twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంతోషంతో పాటు బాధ కూడా: పవన్ కళ్యాణ్ జ్ఞాపకాలు (ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జన సేన' పార్టీ పెట్టి రాజకీయాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అవినీతి, అసమర్థ ప్రభుత్వాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్నసమస్యలను చూస్తూ ఉండలేక పోతున్నానని పవన్ తెలిపారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యల వల్ల ప్రశాంతంగా సినిమాలు చేసుకోలేక పోతున్నానని చెప్పిన ఆయన రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు.

    సమాజం బాగు కోసం పవన్ నడుం బిగించడం అభిమానులకు సంతోషాన్ని కలిగించినా......ఇక సినిమాలకు దూరంగా ఉంటాననే విధంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం అభిమానులను బాధిస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి 'గబ్బర్ సింగ్ 2' చిత్రం కాగా, మరొకటి 'ఓ మై గాడ్'.

    ప్రస్తుతం కొత్త పార్టీ స్థాపన, ఎన్నికల హడావుడిలో పనిడిపోయిన పవన్ కళ్యాణ్....ఈ రెండు చిత్రాల షూటింగులను వాయిదా వేసుకున్నారు. ఆ సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయి అనేది కూడా ఇప్పుడే చెప్పడం కష్టం. పవన్ కళ్యాణ్ సినిమా జీవితానికి సంబంధించిన విశేషాలు స్లైడ్ షోలో.....

    అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి

    అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి

    పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయం అయిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. అక్టోబర్ 11, 1996న ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కు జోడీగా అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ నటించింది.

    గోకుళంలో సీత

    గోకుళంలో సీత

    పవన్ కళ్యాణ్ రెండో చిత్రం ‘గోకుళంలో సీత'. 22 ఆగస్టు 1997న ఈచిత్రం విడుదలైంది. బాక్సాఫీసు వద్ద ఈచిత్రం మంచి విజయం సాధించింది. 11 సెంటర్లలో 100 రోజులు ఆడింది.

    సుస్వాగతం

    సుస్వాగతం

    పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం చిత్రం జనవరి 1, 1998న విడుదలైంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కమర్షియల్ హీరో రేంజికి ఎదిగారు.

    తొలి ప్రేమ

    తొలి ప్రేమ

    1998లో వచ్చిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘తొలి ప్రేమ' పవన్ కళ్యాణ్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ చిత్రం ఇతర బాషల్లోనూ అనువాదమైంది.

    తమ్ముడు

    తమ్ముడు

    1999లో వచ్చిన తమ్ముడు చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఓ బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. తమిళం, కన్నడంలోనూ ఈచిత్రం రీమేక్ అయింది.

    బద్రి

    బద్రి

    బద్రి సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లో ఓ మైలు రాయి. అప్పట్లో ఈచిత్రం 12 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. 47 సెంటర్లలో 100 రోజులు ఆడింది.

    ఖుషి

    ఖుషి

    పవన్ కళ్యాణ్ కెరీర్లో వచ్చిన మరో హిట్ చిత్రం ‘ఖుషి'. ఏప్రిల్ 27, 2001లో విడుదలైన ఈచిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం 101 సెంటర్లలో 50 రోజులు, 79 సెంటర్లలో 100 రోజులు, 5 సెంటర్లలో 175 రోజులు ఆడింది.

    జానీ

    జానీ

    పవన్ కళ్యాణ్ దర్శకుడిగా మారిన చిత్రం ‘జానీ'. 25 ఏప్రిల్, 2003లో ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ ప్లాపు చిత్రంగా నిలిచింది.

    గుడుంబా శంకర్

    గుడుంబా శంకర్

    గుండుంబా శంకర్ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్లో మంచి గ్రాసర్ సాధించిన చిత్రంగా నిలిచింది.

    బాలు

    బాలు

    పవన్ కళ్యాణ్ నటించిన బాలు చిత్రం 8 సెంటర్లలో 100 రోజులు ఆడింది. ఈ చిత్రం అప్పట్లో 72 దేశాల్లో విడుదలైంది. ఆఫ్రికన్ దేశాల్లో విడుదలైన తొలి తెలుగు చిత్రం ఇదే.

    బంగారం

    బంగారం

    మే 3, 2006లో విడుదలైన బంగారం చిత్రం పవన్ కళ్యాణ్ ప్లాపు చిత్రాల జాబితాలో చేరింది. బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆడలేదు.

    అన్నవరం

    అన్నవరం

    డిసెంబర్ 29, 2006లో విడుదలైన అన్నవరం చిత్రం అప్పట్లో మూడు వారాల్లో రూ. 23 కోట్లు వసూలు చేసింది.

    జల్సా

    జల్సా

    త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన జల్సా చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్లో మరో బిగ్ సక్సెస్. 2008లో ఈచిత్రం విడుదలైంది.

    పులి

    పులి

    పవన్ కళ్యాణ్ హీరోగా రూ. 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం పులి. ఈ చిత్రం 2010 సెప్టెంబర్లో విడుదలైంది.

    తీన్ మార్

    తీన్ మార్

    పవన్ కళ్యాన్ హీరోగా తెరకెక్కిన మరో చిత్రం ‘తీన్ మార్'. 14 ఏప్రిల్, 2011లో విడుదలైంది.

    పంజా

    పంజా

    పవన్ కళ్యాణ్ నటించిన ‘పంజా' చిత్రం బాక్సాఫీసు వద్ద ఊహించిన ఫలితాలు మాత్రం సాధించలేక పోయింది.

    గబ్బర్ సింగ్

    గబ్బర్ సింగ్

    పవన్ కళ్యాణ్ హీరోగా హిందీ దబాంగ్ చిత్రానికి రీమేక్‌గా వచ్చిన ‘గబ్బర్ సింగ్' చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది.

    కెమెరామెన్ గంగతో రాంబాబు

    కెమెరామెన్ గంగతో రాంబాబు

    బద్రి తర్వాత పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు'. 18 అక్టోబర్ 2012లో విడుదలైన ఈచిత్రం అప్పట్లో 1600 స్క్రీన్లలో విడుదలైంది. అయితే కలెక్షన్ల పరంగా ఈచిత్రం ఊహించిన అంచనాలను అందుకోలేక పోయింది.

    అత్తారింటికి దారేది

    అత్తారింటికి దారేది

    పవన్ కళ్యాణ్ కెరీర్లో, తెలుగు సినిమా చరిత్రలో అతిపెద్ద హిట్ చిత్రంగా నిలిచిన చిత్రం ‘అత్తారింకటికి దారేది'. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.

    English summary
    Power Star Pawan Kalyan started his acting career with the movie Akkada Ammayi Ikkada Abbayi in 1996. In his acting career spanning 19 years, the actor has starred in 19 movies and most of them are superhit films. When his career is at its peak, he is taking risk of plunging into politics. Many of his fans are scared that the actor, who recently floated a new political party called Jana Sena, would quit acting for politics.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X