twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాపీ కొట్టారు: ‘దృశ్యం’ నిర్మాతలకు ఏక్తాకపూర్ నోటీసులు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'దృశ్యం' నిర్మాతలకు బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ లీగల్ నోటీసులు పంపారు. జపనీస్ రచయిత కీగో హిగాషినో రాసిన పుస్తకంలోని విషయాలను కాపీ కొట్టి 'దృశ్యం' చిత్రాన్ని తెరకెక్కించారని ఏక్తా కపూర్ తన నోటీసుల్లో పేర్కొన్నారు.

    జపనీస్ రచయిత రాసిన 'ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్' పుస్తకం ఆధారంగా సినిమా తెరకెక్కించేందుకు ఏక్తా కపూర్ ఆ పుస్తకం రైట్స్ కొనుగోలు చేసారు. అయితే 'దృశ్యం' చిత్రం చూసిన ఏక్తా కపూర్ అండ్ టీం తాము రైట్స్ దక్కించుకున్న పుస్తకంలోని విషయాలతో 'దృశ్యం' సినిమా ఉండటంతో షాక్‌కు గురైందట.

    Ekta Kapoor Legal Notice To Drishyam Filmmakers

    ఒరిజినల్ మళయాలం వెర్షన్ 'దృశ్యం' చిత్రానికి జీతు జోసెఫ్ కథ రాయడంతో పాటు దర్శకత్వం వహించారు. ఇదే చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ హీరోగా సేమ్ టైటిల్‌‌తో రీ మేక్ చేసారు. త్వరలో కమల్ హాసన్‌తో తమిళంలోనూ రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

    అయితే....'ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్' పుస్తకం కాన్సెప్టును కాపీ కొట్టారనే ఆరోపణలను జీతు జోసెఫ్ తోసి పుచ్చారు. తాను స్వయంగా ఆ కథ రాసుకుని దర్శకత్వం వహించినట్లు మళయాల మనోరమకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మరి తాజాగా ఏక్తా కపూర్ లీగల్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఏ జరుగబోతోంది అనేది తేలాల్సి ఉంది.

    English summary
    
 Drishyam makers have received a notice from renowned Bollywood filmmaker Ekta Kapoor for copying the content of a book penned by japanese author Keigo Higashino.Ekta has apparently stated that the Drishyam makers have copied the plot from a book titled ‘The Devotion Of Suspect X’, for which she had bought the film rights.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X