twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బెంగళూరులో మహేష్ బాబు ...లాఠీ ఛార్జి(ఫొటోలు)

    By Srikanya
    |

    బెంగళూరు : రాజధానిలోని రాజాజీనగర్‌ ఫస్ట్‌బ్లాక్‌ అభిమాన జనసంద్రంతో నిండిపోయింది. ప్రిన్స్‌ మహేష్‌.. అనే నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. తమ హీరో నగరానికి రావడంతో అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

    ఒక దశలో వారిని నియంత్రించడానికి నిర్వాహకులు, పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మహేష్‌బాబు రాజాజీనగర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ నగల దుకాణాన్ని ప్రారంభించారు.

    మహేష్‌బాబు మాట్లాడుతూ... కర్ణాటకలోనూ తన పట్ల చూపుతున్న అభిమానానికి ఎంతో ఆనందంగా ఉందన్నారు. మహేష్ బాబు రాకకు మూడు నాలుగు గంటలు ముందు నుంచే జనం అక్కడకి చేరుకుని ఎదురుచూపులు చూసారు.

    స్లైడ్ షోలో...అక్కడ ఫోటోలు..విశేషాలు

    ఉదయం నుంచే..

    ఉదయం నుంచే..

    తమ హీరో వస్తాడని తెలుసుకున్న అభిమానులు ఉదయం 8 గంటల నుంచే షోరూం ముందు పడిగాపులు కాశారు. సరిగ్గా 12:30 గంటలకు ఆ ప్రాంతానికి చేరుకోగానే యువతీయువకులు ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఎగబడ్డారు.

    ఫ్యాన్స్ హంగామా

    ఫ్యాన్స్ హంగామా

    అభిమానులు చెట్లు, విద్యుత్తు స్తంభాలు, భవనాలు ఎక్కి మహేష్‌బాబును తనివి తీరా చూడటానికి తహతహలాడారు.

    ట్రాఫిక్ ఇబ్బంది

    ట్రాఫిక్ ఇబ్బంది

    కేవలం 20 నిముషాల్లోనే కార్యక్రమాన్ని ముగించిన మహేష్‌ తిరిగి వెళ్తుండగా అభిమానులు చుట్టుముట్టారు. ఆయన కాన్వాయ్‌ను ముందుకు సాగనీయలేదు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

    లాఠీ ఛార్జి

    లాఠీ ఛార్జి

    ట్రాఫిక్ ఆగిపోవటంతో పోలీసులు స్పందించి అభిమానులపై స్వల్పంగా లాఠీఛార్జి చేశారు. వారిని చెదరగొట్టాక మహేష్‌ కాన్వాయ్‌ను ముందుకు వెళ్లనిచ్చి రాకపోకలను పునరుద్ధరించారు.

    గతంలోనూ..

    గతంలోనూ..

    ఇంతకు ముందు కూడా మహేష్ ..బెంగుళూరు వెళ్లినప్పుడు ఇదే విధంగా ఆయన అభిమానులు చుట్టుముట్టారు.

    కన్నడ మీడియాలో..

    కన్నడ మీడియాలో..

    కన్నడంలో ఓ తెలుగు హీరోకు ఉన్న ఫాలోయింగ్ చూసి అక్కడ మీడియా ఆశ్చర్యపోతూ విజువల్స్ ని ప్రసారం చేసింది.

    సినిమాలాను..

    సినిమాలాను..

    మహేష్ సినిమాలు ..బెంగుళూరులో,కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో స్టైయిట్ గా విడుదలవుతూంటాయి. అక్కడ కలెక్షన్స్ సైతం బాగుంటాయి.

    దూకుడు

    దూకుడు

    కర్ణాటకలో గతంలో దూకుడు చిత్రం రికార్డులు క్రియేట్ చేసింది. ముఖ్యంగా బెంగళూరులో ఈ చిత్రం అక్కడ హీరోల చిత్రాలకు పోటీ ఇచ్చింది.

    తెలుగువారు ప్లస్

    తెలుగువారు ప్లస్

    కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో తెలుగువారు బాగా సెటిలయ్యారు. అలాగే బెంగుళూరులోనూ కొన్ని ప్రాంతాల్లో తెలుగు వారు ఎక్కువగా ఉండటం కూడా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ కి ఓ కారణం గా చెప్తున్నారు.

    సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు

    సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు

    మహేష్ బాబు ఫ్యాన్స్ లో ఎక్కువ మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు బెంగుళూరులో ఉన్నారని ఓ అంచనా. వారే ఫ్యాన్ క్లబ్ లు మెయింటైన్ చేయటం, సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో హడావిడి చేస్తూండటం చేస్తూంటారు.

    ప్రస్తుతం...

    ప్రస్తుతం...

    మహేష్‌బాబు - శ్రీనువైట్ల కలయిక మరోసారి 'ఆగడు' సినిమాతో పునరావృతం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పోలీసు పాత్రతో మరోసారి ప్రతాపం చూపించబోతున్నారు మహేష్‌బాబు. ఈ చిత్రంలో మహేష్ తొలిసారిగా రాయలసీమ యాస మాట్లాడుతూ తుపాకీ ఎక్కుపెట్టబోతున్నారు.

    ఎనకౌంటర్ స్పెషలిస్ట్..

    ఎనకౌంటర్ స్పెషలిస్ట్..

    'ఆగడు'లో ఆయన ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నట్టు సమాచారం. మహేష్‌, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రమిది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

    English summary
    Mahesh Babu who is strenuously working for his upcoming movie, Aagadu will take an off from his movie shooting this Sunday and fly to Bangalore.The actor is coming to the city to inaugurate a Jos Alukkas jewellery showroom. As the city boast of a huge fan following of the actor, the event is likely to be a crowded affair.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X