండ్ సినిమాలో వినోదం కాస్త తగ్గిందని, బ్రహ్మానందం పాత్ర మరికొంతసేపు ఉంటే బాగుంటుందని కొందరు అంటున్నారు. అయితే ఆయన పాత్ర సినిమా కథ నడకకు అడ్డుతగులుతోంది. కథ సీరియస్‌నెస్‌ కూడా దెబ్బతింటోంది. అందుకే బ్రహ్మానందం పాత్రని తగ్గించాం.

    సమాజం కోసమే

    సమాజం కోసమే

    లెజండ్ సినిమాని ఒక పార్టీకి అనుకూలంగానో, బాలకృష్ణగారి రాజకీయ ప్రవేశానికి పునాదిగానో తీయలేదు. ఆయన ప్రజాప్రతినిధి కావాలంటే సినిమాలు అవసరం లేదు. ఎన్టీఆర్‌గారి కుమారుడిగా జనం ఆయనకు నీరాజనాలు పలుకుతారు. పతాక సన్నివేశాల్లో ప్రజాప్రతినిధులతో బాలకృష్ణ మాట్లాడే సన్నివేశం కూడా సమాజ చైతన్యం కోసం తీసినదే.

    ఏ పార్టీని ఉద్దేశించి కాదు

    ఏ పార్టీని ఉద్దేశించి కాదు

    ఓటు విలువ, ప్రజాస్వామ్యం గురించి ప్రజలకు చెప్పాలనుకున్న విషయాల్నే లెజండ్ లో చెప్పాం. అంతేగానీ ఏ పార్టీని ఉద్దేశించి కాదు. ఇది ఎన్నికల తరుణం కాకపోతే సమాజానికి పనికొచ్చే మరిన్ని విషయాలు చిత్రం ద్వారా చెప్పేవాణ్ని. వ్యవస్థ తీరుపై మరిన్ని విమర్శలు ఉండేవి అన్నారు.

    చరణ్‌ సినిమాపైనే

    చరణ్‌ సినిమాపైనే

    ప్రస్తుతం రామ్‌చరణ్‌ సినిమాపైనే దృష్టిపెడతున్నా. ఇప్పటికే చిరంజీవిగారికి, రామ్‌చరణ్‌కి కథ చెప్పాను. వాళ్లకి నచ్చింది. ఆ కథని పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవాలి. దీనికి మూడు, నాలుగు నెలలు పడుతుంది. ఆ తర్వాత సినిమా పట్టాలెక్కుతుంది. కె.ఎల్‌.నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తారు.

    రామ్ చరణ్ చిత్రం కథ గురించి...

    రామ్ చరణ్ చిత్రం కథ గురించి...

    తదుపరి రామ్‌చరణ్‌తో ఒక కుటుంబ కథా చిత్రాన్ని తీయబోతున్నా. 'భద్ర', 'ఒక్కడు' చిత్రాల తరహాలో నవతరం అభిరుచులకు తగ్గట్టుగా ఆ సినిమా ఉంటుంది . జూలైలో సెట్స్‌మీదకు వెళ్తుంది. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో నడిచే హద్యమైన ప్రేమకథా చిత్రమిది. ఇందులో రామ్‌చరణ్‌ను కొత్త పంథాలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను.

    మోక్షజ్ఞ పరిచయ చిత్రం

    మోక్షజ్ఞ పరిచయ చిత్రం

    మోక్షజ్ఞని తెరకు పరిచయం చేసే బాధ్యతని కూడా బాలయ్య నాకే అప్పగించారని బయట ప్రచారం సాగుతోంది. మోక్షజ్ఞ తెరపైకి రావడానికి ఇంకా మూడేళ్ల సమయం ఉంది. అప్పుడు ఆ పరిస్థితుల్ని బట్టి బాలయ్య నిర్ణయం తీసుకొంటారు. అప్పటి పరిస్థితిని బట్టి అతని తొలిచిత్రానికి దర్శకుడెవరనేది నిర్ణయమవుతుంది.

    ''మోక్షజ్ఞ అప్పుడప్పుడు సెట్‌కి వచ్చేవాడు. సినిమాకి సంబంధించిన అన్ని విభాగాలపై అవగాహన కలిగేలా అతనితో పని చేయించేవారు బాలకృష్ణ. సహాయ దర్శకుడు, లైట్‌బాయ్‌... ఇలా అన్ని విభాగాలపై అవగాహన వచ్చేలా చేసేవారు''.

    కంగారేం లేదు...

    కంగారేం లేదు...

    తొందరపడి ఎలా పడితే అలా పరిగెత్తడం నాకు ఇష్టముండదు. నా సినిమాకి అటు కొబ్బరికాయ కొట్టగానే ఇటు వ్యాపారం జరిగిపోతున్నప్పుడు తొందరపడాల్సిన అవసరం ఏముంటుంది? నాకు కథే కీలకం. కథ గురించే ఎక్కువ రోజులు కష్టపడతా. చిత్రీకరణ తక్కువ రోజుల్లో పూర్తి చేస్తా. ఎప్పుడైనా సరే... నా ప్రయాణం నిర్మాతల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొనే సాగుతుంటుంది

    మెచ్చుకున్నారు

    మెచ్చుకున్నారు

    లెజండ్ సినిమా విడుదలైన తరవాత రాఘవేంద్ర రావుగారు, రామ్‌గోపాల్‌వర్మగారు అందించిన అభినందనలు మరచిపోలేను. 'సినిమా బాగా తీశావు. ఓ విజయంవతమైన సినిమాకి సీక్వెల్‌గా చిత్రం చేసి ప్రేక్షకుల్ని అలరించడం చాలా కష్టం. అలాంటిది నువ్వు సాధించావు' అంటూ వర్మ మెచ్చుకొన్నారు.

    శుభాకాంక్షలు

    శుభాకాంక్షలు

    లెజండ్ విజయానికి అభినందిస్తూ, వరస హిట్స్ తో దూసుకుపోవాలని, దర్శకుడు బోయపాటి శ్రీనుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తోంది వన్ ఇండియా తెలుగు.

    English summary
    Boyapati Srinu rubbishes rumours that he will direct the launching film for Balayya’s son, Mokshagna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X