twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నమిత పొలిటికల్ ఎంట్రీపై హాట్ ఇంటర్వూ (ఫోటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్: కొంతకాలం క్రితం వరకూ తనకంటూ ప్రత్యేక స్టార్‌డం సొంతం చేసుకుని.. ప్రేక్షకలోకాన్ని ఉర్రూతలూగించిన బొద్దుగుమ్మ నమిత. 'మచ్చాన్‌..' (బావా) అంటూ అందర్నీ పలకరిస్తూ అందాలరాణిగా కోలీవుడ్‌లో స్థిరపడిన అమ్మడు ఆ తర్వాత తన పుట్టింటికి వెళ్లిపోయి.. సినిమాలకు కాస్త దూరమైంది.

    అందాల ఆరబోతతో తన సినీ కెరీర్‌ని లాక్కొచ్చేస్తున్న నమితకు ఇప్పుడు బాలీవుడ్ నుంచి పెద్ద పోటీ ఎదురవుతోంది. ముంబై నుంచి రోజుకో భామ దిగుతూ నమితకు ఓ రేంజిలో సవాల్ విసురుతోంది. ఈ మధ్య పలువురు హీరోయిన్లు కూడా ఐటం సాంగులు చేయడానికి వెనకాడటం లేదు....దీంతో నమిత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది.

    ఇప్పుడు మళ్లీ కోలీవుడ్‌.టాలీవుడ్ లలో రాణించాలని కంకణం కట్టుకుంది. కానీ అవకాశాలు మాత్రం వరించలేదు. ఇప్పటికీ నేనే అందాలభామ అని చెప్పుకుంటోంది. అన్నట్టు.. అమ్మడు త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనుందట! ఈ సందర్భంగా తన సినీ, వ్యక్తిగత, ప్రేమ, పెళ్లి ఇలా ఎన్నో విశేషాల గురించి చెప్పిన ముచ్చట్లివి..

    స్లైడ్ షోలో నమిత ఇంటర్వూ...

    కాస్త బరువు తగ్గినట్టున్నారే?

    కాస్త బరువు తగ్గినట్టున్నారే?

    నమిత మాట్లాడుతూ.... సినిమా పరిశ్రమకు వచ్చేటప్పుడు స్లిమ్‌గానే ఉండేదాన్ని. కానీ ఈ మధ్య బరువు పెరిగా. ఇంట్లో అమ్మానాన్న తిట్టారు. రోజూ వ్యాయామం, యోగా చేస్తున్నా. అందువల్లే కాస్త సన్నబడ్డా. మానసికంగానూ చాలా హాయిగా ఉంది.

    మీరు లేని ఈ రెండేళ్లలో కోలీవుడ్‌, టాలీవుడ్ లలో మార్పులపై మీ స్పందన

    మీరు లేని ఈ రెండేళ్లలో కోలీవుడ్‌, టాలీవుడ్ లలో మార్పులపై మీ స్పందన

    నేను కుటుంబ వ్యవహారాల కోసం ముంబయి వెళ్లిపోయాను. అమ్మ, నాన్నతో గడిపా. కోలీవుడ్‌కు ఎవరొచ్చారు.. ఎవరెళ్లారు.. హీరోయిన్స్ పరిస్థితేంటి.. వంటి విషయాలేవీ తెలియదు. ఈ మధ్యకాలంలో చాలా మంచి సినిమాలు వచ్చాయట. కానీ నా చిత్రం రాలేదేనన్న బాధ ఉంది. చాలామంది కొత్త నటీనటులు వచ్చారట. అది చాలా మంచి విషయమే కదా. ఎప్పటికప్పుడు కొత్తవాళ్లు వస్తే పరిశ్రమ చాలా సంతోషంగా ఉన్నట్లే అర్థం.

    ప్రస్తుతం తమిళ సినిమాలో గ్లామర్ క్వీన్ ఎవరు?

    ప్రస్తుతం తమిళ సినిమాలో గ్లామర్ క్వీన్ ఎవరు?

    నా అభిమానులకు ఎప్పటికీ నేనంటేనే ఇష్టం. 'మీరు తప్ప ఇంకెవరూ గ్లామర్‌క్వీన్‌ కాద'ని చెబుతున్నారు. ఎక్కడికైనా వెళ్తే.. అలాగే పిలుస్తున్నారు. ఇప్పటికీ నేనే అందాలరాణిని. కాదని చెబితే నా మచ్చాన్లు ఒప్పుకోరు!

    రాజకీయాల్లోకి రానున్నట్లు వార్తలొస్తున్నాయే?

    రాజకీయాల్లోకి రానున్నట్లు వార్తలొస్తున్నాయే?

