twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఝలక్ : జీవిత ప్రశ్నిస్తే...ప్రభుదేవా సమాధానం చిరంజీవి!

    By Bojja Kumar
    |

    Jeevita questioned, Prabhu Deva answer Chiranjeevi
    హైదరాబాద్: టీవీ రియాల్టీ షోలలో అప్పుడప్పుడు కొన్ని అనుకోని సంఘటనలు ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తుంటాయి. తాజాగా రాఘవేంద్రరావు హోస్ట్ చేస్తున్న 'సౌందర్య లహరి' కార్యక్రమంలో కూడా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ షోలో నటి జీవితతో పాటు దర్శకుడు, డాన్సర్, నటుడు అయిన ప్రభుదేవా పాల్గొన్నారు.

    ఈ కార్యక్రమంలో జీవిత ప్రభుదేవాను పలు ప్రశ్నలు అడిగింది. 'మీకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నచ్చిన డాన్సర్ ఎవరు?' అని జీవిత అడిగిన ప్రశ్నకు ప్రభుదేవా స్పందిస్తూ......చిరంజీవి సర్ నా ఫేవరెట్. ఆయనంటే ఎంతో ఇష్టం' అంటూ సమాధానం ఇచ్చారు ప్రభుదేవా. ప్రభుదేవా నుండి అలాంటి సమాధానం వస్తుందని జీవిత అసలు ఊహించి ఉండదు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

    జీవిత రాజశేఖర్ దంపతులు - చిరంజీవి మధ్య చాలా కాలంగా విబేధాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య వరుస ప్రెస్ మీట్లు పెట్టిమరీ చిరంజీవిపై విమర్శలు గుప్పించారు జీవిత రాజశేఖర్. చిరంజీవి కూడా పలు సందర్భాల్లో వారిపై విమర్శలకు ప్రతి విమర్శలు చేసారు.

    ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన సంఘటన పలువురిలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ విషయం పక్కన పెడితే చిరంజీవి 150వ సినిమాలో రాజశేఖర్ నటించే అవకాశం ఉందనే వార్తలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి.

    English summary
    Jeevita questioned Prabhu Deva, about his favorite dancer in the Indian film industry. The dancer promptly responded that Megastar Chiranjeevi is his all time favorite. ‘Chiranjeevi Sir, I love him. I just love him’, said Prabhu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X