twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెమ్యూనరేషన్: కోన వెంకట్ నిర్మొహమాటంగా...

    By Bojja Kumar
    |

    Kona Venkat remuneration 1 cr
    హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని స్టార్ రైటర్లలో కోన వెంకట్ ఒకరు. కొంత మంది స్టార్ హీరోలు, దర్శకులు ఆయన లేకుండా సినిమా తీయరంటే అతిశయోక్తి కాదేమో. కామెడీ సన్నివేశాలు, పంచ్ డైలాగులు, స్క్రీన్ ప్లే లాంటివి పండించడంలో కోన వెంకట్ ఆరితేరిపోయారు.

    సాధారణంగా సినిమా ఇండస్టీలోని వ్యక్తులు తమ రెమ్యూనరేషన్ వివరాలు బయటకు చెప్పడానికి పెద్దగా ఇష్ట పడరు. అయితే కోన వెంకట్ మాత్రం ఇందుకు మినహాయింపు అని చెప్పొచ్చు. ఇటీవల ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో కోన వెంకట్ మాట్లాడుతూ.....తన రెమ్యూనరేషన్ వివరాలు నిర్మొహమాటంగా బయట పెట్టారు.

    ఒక్కో సినిమాకు తాను రూ. కోటి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు కోన వెంకట్ తెలిపారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన ఇంకా తన జీవితానికి సంబంధించిన చాలా విషయాలు వెల్లడించారు. ఆ మధ్య దర్శకుడు శ్రీను వైట్లకు, తనకు మధ్య ఏర్పడ్డ వివాదం గురించి కూడా తెలిపారు.

    శ్రీను వైట్ల సినిమాల్లో కోన వెంకట్ పాత్ర ప్రముఖంగా ఉండేది. అయితే ఆ మధ్య ఓ సినిమా విషయంలో ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. తనకు క్రెడిట్ ఇవ్వడం లేదంటూ.....పోస్టర్లపై తన పేరు వేయడం లేదని కోన వెంకట్ బహిరంగ వ్యాఖ్యలు చేసారు. అప్పటి నుండి ఇద్దరూ కలిసి పని చేయడం లేదనే విషయం తెలిసిందే.

    English summary
    Kona Venkat Revealed His Remuneration. He openly disclosed that his remuneration per movie is Rs.1 cr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X