twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రహ్మీ 'కిల్ బిల్ పాండే' టైటిల్ తో చిత్రం

    By Srikanya
    |

    హైదరాబాద్ : రేసుగుర్రం చిత్రంలో బ్రహ్మానందం పాత్ర పేరు 'కిల్ బిల్ పాండే' . ఈ పాత్ర బాగా పాపులర్ అయ్యింది. దబాంగ్ ప్యారడీగా వచ్చిన ఈ క్యారక్టర్ భారీ స్ధాయిలో సక్సెస్ అయ్యింది. అసలు చివరి ఇరవై నిముషాలు లేకపోతే సినిమా ఆడదేమో అన్నంత ఇన్ఫూలియన్స్ చేయగలగింది. దాంతో 'కిల్ బిల్ పాండే' అనేది జనాల్లోకి బాగా వెళ్లిపోవటంతో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ వారు ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించారు.

    Kill Bill pandey title registered by Anandi art creations

    ఆనంది ఆర్ట్ క్రియేషన్ రీసెంట్ గా వెంకటాద్రి ఎక్సప్రెస్ చిత్రం నిర్మించింది. గతంలో తేజ దర్శకత్వంలో నువ్వు నేను వంటి సూపర్ హిట్స్ ఇదే బ్యానర్ నుంచి వచ్చాయి. అయితే కథ,దర్శకుడు, హీరో ఉండి ఈ టైటిల్ రిజిస్టర్ చేయించారో లేక టైటిల్ బాగుండి చేయించారో తెలియరాలేదు. అయితే త్వరలో ఈ టైటిల్ తో చిత్రం వచ్చే అవకాసం ఉందని సమాచారం. ఖచ్చితంగా అది కామెడీ చిత్రం అవుతుందని చెప్పుకుంటున్నారు.

    ఇక 'కిల్ బిల్ పాండే' పాత్ర చాలా ప్రస్టేషన్ తో ఊగిపోతూ సాగుతుంది. హీరోకి క్లైమాక్స్ లో తనకు తెలియకుండానే సాగుతుంది. ఈ పాత్ర కొద్దిగా బాద్షా లో బ్రహ్మానందం షేడ్స్ కలిగి ఉన్నా బాగా క్లిక్ అయ్యింది. బ్రహ్మానందం మాట్లాడుతూ... " నేను ఇప్పటివరకూ 987 సినిమాలు చేసాను. వాటిల్లో ఇది ఓ గుర్తుండిపోయే పాత్ర. ఈ విషయమై నేను సురేంద్ర రెడ్డి కి ధాంక్స్ చెప్తున్నా. సురేంద్రరెడ్డి ఈ చిత్రంలో నా పాత్ర చాలా సీరియస్ గా సాగుతుందని చెప్పాడు. నేను కన్ఫూజ్ అయ్యాను. అయితే ఇప్పుడు చాలా మంది ఈ పాత్ర తమకు బాగా నచ్చిందని చెప్పటం ఆనందాన్ని ఇస్తోంది. ," అన్నారు.

    English summary
    Brahamanandam's recent avatar as Kill Bill Pandey in Allu Arjun, Shruti Haasan starrer Race Gurram is the latest viral sensation on the internet. Not a day goes by without someone or the other from film industry raving about Kill Bill Pandey and how good Brahmanandam was in that role. Kill Bill pandey title registered by Anandi art creations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X