twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు సినీ కవి...సినారె పుట్టినరోజు నేడు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు సినీ అభిమానులకు పాటల రచయిత డాక్టర్‌ సి.నారాయణరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంటా. కవిగా, పాటల రచయితగా ప్రఖ్యాతులైన ఆయన్ను అంతా 'సినారె' అని పలుస్తుంటారు. జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌.సి.నారాయణరెడ్డి తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖుల్లో ఒకరు. నేడు ఆయన పుట్టినరోజు.

    సి.నారాయణరెడ్డి 1931, జూలై 29న కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామము హనుమాజీపేట్లో జన్మించాడు. తండ్రి మల్లారెడ్డి రైతు. తల్లి బుచ్చమ్మ గృహిణి. నారాయణ రెడ్డి ప్రాథమిక విద్య గ్రామంలోని వీధిబడిలో సాగింది. బాల్యంలోనే హరికథలు, జానపదాలు, జంగం కథల వైపు ఆకర్షితుడయ్యాడు.

    Happy Birthday C.Narayana Reddy

    ఉర్దూ మాధ్యమంలో సిరిసిల్ల లో మాధ్యమిక విద్య, కరీంనగర్ లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించాడు. తెలుగు ఒక ఐచ్ఛికాంశాంగానే ఉండేది. హైదరాబాదులోని చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేటు డిగ్రీ పొందాడు. విద్యార్థిగా శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయంలో శ్రద్ధగా అనేక గ్రంథాలు చదివాడు.

    సినిమా రంగానికి సినారె అందించిన సాహితీ సేవలు ఎన్నటికీ మరువలేనివి. ఆయన చేసిన రచనలు ఎందరో ఆధునిక కవులకు ప్రేరణగా నిలుస్తున్నాయి. ఆయన రచనలు సమకాలీన కవులకు 'మాస్టర్‌ పీస్‌'లాంటివని చెప్పడం అతిశయోక్తి కాదు. సామాజిక స్పృహను కలిగించే ఆయన రచనలు సాహితీవనంలో పారిజాతాలు.

    అలనాటి మహానటులు దివంగత ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావుతో పాటు తర్వాతి తరం నటులైన కృష్ణ, శోభన్‌బాబు, చంద్రమోహన్‌, మురళీమోహన్‌, మూడోతరం నటులైన మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, యువసామ్రాట్‌ అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేశ్‌ నటించిన ఎన్నో చిత్రాలకు సినారె కలం నుంచి అద్భుతమైన పాటలు జాలువారాయి. అవి సంగీతప్రియులను నేటికీ ఉర్రూతలూగిస్తున్నాయి.

    English summary
    One of the most celebrated lyricists and writers, who made the Telugu's proud, C.Narayana Reddy, turns a year older today. He is a legendary lyricist and one of the most revered personalities in Tollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X