twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచు లక్ష్మి ‘బుడుగు’ (ఫస్ట్ లుక్ పోస్టర్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నటి మంచు లక్ష్మి త్వరలో ఓ ఆసక్తికరమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'బుడుగు' అనే చిత్రంలో ఆమె సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. హైదారాబాద్ ఇన్నోవేటివ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మన్మోహన్ దర్శకత్వంలో భాస్కర్, సారికా శ్రీనివాస్‌లు ఈ సినిమా నిర్మిస్తున్నారు.

    తల్లితండ్రులు తమ పిల్లలపై ఆశలు ఏవో ఆశలు పెట్టుకుంటే సామర్య్థానికి మించిన ఒత్తిడికి లోనయి ఆ పిల్లలు ఎలా తయారు అవుతారు. అలాంటి పరిస్థితి ఎదురైన ఒక పిల్లాడు, అతని చుట్టూ జరిగిన కొన్ని సంఘటనలతో అతని కుటుంబం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది, ఆ సమస్యల నుండి వారు ఎలా బయట పడ్డారు అనేది ముఖ్య కథ.

    Lakshmi Manchu Budugu First Look Poster

    ఒక యధార్థ సంఘటన ఆధారంగా ఒక పిల్లాడి చుట్టూ జరిగిన కథతో థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందించారు. రచయిత, దర్శకుడు మన్మోహన్ మాట్లాడుతూ...'ఇలాంటి కథ ఇంతకు ముందు రాలేదని చెప్పవచ్చు. నాకు తెలిసిన ఒక సంఘటన ఆధారంగా, పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేసి, అనేక మంది సైకాలజిస్టులతో చర్చించి తయారు చేసుకున్న కథ అన్నారు. ఇద్దరు పిల్లలు, వారి తలితండ్రులు ఆ చిన్న కుటుంబం మధ్య పట్టుసడలని డ్రామా ఉంటుందని దర్శకుడు చెపుతున్నాడు. ఇందులో లక్ష్మీతో పాటు శ్రీధర్ రావు , ప్రేమ్ భాబు, మరికొన్ని ముఖ్య పాత్రల్లో బేబీ డాలి, సన, ఇందు, ఆనంద్, శైలజ, వాణి నటిస్తున్నారు.

    త్వరలో షూటింగ్ పూర్తి చేసుకోబోతున్న ఈచిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, ఎడిటింగ్: శ్యాం మేంగా, కళా దర్శకత్వం: ఏ.రాం, సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశీ పుల్లూరి, నిర్మాతల భాస్కర్ మరియు సారిక శ్రీనివాస్. రచన, దర్శకత్వం: మన్మోహన్

    English summary
    
 The first look of Budugu is unveiled and this film is directed by Manmohan. Manchu Lakshmi and Sreedhar Rao play the lead roles in this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X