twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శభాష్ ...మోహన్ బాబు : చరిత్ర నిన్ను మరవదు

    By Srikanya
    |

    హైదరాబాద్ : మోహన్ బాబు ఏం చేసినా అది గ్రాండ్ గా ఉంటుంది. తాజాగా ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారు. తెలుగు సినిమా పుట్టుపూర్వోత్తరాలు, సాధించిన ప్రగతి, అందుకొన్న మైలురాళ్లూ, వెన్నుదన్నుగా నిలిచిన దర్శక నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు... ఈ నేపథ్యంలో ఓ డాక్యుమెంటరీ రూపొందించేందుకు సమాయాత్తం అవుతున్నారాయన.

    ఇందు నిమిత్రం ఆరు కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. దాంతో తెలుగు సిని అభిమానులంతా మోహన్ బాబు ని మెచ్చుకుంటున్నారు. మిగతా ఏ హీరో చేయని ఆలోచనను,పనిని ఆయన చేస్తున్నందుకు అభినందనలు తెలియచేస్తున్నారు.

    Mohan Babu's 6 Crore Tribute To TFI

    భారతీయ చలన చిత్ర పరిశ్రమ వందేళ్ల పండుగ చేసుకొంటోంది. అందులో తెలుగు సినిమా వాటా ఎనభై మూడేళ్లు. దేశం గర్వించే నటీనటులు, సాంకేతిక నిపుణులనూ తెలుగు సినిమా అందించింది. సినీ జగత్తు మురిసిపోయే సినిమాల్ని రూపొందించింది. ఈ చరిత్రని నిక్షిప్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

    ఈ విషయం గురించి విష్ణు మాట్లాడుతూ ''తెలుగు సినిమా ఎంతో సాధించింది. ఈ పురోగతి భావి తరాలకు ఆదర్శం. 'తెలుగు సినిమా చరిత్ర అందరికీ తెలియాలి. అందుకోసం మనం ఏమైనా చేయాలి..' అని నాన్న నాతో చెప్పారు. ఆయన కోసం చేస్తున్న చిరు ప్రయత్నం ఇది. పెద్దలు దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, డి.రామానాయుడు మొదలైన వాళ్లందరి సలహాలూ సూచనలతో ఈ డాక్యుమెంటరీ రూపొందిస్తాం. వీటికి సంబంధించిన కసరత్తులు మొదలుపెట్టాము''అన్నారు.


    English summary
    Mohan Babu is now making a special documentary on 100 years of Indian cinema.Surprising part is that Mohan Babu is spending an whopping 6 crores to turn this documentary into the best ever thing made in India on film industries.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X