twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అత్తారింటికి దారేదిలో అదరగొట్టారు' అంటున్నారు(ఫొటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : విమానాశ్రయాల్లో 'హలో' అంటూ అభిమానులు చేయి వూపడం... ఆటోగ్రాఫ్‌ల కోసం రావడం.. నటులుగా మాకు మామూలే! కానీ మొన్న దసరా రోజు హైదరాబాద్‌ విమానాశ్రయంలో నాకు ఎదురైన అనుభవం వేరు. విమానం దిగి లాబీలోకి రాగానే ఎంతోమంది అమ్మాయిలూ అబ్బాయిలూ జుమ్మని వచ్చేశారు. 'అత్తారింటికి దారేదిలో అదరగొట్టారు' అంటూ ఫొటోలు దిగేందుకు చుట్టుముట్టారు అంటూ తన ఆనందాన్ని పంచుకుంది నదియా.

    పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'అత్తారింటికి దారేది' చిత్రంలో పవర్ స్టార్ అత్త పాత్రలో నటించింది నటి నదియా. మిర్చి చిత్రంతో మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చిన నదియా....పవన్ స్టార్ సినిమాతో పెద్ద స్టార్‌గా మారి పోయింది. దీంతో ఆమోతో ఫోటో షూట్లకు పోటీ పడుతున్నాయి మేగజైన్లు. ఒక టైంలో తెలుగు, తమిళ, మలయాళ సినిమాలను ఊపేసిన నదియా చాలా కాలం తర్వాత మళ్లీ బిజీ అయిపోతుంది.

    అలాగే దసరా రోజు విజయోత్సవ సభలో నా పేరు చెప్పగానే మోగిన చప్పట్లూ, కేరింతలూ, పొగడ్తలూ.. ఓహ్‌..! ఒకప్పుడు హీరోయిన్‌గా చేసినప్పటి కాలం కళ్లముందు నిలిచింది. తెలుగు ప్రేక్షకుల స్పందన నాలో ఎన్నో ఆలోచనలను రేకెత్తించింది. ఇప్పుడు నేనేమన్నా హీరోయిన్ నా? కుర్రకారుని వూపేసే డాన్సర్‌నా? నలభైల్లో ఉన్న నాపై కొత్తగా ఈ అభిమానం ఏమిటి? ఒక్కసారిగా నా వయసు పదేళ్లు తగ్గిన భావన కలిగింది అంటూ నదియా మీడియాతో ఎన్నో కబుర్లు ముచ్చటించింది.

    నదియా చెప్పిన ముచ్చట్లు స్లైడ్ షోలో...

    కృతజ్ఞతలు

    కృతజ్ఞతలు

    తెలుగుకి దాదాపుగా నేను కొత్తనే చెప్పాలి. ఇరవై ఏళ్లకిందట తెలుగులో రెండు మూడు సినిమాలు చేశా. కొన్ని డబ్బింగ్‌ సినిమాలొచ్చాయి.. అంతే! ఇన్ని సంవత్సరాల తరవాత వాళ్ల ముందుకి వచ్చినప్పుడు ఇంతలా ఆదరిస్తున్నారంటే ఏమనాలి... వాళ్ల అభిమానానికి కృతజ్ఞతలు అంటూ ఆనందంగా చెప్పసా.

    మిర్చి నుంచి...

    మిర్చి నుంచి...

    నదియా 'మిర్చి'లో ప్రభాస్ కు తల్లిగా నటించి మంచి మార్కులనే కొట్టేసింది. ఈ సినిమా చూసిన వారు నదియాకు ప్రత్యేకంగా మార్కులు వేశారు. దీంతో తెలుగులో మరో ఆఫర్ లభించింది. నదియా ఇప్పుడు పవన్ కల్యాణ్ కు అత్తగా నటించే ఛాన్స్ కొట్టేసింది. పవన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో సమంతకు తల్లిగా నటించిందిది. ఇందులో కూడా ఆధునిక భావాలున్న మహిళగానే నదియా కనిపించనుంది. ఈ సినిమా తనకు మరింత గుర్తింపు వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తోంది. నదియా 1988 లో 'బజార్ రౌడీ' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం అయింది. ఆమె పెళ్లి తర్వాత తెలుగు తెరకు దూరమై మళ్లీ మిర్చి చిత్రంలో దర్శనం ఇచ్చింది.

