twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్-పూరీ చిత్రం ముహూర్తం (ఫొటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్ :జూ.ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందనున్న చిత్రం ఈ రోజు(ఆగస్టు1)న ప్రారంభమైంది. పూరీ జగన్నాథ్ కొత్త ఆఫిస్ కేవ్ లో ఉదయం 7 గంటలకు ఈ ముహూర్తం జరిగింది.

    బండ్ల గణేష్ నిర్మాతగా పరమేశ్వర ప్రొడక్షన్స్ వారి 5 వ చిత్రంగా ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రం భారీగా నిర్మించనున్నానని బండ్లగణేష్ చెప్తున్నారు. ఆంధ్రావాలా చిత్రం తర్వాత ఎన్టీఆర్, పూరీ కాంబినేషన్ లో చిత్రం రాలేదు. వీరి కాంబినేషన్ లో చిత్రం కోసం చాలా మంది నిర్మాతలు ప్రయత్నించారు కానీ ఇన్నాళ్లకు కానీ వీలుపడలేదు.

    ఇండస్ట్రీలోని తమ శ్రేయాభిలాషులతో ఈ చిత్రం ప్రారంభం సింపుల్ గా జరిగింది. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. తండ్రి అయ్యాక తొలిసారిగా మీడియా ముందుకు వస్తున్నారు ఎన్టీఆర్. ఆ ఉత్సాహం అతనిలో కనపడుతోంది. పూరి తనదైన మార్క్ డైలాగులతో ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేస్తాడని చెప్పుకుంటున్నారు.

    ఫొటోలు ...స్లైడ్ షోలో...

    ఎన్టీఆర్ క్లాప్

    ఎన్టీఆర్ క్లాప్

    తన చిత్రానికి తానే క్లాప్ కొట్టుకుని ఎన్టీఆర్ ప్రారంభించారు. దేవుడు ఫొటోలపై క్లాప్ కొట్టి హిట్ కావాలని కోరుకున్నారు.

    పోలీస్ అథికారిగా..

    పోలీస్ అథికారిగా..

    ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. గతంలోనూ ఎన్టీఆర్ పోలీస్ గా కనిపించి అలరించారు. ఇప్పుడు మరోసారి ఆ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

    క్యారక్టరైజేషన్

    క్యారక్టరైజేషన్

    ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారక్టరైజేషన్ ప్రత్యేకంగా కనిపించనుందని సమాచారం. అవినీతి తో నిండిన పోలీస్ అథికారిగా కనిపిస్తారు.

     డైలాగులు

    డైలాగులు

    పూరీ సినిమాలంటే డైలాగులు అద్బుతంగా ఉంటాయని అంటూంటారు అభిమానులు. క్యాచీగా ఉండి చిన్నా పెద్ద అందరినీ అలిరిస్తూంటాయి. ఎన్టీఆర్ ఇప్పటివరకూ చెప్పనని తరహాలో పంచ్ లతో కూడిన డైలాగులను పూరి ప్రత్యేకంగా రాసినట్లు చెప్తున్నారు.

    కథ తీసుకున్నాడు

    కథ తీసుకున్నాడు

    ఈ సినిమాకు ఉన్న మరో ప్రత్యేకత...పూరి ఇన్నేళ్ల కెరీర్ లో ఎప్పుడూ కథ వేరే వారినుంచి తీసుకోలేదు. అలాంటిది తొలిసారిగా వక్కంతం వంశీ నుంచి తీసుకోవటంతో అంతటా చర్చనీయాంశంగా మారింది.

    ఈ టైటిల్ కూడా..

    ఈ టైటిల్ కూడా..

    ఈ చిత్రానికి 'నేనో రకం' అనే టైటిల్ ని పరిశీలిస్తునట్లు సమాచారం. ఈ టైటిల్ కి 'ఫుల్లీ కరెప్టడ్'...ఇదే ఉపశీర్షిక.

     పూర్తి మాస్

    పూర్తి మాస్

    ఎన్టీఆర్ ...అవినీతితో నిండిపోయి ...ఎప్పుడూ లంచం...లంచం అంటూ తిరిగే పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారు. పూర్తి మాస్ మసాలాతో సాగే పాత్ర ఇది.

    కాజల్...

    కాజల్...

    ఈ చిత్రం లో కాజల్ హీరోయిన్ గా చేయనుంది. ఎన్టీఆర్ తో ఆమె గతంలో బాద్షా చిత్రంలో చేసింది.

     అంచనాలు...

    అంచనాలు...

    ఈ ప్రాజెక్టుపై ప్రారంభం నుంచి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. చాలా గ్యాప్ తీసుకుని ఈ కాంబినేషన్ రూపొందటంతో ఈ క్రేజ్ ఏర్పడుతుంది.

    ఎవరెవరు

    ఎవరెవరు

    కథ: వక్కంతం వంశీ, సమర్పణ: శివబాబు బండ్ల, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

    English summary
    Jr NTR, Puri Jagannath Production No 5-New Movie Launched today.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X