twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చూసారా? :‘రభస’కొత్త లుక్ ( పోస్టర్స్ )

    By Srikanya
    |

    హైదరాబాద్ : కొంతకాలంగా ఎన్టీఆర్‌ భారీ హిట్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. 'బాద్‌షా' బాక్సాఫీస్‌ ఫలితం పూర్తి స్థాయిలో సంతృప్తినివ్వకపోవడం, 'రామయ్యా వస్తావయ్యా' ఫ్లాపవడంతో ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్‌ కలెక్షన్లతో 'రభస' చేయాలనే లక్ష్యంతో ఉన్నాడు. దర్శకుడిగా తొలి సినిమా 'కందిరీగ'తో హిట్‌కొట్టిన సంతోష్‌ శ్రీనివాస్‌తో ఈ సినిమా చేస్తుండటం, క్రేజీ హీరోయిన్‌ సమంతతో ముచ్చటగా మూడోసారి జతకట్టడం ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి.

    ఇప్పటికే టైటిల్‌కు మంచి ప్రచారం లభించడం ఈ మాస్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కు కలిసొచ్చే అంశం. విడుదల సమయం దగ్గరపడుతూండటంతో ఈ చిత్రానికి సంభందించిన కొత్త పోస్టర్స్ ని విడుదల చేసారు. ఈ పోస్టర్స్ ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో కవర్ ఫొటో గా మారిపోతున్నాయి. సినిమాకు మంచి క్రేజ్ క్రియేట్ అవుతోంది.

    దర్శకుడు చెబుతూ '''వినోదాత్మక కుటుంబ కథా చిత్రమిది. ఎన్టీఆర్‌ నటన, అతను పాడిన పాట, సమకూర్చిన నృత్యరీతులు.. అన్నీ కొత్తగా ఉంటాయి. ఎన్టీఆర్‌ అభిమానులకు ఈ సినిమా పండగలా ఉంటుంది. ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉంది. తమన్‌ చక్కటి పాటలిచ్చారు''అన్నారు. వచ్చే నెల 1న చిత్ర పాటలను విడుదల చేయనున్నారు.

    Jr Ntr's Rabhasa New Posters

    ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

    English summary
    Check out the Exclusive new Posters of the Jr NTR's Rabhasa movie and the actor appearing in a Rocking look by handling Guitar and the hot actress Samantha in a Spicy look and the film audio launch planned for August 1st.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X