twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో లకు ఈ జబ్బులేంటి

    By Srikanya
    |

    హైదరాబాద్ : వైవిధ్యమున్న పాత్రలు అంటే హీరోలకు ఏదో ఒక మానసిక జబ్బు ఉండి, వాటితో ఇబ్బందిపడటమేనా...పరిస్ధితి చూస్తుంటే దర్శకులు,హీరోలు అదే నమ్ముతున్నట్లు ఉంది. సూర్య చిత్రం గజనీ ఏ ముహుర్తాన వచ్చి, హిట్టైందో కాని అప్పటి నుంచి ప్రతీ హీరో తను మానసిక జబ్బు ఉన్న పాత్రల్లో కనపించాలని కోరుకుంటున్నారు. తాజాగా వరస ఫ్లాపులతో ఉన్న విశాల్ తన తాజా చిత్రంలో ఓ సైకలాజికల్ సమస్యతో భాధపడే వ్యక్తిగా కనిపించనున్నారు.

    విశాల్ హీరోగా నటించిన సినిమా 'ఇంద్రుడు'. తమిళంలో రూపుదిద్దుకున్న రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'నాన్ సిగప్పు మనిదన్'కు అనువాదమిది. ఊహించని ఘటనలు కళ్ల ముందు జరిగితే ఠక్కున నిద్రలోకి జారుకునే వ్యక్తికి సంబంధించిన కథతో తెరకెక్కింది. విశాల్, లక్ష్మీమీనన్ జంటగా నటించారు. తిరు దర్శకత్వం వహించారు.

    Indrudu is about narcolepsy patients

    "విశాల్ నార్కొలెప్సీ ఉన్న వ్యక్తిగా నటించాడు. నార్కొలెప్సీ కారణంగా అతని జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి? ఎటువంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటిని విశాల్ ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ సినిమాలోని ప్రధానాంశం. 'పల్నాడు' చిత్రంలో విశాల్ సరసన నటించిన లక్ష్మీమీనన్ ఈ సినిమాలోనూ హీరోయిన్‌గా నటించింది., వీరిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ హాట్‌గా ఉంటుంది. కథానుగుణంగానే ఆ సన్నివేశాలను తెరకెక్కించాం'' అని దర్శకుడు తిరు చెప్పారు.

    విశాల్ మాట్లాడుతూ "కొత్తదనం ఉన్న కథతో పాటు మాస్ ఆడియన్స్‌ను అలరించే అంశాలెన్నో ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా శత్రువుల ఆచూకి తెలుసుకుని విశాల్ ఒక్కొక్కరినీ టార్గెట్ చేసే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. తమిళంలో ఈ సినిమా విమర్శకుల ప్రశంసలూ పొందింది. కులుమనాలి, జోధ్‌పూర్, చెన్నైలో షూటింగ్ చేశాం. రెండు పాటలను విదేశాల్లో చిత్రీకరించాం. ఈ నెల 20న విడుదల చేస్తున్నాం'' అని అన్నారు.

    యూటీవీ మోషన్ పిక్చర్స్ సంస్థతో కలిసి విశాల్ ఈ సినిమాను నిర్మించారు. ఇనియా, శరణ్య ప్రధాన పాత్రధారులు. జి.వి.ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించారు. రిచర్డ్ ఎం.నాథన్ కెమెరాను నిర్వహించారు.

    English summary
    Vishal was in the city on Sunday for the audio launch of his upcoming film Indrudu, which also stars Lakshmi Menon. The actor, who is also turning producer with this film as he has tied up with UTV, says, “The film is about narcolepsy patients.” He adds that there are many people with this sleeping disorder.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X