    ఈ మధ్య ఉన్నట్టుండి రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. గత ఏడాదే రావాలనుకున్నా. ఇంకా ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకోలేదు. భాజపాలో చేరానని అందరూ అనుకుంటున్నారు. నిజానికి నాకు నారింజ రంగంటే ఇష్టం. ఎక్కువగా ఆ రంగు దుస్తులే ధరిస్తా. బహుశా అందువల్లే నేను ఆ పార్టీలో చేరానని ప్రచారం చేస్తున్నారేమో. ఆ పార్టీ ఏదో త్వరలోనే చెబుతా.

    ఎక్కడ నుంచి పోటీ చేస్తారు?

    ఎక్కడ నుంచి పోటీ చేస్తారు?

    తమిళనాడు నుంచే. ఎందుకంటే నేను తమిళమ్మాయిని! ఆదాయపు పన్ను కూడా ఇక్కడే కడుతున్నా. నా పాస్‌పోర్టు కూడా తమిళనాడు చిరునామాతోనే ఉంది. ఇక్కడికి వచ్చి పదేళ్లకు పైగా అవుతోందిగా. అందుకే నేను ఉత్తరాది అమ్మాయిని కాదు. అందువల్లే నేను రాష్ట్రపార్టీలోనే చేరుతా.. ఎందులో అనే విషయంపై ఇంకా ఏమీ అనుకోలేదు.

    మీరు గుజరాత్‌ అమ్మాయేగా. మోడీ హయాంలో మీరు గమనించిన మార్పు?

    మీరు గుజరాత్‌ అమ్మాయేగా. మోడీ హయాంలో మీరు గమనించిన మార్పు?

    సూరత్‌ గురించి తీసుకుందాం... పదేళ్లక్రితంతో పోలిస్తే ఇప్పుడంతా మారిపోయింది. వర్తక, వాణిజ్య కార్యకలాపాలు పెరిగాయి. చిన్న పట్టణంగా ఉన్న ప్రాంతం ఇప్పుడు వాణిజ్యకేంద్రంగా మారిపోయింది. చాలా గొప్పగా అభివృద్ధి చెందింది.

    మరి.. పెళ్లెప్పుడు?

    మరి.. పెళ్లెప్పుడు?

    ఐ లవ్‌ మై ఫ్యామిలీ. కానీ పెళ్లి గురించి ఆలోచించలేదు. 'పెళ్లి తర్వాత మీరు ఇంట్లోనే ఉండాలి. పిల్లల్ని కనాలి. నేను చెప్పిందే వినాలి..' అనే వారంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. నేను మధ్యతరగతి అమ్మాయిని. రోజూ పార్టీకి వెళ్లేదాన్ని అసలే కాదు. పెళ్లి చేసుకున్నా నా కెరీర్‌ ఇక్కడే కొనసాగిస్తా. నన్ను అర్థం చేసుకోగలిగిన వ్యక్తితోనే పెళ్లి. నాకు దక్షిణాది అబ్బాయిలంటే చాలా ఇష్టం. అందుకే ఇక్కడి కుర్రాడినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా.

    సామాజిక కార్యక్రమాలు ...

    సామాజిక కార్యక్రమాలు ...

    విదేశాల్లో వీధికొక్క మరుగుదొడ్డి ఉంటే మన దేశంలో మాత్రం అలాంటి పరిస్థితిలేదు... అదే విధంగా చెన్నై నగరంలో ఏర్పాటు చేయాలనుకున్నా... అందుకు నాకు చేయూతనివ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు

    ఇంకా ఏం చేస్తున్నారు

    ఇంకా ఏం చేస్తున్నారు

    రక్తదానం, నేత్రదానం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ పేదలకు సేవలందిస్తున్నా. పలు సంక్షేమ సంఘాలు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో ఎలాంటి లాభాపేక్ష లేకుండా పాల్గొంటున్నా . అంతే కాకుండా రాయపేటలో ఒక మహిళా మరుగుదొడ్డిని కట్టించి ప్రారంభించా.

    ఇంతకి నమిత ఏ రాజకీయ పార్టీలో చేరుతున్నట్లు?

    ఇంతకి నమిత ఏ రాజకీయ పార్టీలో చేరుతున్నట్లు?

    అయితే రాజకీయ రంగ ప్రవేశం చేయడానికే ముందు జాగ్రత్తగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తోందనే విమర్శలు ఎదుర్కొంటోంది ఆమె. ఇప్పటికే తమిళనాట ఒకప్పటి అందాల నటి కుష్బూ కూడా డీఎంకేలో చురుకైన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే నమిత ఏ పార్టీలో చేరుతుందనేది మాత్రం సస్పెన్స్లో ఉంచింది.

    English summary
    It seems Namitha is planning to enter politics, in view of the forthcoming elections to Lok Sabha. However, she is yet undecided about the political party she would join. 'I like Amma's governance in Tamil Nadu. But I am not sure whether I would join the AIADMK or not,' said the popular actress.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X