twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శిక్షణ అవసరం: తెలంగాణ అంశంపై నాగార్జున

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలంగాణలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలనే అనే ప్రశ్నకు తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు నాగార్జున. తన పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రజ్యోతి తెలుగు దిన ప్రతికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.... శిక్షణ, నైపుణ్యం పెరగాల్సిన అవసరం ఉందని, ఇప్పటి ట్రెండుకు అనుగుణంగా సాంకేతిక విలువలు అందిపుచ్చుకోవాలి అంటున్నారు.

    నాగార్జున మాట్లాడుతూ... ''ఒకప్పుడు ఫిల్మ్‌ఇండస్ట్రీలో ఎదగాలంటే ఎవరి దగ్గరో చేరి నేర్చుకునేవారు. ఇప్పుడు మంచి ఎడ్యుకేషన్‌ ఉంటే చాలు. స్టోరీరైటింగ్‌, స్ర్కిప్టురైటింగ్‌, డ్యాన్సింగ్‌ ఏదైనా సరే, మొదట బేసిక్స్‌ నేర్చుకోవాలి. ఇప్పటివరకు మనం మ్యూజిక్‌, డ్యాన్సింగ్‌ విషయానికొస్తే.. చెన్నై మీదనే ఆధారపడుతున్నాం. తెలంగాణ నుంచి ఇప్పటికిప్పుడు మంచి సినిమాలు తీయొచ్చు. ప్రస్తుతం కావాల్సిందల్లా కేవలం నాణ్యమైన శిక్షణ. బేసిక్‌ ట్రైనింగ్‌ తీసుకుంటే సులువు అవుతుంది' అన్నారు

    Nagarjuna about Telangana films

    'నేను కూడా ఎవరినైనా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా తీసుకోవాలంటే.. ముందు బేసిక్‌ క్వాలిఫికేషన్‌ ఏంటి? అనడుగుతాను. ఇంటర్‌నెట్‌ నుంచి దేన్నయినా పికప్‌ చేసుకునే నైపుణ్యం అవసరం. గ్రాఫిక్స్‌ చేయగలిగే సామర్థ్యం కావాలి. సొంతంగా ఒక లఘుచిత్రం తీయగలిగే నాలెడ్జ్‌ ఉండాలి. కాబట్టి.. బేసిక్స్‌ నేర్చుకుంటే.. తెలంగాణలోనే కాదు, ఎక్కడైనా సినిమారంగం వృద్ధి అవుతుంది. ఈ విషయంలో మన తెలుగు సినీరంగం కాస్త వెనకబడింది. ముంబయిలోనున్న బాలీవుడ్‌కు సడన్‌గా అంత అప్‌గ్రెడేషన్‌ ఎందుకొచ్చిందంటే- కథల్లో వైవిధ్యం వల్ల కాదు. సాంకేతికంగా అవి చాలా అడ్వాన్స్‌గా ఉంటున్నాయి. అక్కడ బాగా చదువుకుని నైపుణ్యాలు కలిగిన వాళ్లు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నారు. కొత్త కొత్త డిప్లొమా కోర్సులు చేసొస్తున్నారు. ఏ రంగానికైనా ఇదే వర్తిస్తుంది..'' అన్నారు.

    English summary
    Nagarjuna comments about Telangana films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X