twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రూ. 400 కోట్ల విడాకుల సెటిల్మెంటుపై స్పందించిన హృతిక్

    By Bojja Kumar
    |

    ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, ఆయన భార్య సుజానె విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా....భర్త నుండి సుజానె రోషన్ రూ. 400 కోట్లు భరణం కింద డిమాండ్ చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై హృతిక్ రోషన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

    'ఈ వార్తలన్నీ కల్పితమైనవి. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. నేను ప్రేమిస్తున్న వారిని(సెజానె)ను కించ పరిచే విధంగా ఉన్నాయి. నా సహనాన్ని పరీక్షిస్తున్నారు' అంటూ హృతిక్ రోషన్ ట్విట్టర్లో ట్వీట్ చేసారు.

    Hrithik Roshan tweet about alimony rumours

    గతంలో ఇలాంటి వార్తలు రాగా...సుజానె రోషన్ ఖండించారు. డైవర్స్ సెటిల్మెంట్ అనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, ఇది పూర్తిగా ఆధారం లేని వార్తలే అని ఆమె తేల్చి చెప్పారు. ఈ వార్తలు తనను ఎంతో బాధించాయని ఆమె అప్పట్లో చెప్పుకొచ్చారు. అయితే మరోసారి ఇలాంటి వార్తలే ప్రచారంలోకి రావడం చర్చనీయాంశం అయింది.

    <blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Fabricated news articles. Demeaning my loved ones. Testing my patience</p>— Hrithik Roshan (@iHrithik) <a href="https://twitter.com/iHrithik/statuses/494509597760045057">July 30, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

    ప్రేమించి వివాహం చేసుకున్న వీరు 13 ఏళ్ల పాటు అన్యోన్య దాంపత్యం సాగించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అనంతరం వచ్చిన అభిప్రాయ బేధాలతో 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికారు. చిన్నతనం నుండే సుజానెను ప్రేమిస్తున్న హృతిక్ డిసెంబర్ 20, 2000 సంవత్సరంలో తన ప్రేయసి సుజానెను పెళ్లాడాడు. వీరికి ఇద్దరు కుమారులు. హ్రెహాన్, హృదాన్. 'సుజానె నా నుండి విడిపోవాలని కోరుకుంటోంది, నాతో ఉన్న బంధాన్ని తెంచుకోవాలని కోరుకుంటోంది. మా ఫ్యామిలీ మొత్తానికి ఇది చాలా కఠినమైన సమయం. మా ప్రైవసీకి కేటాయించాలని మీడియా వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను' అంటూ 39 ఏళ్ల హృతిక్ రోషన్ ఆ మధ్య మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

    English summary
    Hrithik Roshan refutes rumours that his wife is asking Rs 400 crore. "Fabricated news articles. Demeaning my loved ones.Testing my patience" he tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X