twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గర్వపడ్డ జూ ఎన్టీఆర్, దర్శకుడి కంటతడి (రభస ఆడియో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీన్‌వాస్ దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ బాబు నిర్మాతగా బెల్లకొండ సురేష్ సమర్పణలో తెరకెక్కిన 'రభస' ఆడియో వేడుక హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో నందమూరి అభిమానుల కోలా హలం మధ్య సందడిగా సాగింది.

    ఈ ఆడియో వేడుకకు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు వివి వినాయక్, రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరై ఆడియో సీడీలను ఆశిష్కరించడంతో పాటు, రభస థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసారు. ఈ సందర్భంగా జూ ఎన్టీఆర్ మాట్లాడుతూ... 17యేళ్ల వయసులో చిత్ర పరిశ్రమలో బిడ్డగా అడుగు పెట్టాను, ఇపుడు ఒక తండ్రిగా 'రభస' ఆడియో వేదికపై ఉండి మాట్లాడటం సంతోషంగా ఉంది అన్నారు.

    దర్శకుడు సంతోష్ శ్రీన్‌వాస్ మాట్లాడుతూ....(ఉద్వే గానికి గురై కంటతడి పెడుతూ..)జాండీస్ కారణంగా తాను అనారోగ్యానకి గురైనపుడు జూ ఎన్టీఆర్ నాకోసం 3 నెలలు ఆగారు. ఒక స్టార్ హీరో స్థాయిలో ఉండి ఆయన నాకోసం వెయిట్ చేయడం చాలా గొప్ప విషయం. నిర్మాత సురేష్ గారు చాలా సహకరించారు. నాకు దర్శకుడిగా పునర్జన్మనిచ్చారు అని వ్యాఖ్యానించారు. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

    వివి వినాయక్ మాట్లాడుతూ...

    వివి వినాయక్ మాట్లాడుతూ...


    'ఎన్టీఆర్ అంటేనే ఎనర్జీ...ఇపుడు ఆడియో వేడుకలో చూస్తున్న ఎనర్జీ రేపు రేపు సినిమా విడుదలైన తర్వాత కూడా కనిపిస్తుంది. ట్రైలర్ చాలా బాగుంది. సినిమా భారీ హిట్ అవుతుంది అన్నారు.

    దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ...

    దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ...


    రభస కాంబినేసన్ బాగుంది. హైఓల్టేజ్ సబ్జక్ట్ తో మీ ముందుకు వస్తున్నాడు. తారక్ చాలా ఎదిగిపోయాడు. తను ఇప్పుడు తండ్రయ్యాడు. చాలా ఆనందంగా ఉన్నాడు. ఈ సినిమా విజయంతో ఎన్టీఆర్ కి డబుల్ ఆనందం దక్కుతుంది'' అన్నారు.

    రభస గురించి జూ ఎన్టీఆర్..

    రభస గురించి జూ ఎన్టీఆర్..


    గత పది నెలలుగా ఈ సినిమా గురించి వర్క్ చేస్తున్నాము. మా డైరెక్టర్ హెల్త్ బాగోకపోవడం వల్లే ఈ సినిమా లేట్ అయ్యింది. ఈ సినిమా కోసం తను చాలా కష్లపడ్డాడు. తను పడ్డ కష్టానికి ఫలితం దక్కుతుంది. తమన్ మంచి ట్యూన్స్ ఇచ్చాడు. మా కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమా కూడా హిట్ అవుదుంది అన్నారు.

    సమంత మాట్లాడుతూ..

    సమంత మాట్లాడుతూ..


    'జూనియర్ ఎన్టీఆర్ తో నేను చేస్తున్న మూడో చిత్రం ఇది. అందరం కష్టపడి పని చేసాం. సినిమా బాగా ఆడుతుందనే నమ్మకం ఉందని తెలిపారు.

    సంతోష్ శ్రీనివాస్ రభస గురించి...

    సంతోష్ శ్రీనివాస్ రభస గురించి...


    రభస సినిమా క్రెడిట్ అంతా మా హీరో ఎన్టీఆర్ గారికే దక్కుతుంది. నేను చెప్పినకథ నచ్చి నాకు హెల్త్ బాగోలేకున్నా మూడు నెలలు వెయిట్ చేసారు. రభస సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్నారు.

    బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ..

    బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ..


    డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ చాలా కష్టపడ్డారు. తమన్, శ్యామ్.కె.నాయుడు గారు ఈ సినిమా కోసం చాలా చక్కగా వర్క్ చేసారు. ప్రణీత, ఈ సినిమాలోని మిగతా నటీనటులందరితో నటించడం ఆనందంగా ఉంది'' అని తెలిపారు.

    పాటపాడిన జూ ఎన్టీఆర్

    పాటపాడిన జూ ఎన్టీఆర్


    రభస చిత్రంలో ఎన్టీఆర్ జూ ఎన్టీఆర్ ‘రాకాసి రాకాసి' అనే పాట పాడిన విషయం తెలిసిందే. ఆడియో విడుదల సందర్భంగా కూడా ఆ పాట పాడి అభిమానులను అలరించారు ఎన్టీఆర్.

    English summary
    
 Junior NTR's Rabhasa Music launched. Starring Junior NTR, Samantha and Pranitha in leads, Rabhasa is directed by Santosh srinivas and produced by Bellamkonda Suresh and Bellamkonda Ganesh Babu on Sri Lakshmi Narasimha Productions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X