twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ.ఎన్టీఆర్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్స్ లేరన్న బాలయ్య

    By Srikanya
    |

    Nandamuri Balakrishna about jr.Ntr Fans
    హైదరాబాద్ : జూనియర్ ఎన్టీఆర్‌కు, తనకు అభిమానులు ఒక్కరే అని, ఇందులో ఎలాంటి భేషజాలు లేవని నందమూరి బాలకృష్ణ తెలపటం అంతటా చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బాలయ్య మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం తెలియచేసారు. దాంతో నందమూరి కుటుంబ అభిమానులే జూ.ఎన్టీఆర్ అభిమానులు అని తేల్చి చెప్పినట్లైంది. అంతేకాక ఎన్టీఆర్ ...తెలుగుదేశం ప్రచారానికి రాకపోయినా పెద్దగా నష్టపోయేదేమీ ఉండదని చెప్పినట్లు అయ్యిందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ ఏ విషయం దృష్టిలో పెట్టుకుని అన్నా ఎవరికి తోచినట్లు వారు ఈ విషయమై కామెంట్స్ చేసుకుంటున్నారు.

    రాజాంలో బాలయ్య సభకు జనం భారీగా తరలి వచ్చారు. బాలయ్య చెప్పిన లెజెండ్‌ సినిమా సంభాషణలు అభిమానులను ఉర్రూతలూగించాయి. భారీగా తరలి వచ్చిన జనాన్ని చూసి బాలయ్య ఉప్పొంగిపోయారు. సుదీర్ఘంగా మాట్లాడి వారిని ఆకట్టుకొన్నారు. బాలయ్యను చూసేందుకు భారీగా జనం తరలి రావడంతో పోలీసులకు తలకు మించిన భారమైంది. ఎండ తీవ్రంగా ఉన్నా.. బాలయ్య వచ్చేసరికి మధ్యాహ్నం 12 గంటలైంది. అయినా జనం కదల్లేదు. రాజాం రహదారిలో బస్సుని నిలిపి మాట్లాడారు.

    బాలకృష్ణ మాట్లాడుతూ... తెలుగు జాతిగా పుట్టినందుకు మనమెంతో గర్వపడాలి. కాకతీయ కాలంనాటి వైభవం, విజయనగరరాజులు ధన, కనకాలను రాశులుగాపోసి అమ్మేవారని పేరుంది. అలాంటి మన జాతి ఇపుడుసమస్యల్లో చిక్కుకుందని బాలకృష్ణ అన్నారు. దీన్ని పరిష్కరించి సామాజిక న్యాయం అందించే ఏకైక పార్టీ తెలుగుదేశమేనని చెప్పారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. మన తెలుగు జాతిని రాష్ట్రాన్ని కాపాడుకోగలిగే సమయం ఆసన్నమైందన్నారు.

    అలాగే తెదేపా కంచుకోట ఉత్తరాంధ్రని పార్టీ వ్యవస్థాపకుడు తన తండ్రి దివంగత ఎన్టీఆర్‌కు శ్రీకాకుళం జిల్లా అంటే ఎనలేని అభిమానమని అన్నారు. హిందుపురం నియోజకవర్గం నుంచి తాను పోటీచేస్తున్నప్పటికీ శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రచారం చేయడానికి వచ్చానని వివరించారు. మ మహిళలను గౌరవించే పార్టీ తెదేపా అన్నారు. తెదేపా హయాంలో శ్రీకాకుళం జిల్లా నుంచి తంగి సత్యనారాయణ, కావలి ప్రతిభాభారతి స్పీకర్‌ పదవులు అలంకరించారని, కేంద్ర మంత్రిగా కింజరాపు ఎర్రన్నాయుడు, ఇంకా ఎంతో మంది రాష్ట్ర మంత్రులను అందించామన్నారు. పార్టీకి సుశిక్షితులైన బలమైన క్యాడర్‌ ఉందన్నారు. భారతీయ జనతాపార్టీతో పొత్తు కుదిరినందున వారిని ప్రచారంలో తమతో కలుపుకుని పోతామన్నారు. పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదని తమను పదవులే వెతుక్కుని వచ్చాయన్నారు. కష్టపడే వారికి పార్టీలో మంచి స్థానం ఉంటుందన్నారు.

    English summary
    
 Balakrishna said that his fans and jr.Ntr fans are same. Earlier, Balakrishna stated that everyone is welcome to campaign for the party and we won't be inviting anyone specially. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X