twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు 'దృశ్యం' కీ సీన్స్ ని డైరక్ట్ చేసింది ఎవరంటే..

    By Srikanya
    |

    హైదరాబాద్ : పోలీసులు వెంకటేష్‌ ఇంటికి వచ్చి శవం పాతి పెట్టి ఉందని భావిస్తున్న స్థలంలో తవ్వుతారు. ఆ సీన్‌ని జీతూ డైరెక్ట్‌ చేశాడు. క్యాంప్‌లో ఏం జరిగిందో చెప్పు అని వెంకటేష్‌ కూతురుని అడిగే సీన్‌ కూడా తనే తీసాడు అంటూ చెప్పుకొచ్చారు దర్శకురాలు శ్రీప్రియ. వెంకటేష్ తో ఆమె డైరక్ట్ చేసిన చిత్రం దృశ్యం చిత్రం హిట్టైన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం రివిల్ చేసారు. జీతూ జోసెఫ్...ఒరిజనల్ మళయాళి దృశ్యమ్ చిత్రం దర్శకుడు. ఇక చిత్రంలో అవే కీలకమైన సీన్ కావటం విశేషం.

    అలాగే...ఇంటరాగేషన్‌ సీన్స్‌ తీసేటప్పుడు కొంత కష్టమైంది. వెంకటేష్‌గారు చాలా హైట్‌ పర్సనాలిటీ. ఆయనను కొట్టే సీన్‌ తీయడం కష్టమయింది. కమర్షియల్‌ హీరో ఎలా చేస్తారో అని అనుకున్నాను. కానీ చాలా చాలా ఎక్సలెంట్‌గా చేశారు. కళ్లు మూసుకుని వెంకటేష్‌గారి డైలాగ్‌లు విన్నా దాన్ని ఫీల్‌ కావచ్చు. అంత బాగా చేశారు అన్నారామె.

    Director Sri Priya about 'Drushyam' movie

    ఇక ఈ చిత్రం ఎంపిక చేసుకోవటానికి కారణం చెప్తూ... నేను ఎప్పుడూ టీనేజర్స్‌ గురించి ఆలోచిస్తుంటాను. నాకు 20 ఏళ ్ల కూతురు ఉంది. ప్రస్తుతం తను లా చదువుతోంది. అందుకే ప్రతీ సినిమాలో పిల్లల గురించి ఉండే లా చూసుకుంటాను. టీనేజర్స్‌ ఏ అంశమైనా తల్లిదండ్రులతో షేర్‌ చేసుకోగలగాలి. దృశ్యం సినిమాలో కూడా పెద్ద కూతురు తన తల్లితో అంటే మీనాతో కనుక షేర్‌ చేసుకోలేకపోతే తన జీవితం నాశనమయ్యేది. తల్లితో షేర్‌ చేసుకోవడం వల్ల కుటుంబసభ్యుల సహకారం లభించింది. ఆ పాయింట్‌ బాగా నచ్చింది అన్నారామె.

    ''సొంత కథతో సినిమా తీస్తే చాలా సౌలభ్యాలుంటాయి. తప్పయినా ఒప్పయినా ఎవరూ అడగరు. నచ్చితే బాగుందంటారు, లేదంటే బాగోలేదని వెళ్లిపోతారు. అదే రీమేక్‌ కథని తీస్తే మాత్రం మాతృకతో పోల్చి చూసుకొంటారు. అందులో వంద తప్పులు వెతుకుతారు. కథలో మార్పులు చేస్తే ఒక బాధ, చెయ్యకపోతే మరో బాధ. నా దృష్టిలో రీమేక్‌ సినిమా చేయడం చాలా కష్టంతో కూడుకొన్న పని'' అన్నారు శ్రీప్రియ.

    వెంకటేష్ ఎంపిక గురించి చెప్తూ...''కుటుంబ కథ అనగానే అందరూ వెంకటేష్‌ పేరే చెప్పారు. నాకు సన్నిహితులైన జయసుధ, జయప్రద. వాళ్లు కూడా వెంకీ అనే చెప్పారు. దీంతో మరో ఆలోచన లేకుండా ఆయనతోనే సినిమా తెరకెక్కించా. నిజంగా వెంకటేష్‌తో సినిమా చేయడం చాలా సులభం. ఆయన ఏం చెబితే అది చేశారు. సెట్‌లో ఆయన నటనను చూసినప్పుడే... నాకు ఎంతో ముచ్చటగా అనిపించేది. ఇంటిల్లిపాదికీ నచ్చేలా ఆయన తెరపై కనిపించారు. థియేటర్‌లో సినిమా చూస్తుంటే నాకే కనీళ్లొచ్చాయి. అంత బాగా నటించారు. అందుకే 'దృశ్యం' అంత మంచి విజయాన్ని సొంతం చేసుకొంది'' అన్నారామె.

    English summary
    Director SriPriya has revealed that Jeetu Joseph himself directed the Climax 'Digging for Body' and another episode in #Drushyam
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X