    'మిర్చి'ని మర్చిపోలేను...

    'మిర్చి'ని మర్చిపోలేను...

    1994లో సినీ పరిశ్రమకు దూరమయ్యాక.. 2004లో తమిళంలో ఎన్‌.కుమరన్‌ సన్‌ ఆఫ్‌ మహలక్ష్మీ చిత్రంతోనే మళ్లీ వచ్చా. తెలుగు 'ఇడియట్‌'కు అది రీమేక్‌. హీరో తల్లి పాత్రని అందులో జయసుధ అద్భుతంగా చేశారు. కానీ దాన్లో కొన్ని సన్నివేశాలే చూశా. ఎందుకంటే జయసుధ నటన ప్రభావం నాపై పడకూడదని. ఆ సినిమా విడుదలయ్యాక తమిళ ప్రేక్షకులు 'ఆహా.. ఓహో' అన్నారు. అలా నా రెండో ఇన్నింగ్స్‌ పెద్ద విజయంతో మొదలైంది. గత తొమ్మిదేళ్లలో ప్రాధాన్యమున్న పాత్రలే అంగీకరించాను. వాటిలో 'మిర్చి' ఒకటి. కుటుంబం కోసం తపన పడిన ఓ గృహిణి ఒక్క క్షణంలో ప్రాణాలు కోల్పోయే ఆ పాత్ర నాకెంతో నచ్చింది. నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది కూడా.

    త్రివిక్రమ్ చెప్పినట్లే...

    త్రివిక్రమ్ చెప్పినట్లే...

    'సునందది తీవ్ర ఉద్వేగాలున్న పాత్ర. కానీ ఆమె నుంచి అరుపులూ, తిట్లూ, మూసధోరణి కోపాలూ ప్రేక్షకులు చూడకూడదు..' అని దర్శకుడు త్రివిక్రమ్‌ చెప్పారు. మన సినిమాల్లో సాధారణంగా అత్త పాత్రలంటే క్రూరంగా.. కఠినంగా.. కపటంగా ఉండేవి. లేకపోతే మరీ వెకిలిగా.. అతి చిలిపిగా ప్రవర్తించేవి. ఆ ధోరణికి దూరంగా ఉండాలనుకునే నాకు... త్రివిక్రమ్‌ చెప్పిన పాత్ర బాగా నచ్చింది. ఓ సవాలుగా అనిపించింది. దానికి న్యాయం చేయాలనుకున్నా. ఆ ప్రయత్నం ఫలించిందని తెలుగు అభిమానులే చెబుతున్నారు. ఈ ఆదరణ చూశాక మొదట్లోనే మరికొన్ని తెలుగు సినిమాలు చేసుంటే బావుండేదని ఇప్పుడనిపిస్తోంది!

    తొలి సినిమాలు...

    తొలి సినిమాలు...

    నేను పుట్టి పెరిగిందంతా ముంబయిలో. నాన్న, అమ్మ ఇద్దరూ టాటా సంస్థలో పనిచేస్తుండేవారు. మామూలు మధ్యతరగతి కుటుంబమే. ఇంటర్‌ పూర్తయి చిత్రలేఖనంలో శిక్షణ తీసుకుంటున్నప్పుడు అనుకోకుండా సినిమా అవకాశం వచ్చింది. 1984లో మలయాళ దర్శకుడు ఫాజిల్‌ తన చిత్రంలో కథానాయిక పాత్ర చేయమని అమ్మా, నాన్నల ద్వారా అడిగించారు. ఫాజిల్‌గారి అన్నయ్య అమ్మానాన్నలకు మిత్రుడు. మొదట తటపటాయించా. ఎందుకంటే ఆ పాత్ర చాలా క్లిష్టమైంది. కథ మొత్తం ఓ బామ్మ, ఆమె మనవరాలు చుట్టూ తిరుగుతుంది. హీరో పాత్ర నామమాత్రం. అయినా సవాలుగానే తీసుకున్నా. అది పెద్ద హిట్టు. ఫిలింఫేర్‌ సహా పలు అవార్డులొచ్చాయి.

    అసలు పేరు...

    అసలు పేరు...

