twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేవుళ్లపై వ్యాఖ్యలు: రామ్ గోపాల్ వర్మపై కేసు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కేసు నమోదు చేయాలని మల్కాజ్ గిరీ కోర్టులో పిటీషన్ దాఖలైంది. సంజయ్ అనే న్యాయవాది ఈ పిటీషన్ దాఖలు చేసారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు ఆయనపై కేసు నమోదు చేయాలని కుషాయిగూడ పోలీసులను ఆదేశించింది. హిందూ దేవుళ్లను అవమానించారనే అభియోగాలతో ఈ ప్రైవేట్ పిటిషన్ దాఖలైంది. కోర్టు ఆదేశాలతో కుషాయిగుడా పోలీసులు వర్మ పై 295(ఏ) కింద కేసు నమోదు చేశారు.

     Malkajgiri Court Orders Police to file case against RGV

    ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. శివుడు, వినాయకుడి గురించి వర్మ మాట్లాడుతూ... ''ఒక చిన్న పిల్లాడు అమ్మ స్నానం చేస్తుందని బయటి నుంచి వచ్చినవాడిని అడ్డం పెట్టిందుకు ఆ పిల్లాడి తల నరికేయడమనేది నాకు తెలిసి ఆల్ ఖైదా లాంటి అతి క్రూర టెర్రరిస్టులు కూడా చేయలేదు. దేవుడికి కొడుకని తెలియదంట. అంటే కొడుకు కాక పోతే ఏ పిల్లాడి తలైనా నరికేయొచ్చా..? నరికిన తర్వాత కొడుకు అని తెలుసుకుని దారిన పోయే ఏనుగు తల నరికి కొడుకు మొండెం మీద పెట్టే శక్తి ఉన్నపుడు నరికిన తన కొడుకు తలనే తిరిగి పెట్టొచ్చు కదా? పురాణాల ఎక్స్ పర్టులు దీని వెనకాల ఏదో కాంప్లికేటెడ్ అర్థం లేని కారణాలు చెబుతారు. కానీ రోల్ మోడల్స్ అవాల్సిన దేవుళ్లు దెయ్యాల కంటే వికృతంగా వింతగా ప్రవర్తింస్తుంటే అతి సామాన్య మానవుడినైన నాకు చిరాకేయదా....అయినా లోగుట్టు పరమ శివుని కెరుక'' అని వ్యాఖ్యానించారు.

    ''నేను దేవుడి కంటే దెయ్యాన్ని ఎక్కువ నమ్ముతాను. నాకు చిన్నప్పటి నుంచీ వినాయక చవితికి సంబంధించిన ఉండ్రాళ్లు తప్ప ఇంకేమీ ఇష్టం ఉండేది కాదు. కొన్నేళ్ల నుండి నేనే స్వీట్స్ తినడం మానేసాను. అప్పటి నుండి ఉండ్రాళ్లు కూడా లేవు. దేవుళ్లెవరూ ఇష్టం లేదు కానీ చాలా మంది దేవతలంటే తెగ ఇష్టం. లక్ష్మి, సరస్వతి తప్ప అందరు దేవతలూ ఇష్టమే. ఐదేళ్ల పరిపాలనలో తమ పనులు సరిగ్గా చేయని ఫైనాస్స్ మినిస్టర్ ని, ఎడ్యుకేషన్ మినిస్టర్ ని తిట్టుకునే జనాలు...వందల ఏళ్లుగా తమ పనులు చేయని ఫైన్స్ దేవత లక్ష్మిని, ఎడ్యుకేషన్ దేవత సరస్వతిని ఎందుకు పూజిస్తారో నాకర్థం కాదు'' అని వర్మ వ్యాఖ్యానించారు.

    English summary
    Malkajgiri Court Orders kushaiguda Police to file case against Film director Ram Gopal Varma.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X