twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగ చైతన్య, సుధీర్ వర్మ మూవీ టైటిల్ అదేనా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఏ మాయ చేసావె, 100% లవ్, తడాఖా, మనం వంటి సూపర్ హిట్ చిత్రాల హీరో నాగ చైతన్య కథానాయకుడిగా, '1 నేనొక్కడినే' ఫేం కృతి సనన్ హీరోయిన్‌గా, స్వామి రారా వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సుధీర్ వర్మ దర్శకత్వంలో అత్తారింటికి దారేది వంటి ఇండస్ట్రీ హిట్ నిర్మించిన బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి 'మాయగాడు' అనే టైటిల్ ఖరారు చేసారు.

    భోగవల్లి బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రై.లి పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ చైతన్య మాట్లాడుతూ...'సుధీర్ వర్మ తీసిన స్వామిరారా నాకెంతో ఇష్టం. ఈ సినిమా కోసం చాలా మంచి సబ్జెక్టు చెప్పారు. తప్పకుండా ఇది నా కెరీర్లో మరో హిట్ సినిమా అవుతుంది' అన్నారు.

    Naga Chaitanya next movie titled Mayagadu

    నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ 'అత్తారింటికి దారేది' తర్వాత మా బేనర్లో చేస్తున్న ఈ సినిమా మరో డిఫరెంట్ మూవీ అవుతుంది. సుధీర్ వర్మ సబ్జెక్టు చాలా డిఫరెంటుగా ఉంది. నాగ చైతన్యకు హండ్రెడ్ పర్సెంట్ సూట్ అయ్య కథ ఇది. నాగ చైతన్య కూడా కథ విని చాలా ఎక్సైట్ అయ్యారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా లావిష్‌గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.

    దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ 'అత్తారింటికి దారేది వంటి ఇండస్ట్రీ హిట్ నిర్మించిన ప్రసాద్ గారి బేనర్లో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. స్వామి రారా తర్వాత నేను చేస్తున్న ఈ సినిమా నాగ చైతన్యకు పూర్తి యాప్ట్ అవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో చాలా ఉన్నాయి. ఈ సినిమా నా కెరీర్‌కి మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది' అన్నారు.

    ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, రవిబాబు, రావు రమేష్, ప్రవీణ్, పూజ, సత్య తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: సన్నీ ఎం.ఆర, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, ఆర్ట్: నారాయణరెడ్డి, పాటలు: శ్రీమణి, కృష్ణ చైతన్య, కో డైరెక్టర్: విజయ్ సిహెచ్, స్టిల్స్: శ్రీను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్ ఈదర, సమర్పణ: బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుధీర్ వర్మ.

    English summary
    Naga Chaitanya’s undershoot film in the direction of Sudheer Varma has been titled as Mayagadu. Sudheer Varma shot to fame with his debut directorial Swamy Ra Ra.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X