twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోట్లకు అలవాటు పడటం వల్లే...అంటున్న కోన వెంకట్ (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అంజలి ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు రాజ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ అండ్ కామోడీ చిత్రం 'గీతాంజలి' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు గోపీచంద్, సత్యనారాయణ, ప్రకాష్ రాజ్, పోనీవర్మ, వి.వి.వినాయక్, దిల్ రాజు, సునీల్, దశరధ్, బెల్లంకొండ సురేష్, శ్రీవాస్, లక్ష్మీప్రసన్న, వీరు పోట్ల, మెహర్ రమేష్, గోపీచంద్ మలినేని, డి.వి.వి.దానయ్య, సురేష్ కొండేటి, నీరజ కోన తదితరులు పాల్గొన్నారు.

    రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎమ్.వి.వి.సినిమాస్ పతాకంపై ఎమ్.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. హర్షవర్ధన్ రాణె, శ్రీనివాస రెడ్డి, రావు రామేష్, బ్రహ్మానందం తదితరులు ఇతర ప్రధాన పాత్రలు చేశారు. ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతం అందించారు. ధియేట్రికల్ ట్రైలర్ ని లక్ష్మీప్రసన్న విడుదల చేసారు. ఆడియో సీడీలను వి.వి.వినాయక్, గోపీచంద్, లక్ష్మీప్రసన్నసంయుక్తంగా ఆవిష్కరించి కోన వెంకట్ కి అందజేసారు.

    సినిమాకు సంబంధించిన ఫోటోలు, వివరాలు స్లైడ్ షోలో....

    కోన వెంకట్ మాట్లాడుతూ...

    కోన వెంకట్ మాట్లాడుతూ...


    సినిమా అంటే ఓ నమ్మకం. ఆర్టిస్ట్ లు డైరెక్టర్ ని నమ్మి వారి జీవితాలను పణంగా పెడతారు. నా దృష్టిలో చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ఉండదు. హిట్ సినిమా.. ఫ్లాప్ సినిమా తప్ప. శ్రీనివాసరెడ్డి, రాజ్ కిరణ్ ఈ కథతో నా దగ్గరకు వచ్చారు. కథ వినిగానే, థ్రిల్ అయ్యాను. మనకెందుకు ఈ ఐడియా రాలేదా? అనుకున్నాను. కోట్లు బడ్జెట్ తో తీసే భారీ చిత్రాలకు అలవాటుపడటంవల్లే ఇలాంటి పాయింట్లు తట్టడంలేదని గ్రహించాను. అందుకే, ఈ చిత్రాన్ని చేయాలని నిర్ణయించుకుని, సత్యనారాయణగారికి చెప్పాను. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ చిత్రాన్ని ఆరంభించామని తెలిపారు.

    అంజలి లేకుంటే సినిమా లేదు

    అంజలి లేకుంటే సినిమా లేదు


    గీతాంజలి పాత్ర అంజలి చేస్తేనే బాగుంటుందని భావించాం. ఆమె అంగీకరించకపోతే ఈ సినిమా లేదని కోన వెంకట్ తెలిపారు.

    బ్రహ్మానందం గురించి...

    బ్రహ్మానందం గురించి...


    నా ప్రతి సినిమాలోనూ బ్రహ్మానందం గారి కోసం ఓ స్పెషల్ రోల్ ఉంటుంది, ఈ సినిమాలో కూడా ఓ మంచి రోల్ తో పాటు, ఓ స్పెషల్ పాట చేసారు. ఆయన మా సినిమాకి పెద్ద అండ అని తెలిపారు.

    వివి వినాయక్

    వివి వినాయక్


    వి.వి.వినాయక్ మాట్లాడుతూ ... ''కోన వెంకట్ నాకు మంచి ఆప్తుడు. ఈ చిత్ర నిర్మాత సత్యనారాయణ నాకు మంచి మిత్రుడు. దెయ్యాలు లేవని నమ్మే వ్యక్తికి దెయ్యం కనబడితే ఎలా ఫీలవుతాడు అనే పాత్రను బ్రహ్మానందంగారు చేసారు. ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు నేను చాలా నవ్వుకున్నాను. సైతాన్ రాజ్ గా బ్రహ్మానందంగారు ఆడియన్స్ ని నవ్వించబోతున్నారు. ప్రవీణ్ లక్కరాజు పాటలు బాగున్నాయి. ఈ సినిమా హిట్ అవ్వాలని, ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి పేరు రావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

    గోపీచంద్ మాట్లాడుతూ...

