twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున కు కూడా బాగా నచ్చిందిట

    By Srikanya
    |

    హైదరాబాద్ : వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం చిత్రంపై ప్రశంసల వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రాన్ని నాగార్జున చూసారు. ఆయన తాను ఈ చిత్రాన్ని బాగా ఇష్టపడ్డానంటూ, ముఖ్యంగా వెంకటేష్ నటన ని మెచ్చుకున్నారు. ఈ విషయమై మాట్లాడుతూ.... "దృశ్యం చిత్రం చూసి చాలా ఆనందపడ్డాను. ముఖ్యంగా వెంకటేష్ ఫెరఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఆయన స్టార్ అయి ఉండి కూడా మధ్య తరగతి కుటుంబ వ్యక్తిగా పాత్రలో ఇమిడిపోయారు " అన్నారు.

    అలాగే దృశ్యం చిత్రంలో కాంప్లిక్ట్ చాలా బాగా హాండిల్ చేసారని, ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని అన్నారు. రీసెంట్ గా నాగార్జున కూడా తన వయస్సుకు తగ్గ పాత్రలో మనంలో కనిపించారు. ఆయన కూడా కంటెంట్ బేసెట్ చిత్రాలపై ఆసక్తి చూపుతున్నారు. త్వరలో ఎన్టీఆర్ తో కలిసి ఆయన ఓ చిత్రం చేయబోతున్నారు. వంశీ పైడిపల్లి దర్సకత్వంలో రూపొందే ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నారు.

    మరో ప్ర్కక్ అక్కినేని కుటుంబ తాజా చిత్రం మనం కు వస్తున్న రెస్పాన్స్ కు నాగార్జున ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నారు. యుఎస్ లో ఈ చిత్రం కలెక్షన్స్ కుంభవృష్టి కురుస్తోంది. దాంతో ఆయన తమ సినిమాని ఆదరిస్తున్న అభిమానులందిరకీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. కాలంతోపాటు పద్ధతులు, నాగరికత వల్ల అలవాట్లు మారతాయేమో కానీ ప్రేమ మారదు. నిన్న, నేడు, రేపు.. ఎప్పుడైనా సరే. ప్రేమ ప్రేమే. అదే మా 'మనం' సారం.

    Nagarjuna praises Drushyam

    ''నాన్నగారు నటించిన చివరి చిత్రం 'మనం'. మీ అందరికీ నచ్చేలా, కలకాలం నిలిచిపోయేలా తీర్చిదిద్దాం. నాన్నతో, చైతన్యతో కలిసి నటించడం ఓ తీపి జ్ఞాపకం'' అంటున్నారు నాగార్జున. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన చిత్రం 'మనం'. సమంత, శ్రియ కథానాయికలు. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించారు. అక్కినేని కుటుంబం నిర్మించింది. నాగార్జున మాట్లాడుతూ ''70 ఏళ్ల తన సినీ జీవితంలో మనల్ని నవ్వించారు, కవ్వించారు, ఏడిపించారు ఏఎన్నార్‌. మన గుండెల్లో నిలిచిపోయారు. చివరి క్షణం వరకూ నటుడిగానే ఉండాలన్నది ఆయన కోరిక. దానికి ప్రతి రూపమే... 'మనం' అన్నారు.

    ఈ సినిమాలో బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.

    English summary
    Nagarjuna happened to see the Drushyam recently, and had some great words to say about the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X