twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాపు...ఒక విలక్షణమైన ప్రతిభాశాలి (హావ భావాలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు, చిత్ర కారుడు, కార్టూనిస్టు బాపు మరణంతో తెలుగు సినీ రంగంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. సినీ, సాహిత్య రంగాల్లోనేగాక యావత్ తెలుగుజాతి గర్వించేలా చేసిన గొప్ప మనిసి ఆయన.

    1933 సంవత్సరం డిసెంబర్ 15 తేదిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించిన ఆయన ముందు అడ్వర్టైజింగ్ రంగంలో, ఆ పై పత్రికా రంగంలో పనిచేసి, అక్కడ నుంచి సినిమాల్లోకి వచ్చారు. సాధారణంగా సినిమాల్లోకి వచ్చిన రచయితలు, ఇతర కళ్లల్లో సృజన వున్నావారు, ఇక వాటికే పరిమితమైపోయి, తమ ప్రాధమిక వ్యవహారాలను వదిలేస్తారు. కానీ బాపు సినిమాలు చేస్తూనే, చిత్రకళ, కార్టూన్ కళ రెండింటినీ సమానంగా సుసంపన్నం చేసారు.

    బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రం ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూనులూ, పుస్తకాల ముఖచిత్రాలూ లెక్క పెట్టడం కష్టం.

    ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన తెలుగు, హిందీ సినిమాలు అవార్డులు, రివార్డులు పొందటముతో పాటు అచ్చ తెలుగు సినిమాకి ఉదాహరణలుగా చరిత్రలో నిలిచిపొయాయనటం పొగడ్త కాదు.

    క్లుప్తంగా ఈయన గీసిన బొమ్మని సంతకం లేకపోయినా, తీసిన సినిమాలో దర్శకుడిగా ఈయన పేరు చూడక పొయినా చప్పున ఎవరయినా ఇది గీసింది, తీసింది బాపూ అని గుర్తించగలిగేటంత విలక్షణమయిన శైలి ఈ ప్రతిభావంతుడి సొత్తు.

    స్లైడ్ షో బాపుకు సంబంధించిన హావ భావాలు ఫోటోలు...

    బాపు

    బాపు

    1967లో సాక్షి (సినిమా) చిత్రదర్శకునిగా సినిమారంగంలో అడుగుపెట్టారు బాపు.

    చెరగని ముద్ర

    చెరగని ముద్ర

    తెలుగు సినీ తెరపై చెరగని ముద్ర వేసిన వారిలో బాపును ప్రముఖంగా చెప్పుకోవచ్చు.

    హీరోయిన్లను

    హీరోయిన్లను

    తెలుగు తెరపై తెలుగు దనం ఉట్టిపడేలా హీరోయిన్లను కళాత్మకంగా చూపిన వారిలో బాపు అగ్రస్థానంలో ఉంటారు.

    బాపు బొమ్మలు

    బాపు బొమ్మలు

    బాపు గీసిన అందమైన బొమ్మల తర్వాత అందంగా ఉన్న అమ్మాయిలను బాపు బొమ్మగా పిలిచే ఆనవాయితీ మొదలైంది.

    చితావళి

    చితావళి

    నవరసాలు, అష్టవిధనాయికలు, జనార్దనాష్టకము, అన్నమయ్య పాటలు, రామాయణము, భారతీయ నృత్యాలు, తిరుప్పావై - ఇలా ఎన్నో విషయాలపై బాపు ప్రత్యేక చిత్రావళిని అందించాడు.

    లక్షణాలు

    లక్షణాలు

    ఆయన చిత్రాలలో కొన్ని ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. పొదుపుగా గీతలు వాడటం, ప్రవహించినట్లుండే ఒరవడి, సందర్భానికి తగిన భావము, తెలుగుదనము తప్పకుండా ఉంటాయి.

    దేశ దేశాల్లో

    దేశ దేశాల్లో

    ఆయన చిత్రాలు దేశదేశాలలో ఎన్నో ప్రదర్శనలలో కళాభిమానుల మన్నలందుకొన్నాయి.

    English summary
    Renowned Telugu filmmaker Bapu, also an acclaimed artist, painter, cartoonist and illustrator, passed away in Chennai today following a brief illness.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X