    గోపీచంద్ మాట్లాడుతూ...


    ''కోన వెంకట్ గారితో నాకు ఎప్పట్నుంచో అనుబంధం ఉంది. బ్రహ్మానందంగారు చేసిన సైతాన్ రాజ్ క్యారెక్టర్ గురించి, ఈ సినిమా కథ గురించి చెప్పారు. ఖచ్చితంగా మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది'' అని తెలిపారు.

    రాజ్ కిరణ్ మాట్లాడుతూ...

    రాజ్ కిరణ్ మాట్లాడుతూ...


    ''నీళ్లు శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది. కోన వెంకట్ శంఖంలాంటి వారు. అందులో నీళ్లు నేను. నాకు ఈ సినిమా అవకాశం రావడానికి కారణం శ్రీనివాసరెడ్డి గారు. నన్ను కోనవెంకట్ దగ్గరికి తీసుకెళ్లి, ఈ సినిమా వర్కవుట్ అయ్యేలా చేసారు ఆయన. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు. సినిమా అందరికీ నచ్చే విధంగా ఉంటుంది'' అన్నారు.

    సత్యనారాయణ మాట్లాడుతూ...

    సత్యనారాయణ మాట్లాడుతూ...


    ''సరైన కథ దొరక్క రెండేళ్లుగా సినిమా చేయలేదు. కోన వెంకట్ గారు ఈ కథ చెప్పిన తర్వాత, ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. అంజలిగారు ఈ సినిమా చేయడానికి అంగీకరించి ఉండకపోతే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేది కాదు. ఈ సినిమాకి బ్యాక్ బోన్ కోన వెంకట్'' అన్నారు.

    శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ...

    శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ...


    ''కోన వెంకట్ గారు ఈ సినిమాకి బ్యాకింగ్ ఉండటం వల్లే ఈ సినిమా చేయగలిగాం. మంచి సినిమా. మూడేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డాం. ఈ రోజు ఆడియో వేడుక జరుపుకోవడం ఆనందంగా ఉంది'' అని తెలిపారు.

    అంజలి మాట్లాడుతూ

    అంజలి మాట్లాడుతూ


    ''నాకు ఈ సినిమా చాలా స్పెషల్. నేను ఈ సినిమా చేయడానికి కారణం నా క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ నా కెరీర్ లో ఓ మైలురాయిలాగా నిలిచిపోతుంది. నన్ను ఈ సినిమాలో నటింపజేసిన కోన వెంకట్, రాజ్ కిరణ్ గారికి కృతజ్ఞతలు. కెమెరామేన్ శ్రీరామ్ మమ్ముల్నందిరినీ చాలా అందంగా చూపించారు. కాఫీ సాంగ్ చాలా క్యాచీగా ఉంటుంది. బ్రహ్మానందంగారికి కృతజ్ఞతలు. మా నిర్మాత సత్యనారాయణగారు సక్సెస్ ఫుల్ నిర్మాతగా చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

    మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ

    మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ

    ''ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వర్క్ చేయడం ఆనందంగా ఉంది. కోన వెంకట్ తో నాకు యు.యస్ లో పరిచయం ఏర్పడింది. ఓ రోజు ఫోన్ చేసి, 'గీతాంజలి' సినిమా చేస్తున్నాను. నువ్వే పాటలు ఇవ్వాలి అన్నారు. ఆయన ప్రోత్సాహంతోనే ఈ సినిమాకి సంగీతం అందించగలిగాను. నా ఫ్రెండ్స్, నా భార్య సపోర్ట్ వల్ల చక్కటి పాటలివ్వగలిగాను. ఆడియో, సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను'' అని తెలిపారు.

    English summary
    Photos of Telugu Movie Geethanjali Audio Launch. Anjali, Raj Kiran, MVV Satyanarayana, Kona Venkat, Harshvardhan Rane, Brahmanandam, Srinivasa Reddy, Praveen Lakkaraju, Anchor Suma, Gopichand, VV Vinayak, DVV Danayya, Dil Raju, Sunil, Gopichand Malineni, Bellamkonda Suresh, Dasarath, Baba Sehgal, Prakash Raj, Pony Verma, Manchu Lakshmi Prasanna, Monal Gajjar, Raghu Babu graced the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X