twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘గాలి పటం’లో పవన్ కళ్యాణ్ పవనిజం సాంగ్ (వీడియో)

    By Bojja Kumar
    |

     Gaalipatam - Power star Pawanism song
    హైదరాబాద్: ఆది హీరోగా 'గాలిపటం' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సంపత్‌నంది టీమ్‌ వర్క్స్‌ నిర్మిస్తోంది. ఎరికా ఫెర్నాండెజ్‌, క్రిస్టినా ఆకిహివా నాయికలు. సంపత్‌నంది, కిరణ్‌ ముప్పవరపు, విజయ్‌ కుమార్‌ వట్టికూటి నిర్మిస్తున్నారు. నవీన్‌ గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు.

    'ఫ్యాక్షనిజంలో బ్లడ్ ఉంటుంది, కమ్యునిజంలో రెడ్ ఉంటుంది, పవనిజంలో నిజం ఉంటుంది, నమ్మిన వారికి ప్యూచర్ ఉంటుంది' అంటూ పవనిజం పొగుడుతూ పెద్ద డైలాగు చెప్పాడు ఆది. తన తాజా చిత్రం గాలిపటం టీజర్ లో చెప్పిన ఈ డైలాగుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అది పవన్ అభిమానులును ఆకట్టుకుంటోంది. తాజాగా పవనిజం సాంగుతో ఈ చిత్రం ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు.

    పవన్ కళ్యాణ్ పేరు ని వాడుకుంటే హౌస్ ఫుల్స్ అవుతాయో లేమో చెప్పలేం కానీ, ఖచ్చితంగా ఓ వర్గం దృష్టి మాత్రం పడుతుంది. అందుకే యంగ్ హీరోలంతా ఎక్కడో చోట పవన్ కళ్యాణ్ పేరుని వాడాలని, పవనిజం గురించి మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు. తాము పవనిజం సపోర్టు చేసే హీరోలం అనిపించుకుంటే అభిమానులు అన్నా ఓ లుక్ వేస్తారని భావిస్తున్నారు. అందులో భాగంగానే ..తాజాగా వరస పరాజయాలతో ముందుకు వెళ్తున్న ఆది...తన తాజా చిత్రం 'గాలిపటం' టీజర్ లో పవనిజం గురించి మాట్లాడాడు. మరి ఎంతవరకూ అది అతనికి ఉపయోగపడుతుందో చూడాలి.

    <center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/fdtRpUrP9uc?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

    సంపత్‌ నంది మాట్లాడుతూ ''ఇది బోల్డ్‌ సినిమా. ఐటీ పీపుల్‌కి చెందిన సినిమా. స్ట్రయిట్‌ ఫార్వర్డ్‌ కథ. యువతకు నచ్చుతుంది. భీమ్స్‌ మంచి సంగీతాన్నిచ్చాడు. ఆది ప్రాణం పెట్టి పనిచేశాడు'' అని అన్నారు. నిర్మాత విజయ్‌కుమార్‌ వట్టికూటి మాట్లాడుతూ ''మా సంస్థలో వస్తున్న తొలి సినిమా ఇది. భీమ్స్‌ పాటలు మెప్పిస్తాయి. ఆదికి బిగ్గెస్ట్‌ టర్నింగ్‌ పాయింట్‌ అవుతుంది'' అని అన్నారు. ''నాతో సినిమా చేస్తానన్న మాటను సంపత్‌ నిలబెట్టుకున్నాడు. కథ వినగానే నటించిన ఆదికి, నిర్మించిన లాస్‌ ఏంజిల్స్‌ వారికి ధన్యవాదాలు'' అని నవీన్‌గాంధి చెప్పారు. అవకాశమిచ్చిన సంపత్‌నందికి కృతజ్ఞతలు చెప్పారు భీమ్స్‌. ఆది మాట్లాడుతూ ''గాలిపటం నాకు స్పెషల్‌ సినిమా. పర్సనల్‌గా తృప్తినిచ్చిన సినిమా. వైవిధ్యమైన రోల్‌ చేశాను. అందరికీ కనెక్ట్‌ అయ్యే సంగీతం కుదిరింది. దర్శకుడు నిర్మాత అవతారమెత్తితే ఎంత లాభమో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది'' అని తెలిపారు.

    ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, భరత్‌రెడ్డి, కార్తీక్‌, ప్రాచి, సప్తగిరి, చంద్ర, దువ్వాసి, శివన్నారాయణ, హేమ, ప్రగతి, శకుంతల, గీతాంజలి ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కెమెరా: కె.బుజ్జి, ఆర్ట్‌: డి.వై.సత్యనారాయణ, ఎడిటర్‌: రాంబాబు, నిర్మాతలు సంపత్‌నంది, కిరణ్‌ ముప్పవరపు, విజయ్‌ కుమార్‌ వట్టికూటి, దర్శకత్వం: నవీన్‌ గాంధీ.

    English summary
    Gaalipatam - Power star Pawanism song released.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X