    నా అసలు పేరు ...జరీనా అనే పేరు నదియాగా మారింది ఆ సినిమాతోనే. దాన్నే తమిళంలో తీస్తే అక్కడా విజయమే! ఆ రెండు భాషల్లోనూ.. బోలెడన్ని అవకాశాలు. కేవలం స్టెప్పులేసి.. కన్నీళ్లు కార్చే హీరోయిన్ లా కాకుండా నాదైన ముద్ర ఉండాలనుకున్నా. నటన, ఆహార్యంలో అప్పటి కాస్మోపాలిటన్‌ అమ్మాయిలా కనిపించాలనుకున్నా. ఇప్పుడంటే చుడీదార్‌లూ, సల్వార్‌లూ కామన్‌. అప్పట్లో వాటి వాడకం తక్కువ. నా చిత్రాల్లో ఎక్కువగా అవే వాడేదాన్ని. తమిళనాడులో చుడీదార్‌లంటే 'నదియా డ్రెస్‌' అనేంతగా పేరొచ్చిందంటే నమ్మండి! నా తొలిచిత్రం హీరో.. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌! తరవాత మమ్ముట్టి, రజనీకాంత్‌లతో వరుస అవకాశాలొచ్చాయి.

    ప్రేమ కోసమే దూరమయ్యా..

    ప్రేమ కోసమే దూరమయ్యా..

    కెరీర్‌ గ్రాఫ్‌ పైకెగసిన ఆ సమయంలో ఒక్కసారిగా సినిమాలు తగ్గించుకోవాలనుకున్నా. చాలా కఠిన నిర్ణయమే. కానీ తప్పలేదు. కారణం... ప్రేమే! అవును.. సినిమాల్లోకి రాకముందే నేనూ, శిరీష్‌ ప్రేమించుకున్నాం. ముంబయిలో ఇద్దరిదీ ఒకే వీధి. చిన్నప్పటి నుంచే తను నాకు స్నేహితుడే. నేను సినిమాల్లోకి వచ్చాక తను విదేశాలకు వెళ్లిపోయాడు. ఫోన్‌లో మాట్లాడుకునే వాళ్లం. మా పెళ్ళికి రెండు కుటుంబాలూ అంగీకరించాయి. కానీ అప్పటికే చేతిలో చాలా సినిమాలు. తెలుగులో వచ్చిన అవకాశాలనూ వద్దనుకున్నది అప్పుడే. అయినా ఉన్న సినిమాలు పూర్తి చేయడానికి మూడేళ్లు పట్టింది.

    పెళ్ళయ్యాకా కొన్ని సంవత్సరాలు

    పెళ్ళయ్యాకా కొన్ని సంవత్సరాలు


    కథానాయికగా చేశాను. తరవాత ఇక చాలనిపించింది...! 'ఎప్పుడో ఎక్కడో కచ్చితంగా ఆట ఆపడం ఓ కళ..!' అంటారుగా. ఆ సమయం వచ్చిందని అనుకున్నా. వృత్తిపరమైన విజయాలతోబాటు కుటుంబ జీవితానికీ ప్రాధాన్యం ఉండాలిగా! నేను అదే చేశా. ఓ మామూలు గృహిణిగా ముంబయి వెళ్లిపోయా. ఇద్దరు పిల్లలు పుట్టేదాకా.. సినిమా వూసే పట్టించుకోలేదు. వాళ్లు కాస్త పెద్దయ్యాకే మళ్లీ ఇటు దృష్టి సారించా. అందుకు మా వారు శిరీష్‌ ప్రోత్సాహం కారణం.

    మతాంత వివాహం...

    మతాంత వివాహం...

