twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అరవింద్ క్రేజీ వాల్ టైటిల్,గెటప్ లో ఎమ్.ఎస్ నారాయణ(ఫోటో)

    By Srikanya
    |

    హైదరాబాద్: ప్రముఖ హాస్య నటుడు ఎమ్.ఎస్ నారాయణ త్వరలో అరవింద్ క్రేజీవాల్ లాగ కనిపించి అలరించనున్నారు. ఈ కథతో ఓ చిత్రం రూపొందుతోంది. మోహన్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని జి.హృషికేష్ గౌడ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ నిన్నే మొదలైంది. టైటిల్ కూడా క్రేజీవాల్ అనే పెట్టారు. ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్లే, ప్రయత్నం విరమిస్తే మరణించినట్లే అనే ట్యాగ్ లైన్ తో ఈ చిత్రం రూపొందనుంది.

    ఇక అరవింద్ కేజ్రీవాల్...విషయానికి వస్తే... ఒక సామాన్య కుటుంబానికి చెందిన ఆయన ఐఆర్‌ఎస్ సాధించడం నుంచి ఢిల్లీలో కాంగ్రెస్‌ను మట్టికరిపించి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునే వరకూ ప్రతి అడుగూ ఆసక్తికరమే. అయితే సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చేసిన ఉద్యమంతోనే ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోక్‌పాల్ బిల్లుకు ప్రత్యామ్నాయంగా 'జన్‌లోక్‌పాల్ బిల్లు'ను రూపొందించిన అన్నా హజారే బృందంలో కేజ్రీవాల్‌ది ఎంతో కీలకమైన పాత్ర. ఆయన జీవిత విశేషాలను ఒకసారి గమనిస్తే....

    MS Narayana Krejiwala Movie

    జననం: 1968, ఆగస్టు 16న, హిస్సార్‌లో
    పార్టీ: ఆమ్ ఆద్మీ పార్టీ
    భార్య: సునీతా కేజ్రీవాల్ (ఐఆర్‌ఎస్ అధికారి)
    విద్య: హిస్సార్ క్యాంపస్ స్కూల్ (పాఠశాల విద్య), ఐఐటీ ఖరగ్‌పూర్ (మెకానికల్ ఇంజనీరింగ్)
    జీవనశైలి: శాకాహారి, కొన్నేళ్లుగా బౌద్ధమతానికి సంబంధించిన 'విపాసనా' ధ్యానాన్ని ఆచరిస్తున్నారు
    రచనలు: స్వరాజ్ (2012లో ప్రచురితమైంది)
    1989-92: కేజ్రీవాల్ టాటా స్టీల్‌లో ఉద్యోగం చేశారు
    1995: సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించి ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్‌ఎస్)లో చేరారు
    1999: డిసెంబర్‌లో పరివర్తన్ (మార్పు) ఉద్యమం ప్రారంభానికి సహాయం అందించారు
    2000: ఉన్నత విద్య కోసం రెండేళ్ల పాటు ఆర్జిత సెలవు తీసుకున్నారు
    2003: ఉద్యోగంలో తిరిగి చేరారు. 18 నెలలు పనిచేసిన తర్వాత మళ్లీ 18 నెలల పాటు సెలవుపై వెళ్లిపోయారు
    2006: ఢిల్లీలోని ఆదాయపన్ను శాఖలో జాయింట్ కమిషనర్ హోదాలో ఉన్న ఆయన ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు (ఈ విషయమై ఆయన కనీసం మూడేళ్ల పాటు పనిచేయకుండా ఐఆర్‌ఎస్‌ను వదిలిపెట్టి ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ కేంద్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది)
    2011: ఐఆర్‌ఎస్‌ను కనీస గడువు ముగియకముందే వదిలేసినందుకుగాను స్నేహితుల వద్ద రుణాలు తీసుకొని ప్రభుత్వానికి సంబంధిత మొత్తం చెల్లించారు.
    2012: నవంబర్ 26న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ను ప్రారంభించారు.
    2013: ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను 26 వేల ఓట్ల మెజార్టీతో ఓడించి సంచలనం సృష్టించారు.

    English summary
    MS Narayana has imitated many star heroes in films is replicating Aam Aadmi Party chief and Delhi former chief minister Arvind Kejriwal in an upcoming film titled ‘Krejiwala’. Written and Directed by Mohana Prasad, Krejiwala is produced by G Hrishikesh Goud.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X