    కెరీర్‌ ఉన్నతస్థాయిలో ఉన్నప్పుడే.. నేను సినిమాలను వదిలేశాననే బాధ శిరీష్‌లో ఉంది. 'పెళ్ళి వల్లే కదా.. ఇంత మామూలుగా ఉండిపోయావ్‌!' అంటుండేవారు. అందుకే.. మళ్లీ మేకప్‌ వేసుకోవాలని పట్టుబట్టారు. సినిమాల్లోకి వచ్చాను. నటన నాకు తీరని దాహమే కావొచ్చు. కానీ తల్లిగా నా బాధ్యతలూ ముఖ్యమైనవే. అందుకే రెండింటికీ న్యాయం చేయాలనుకున్నా. సినిమాలను ఆచితూచి ఎంచుకోవాలనీ.. తల్లిగా నా లోటు తెలియకుండా చూసుకోవాలనీ నియమం పెట్టుకున్నా. ఈ క్షణం దాకా వాటిని తు.చ.తప్పకుండా పాటిస్తున్నా. చిత్రీకరణలో ఎంత బిజీగా ఉన్నా మా పిల్లలు ఫ్యాన్సీ పోటీలకు ఏయే డ్రెస్సులు వేసుకోవాలో ఫోన్‌ ద్వారా చెబుతుంటా. నేను పుట్టి, పెరిగింది సంప్రదాయ ముస్లిం కుటుంబంలో. శిరీష్‌ వాళ్లేమో మరాఠీ హిందువులు. పెళ్ళయ్యాక ఒక్కసారిగా కొత్త ప్రపంచంలోకి వచ్చిపడ్డట్టు అనిపించినా.. అత్తింటి వారు నన్ను సొంత కూతురిలా చూసుకుంటున్నారు. నేను పుట్టిపెరిగిన మధ్యతరగతి వాతావరణం నన్ను ఆ ఇంట్లో సర్దుకునేలా చేసింది. మా అత్తకంటే.. ఆమె అమ్మగారు నాపై విపరీతమైన ప్రేమ కురిపించారు.

    కుటుంబం అండతోనే..!

    కుటుంబం అండతోనే..!

    మా అమ్మానాన్నలు మాకు తోడుగా నిలిచారు. నేను చిత్రీకరణలకు వచ్చినప్పుడు వాళ్లు పిల్లలతో ఉన్నారు. ఇప్పుడు పిల్లలకూ బాగానే అలవాటైపోయింది. మా పెద్ద పాప సనమ్‌ ఇప్పుడు 11వ తరగతి చదువుతోంది. నిజానికి నేనిప్పుడు తననుంచే ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నా. చిత్రీకరణలో ఎవరైనా ఇబ్బందికరంగా మాట్లాడి.. బాధగా అనిపిస్తే నా తొలి ఫోన్‌ తనకే. 'మమ్మీ.. మనుషులు కొందరు అలాగే ఉంటారు..!' అని చెబుతుంది తను. ఇక మా చిన్నపాప తన స్కూల్‌ కబుర్లు చెప్పి నవ్విస్తుంది. ఇంట్లో ఉంటే ఇండియన్‌, చైనీస్‌, కాంటినెంటల్‌ వంటలతో అదరగొట్టేస్తాను. వీలున్నప్పుడంతా వివిధ భాషలు నేర్చుకుంటూ ఉంటాను.

    నటనకు ప్రాధాన్యమున్నవే...

    నటనకు ప్రాధాన్యమున్నవే...

    ప్రస్తుతం ఆరు భాషలు వచ్చునాకు! తాజాగా ఏడో భాష నేర్చుకోవాలనుంది. తెలుగు గురించే చెబుతున్నాలెండి! అందరూ అడుగుతుంటారు.. ఈ వయసులోనూ మీరెలా ఇంత ఫిట్‌గా ఉంటున్నారని. నిజం చెప్పాలంటే.. నాకు తిండిపై మహా మోజు. అంతగా తినే నేను.. అంతేస్థాయిలో వ్యాయామం చేయక తప్పుతుందా? తెలుగులో ఇప్పుడు చాలా అవకాశాలొస్తున్నాయి. మంచి కథ.. నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాతో మళ్లీ మీ ముందుకొస్తా!

    కుర్రకారు మెచ్చిన అత్తని!

    కుర్రకారు మెచ్చిన అత్తని!

    'అత్తారింటికి దారేది విడుదలైన వేళావిశేషమేమో.. మేం కొత్త ఇంటికి వచ్చేశామండీ! వస్తువులు సర్దుతున్నాం. ఇంతలో మీ పలకరింపు...' అంటూ చెప్పుకొచ్చింది నదియా. అబ్బో...చాలా చెప్పా! ఇదిగో మా ఆయనా, పిల్లలూ భోజనానికి రమ్మని పిలుస్తున్నారు. నాకూ ఆకలి దంచేస్తోంది. తెలుగు అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పండి!' అంటూ సంభాషణ ముగించారు. ఆమె ఇప్పుడు బాలకృష్ణ సినిమాలో నటిస్తోందని తెలుస్తోంది.

    English summary
    Nadhiya is a Malayalam and Tamil film actress who made her debut in a Malayalam movie named Nokketha Doorathu Kannum Nattu, alongside Mohanlal and Padmini. She has also acted in a few Telugu films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X